breaking news
karman kaur thandi
-
భారత నంబర్‌వన్‌గా కర్మన్ కౌర్
ఐదేళ్ల తర్వాత భారత మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో నంబర్‌వన్‌గా కొత్త క్రీడాకారిణి వచ్చింది. 2017 నుంచి భారత టాప్ ర్యాంకర్‌గా కొనసాగుతున్న అంకితా రైనా సోమవారం విడుదల చేసిన సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. చెన్నై ఓపెన్ లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన కర్మన్ కౌర్ భారత కొత్త నంబర్‌వన్‌గా అవతరించింది. కర్మన్ 37 స్థానాలు ఎగబాకి 322వ ర్యాంక్‌కు చేరగా... చెన్నై ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన అంకిత నాలుగు స్థానాలు పడిపోయి 329వ ర్యాంక్‌లో నిలిచింది. -
Chennai Open WTA 2022: కర్మన్‌కౌర్ సంచలనం
చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారిణి కర్మన్‌కౌర్ థండి సంచలనం సృష్టించింది. సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 359వ ర్యాంకర్ కర్మన్‌కౌర్ 4–6, 6–4, 6–3తో ప్రపంచ 109వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ చోల్ పాక్వె (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కర్మన్ నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2014 వింబుల్డన్ రన్నరప్ యుజీన్ బుషార్డ్ (కెనడా)తో కర్మన్ ఆడుతుంది. -
కోహ్లి ఇలా ఎందుకు చేశాడు?
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు. ప్రమోషనల్ ఈవెంట్లలోనూ తానే ముందుంటాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా ప్రచారాల్లో పాల్గొంటాడు. మిస్టర్ ఫిట్ క్రికెటర్‌గా పేరొందిన విరాట్ పిచ్‌లో ఉంటేనే సీరియస్. బయట సమయాన్ని చాలా ఉల్లాసంగా సరదాగా గడిపేస్తాడు. దీనిలో భాగంగానే కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టిస్సాట్ వాచ్ కంపెనీ కార్యక్రమానికి విరాట్ హాజరైయ్యాడు. టిస్సాట్ కంపెనీ బాంద్రాలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లి అక్కడికి వచ్చిన ప్రత్యేక అతిథులకు వాచ్‌లను బహుకరించాడు. సత్నం సింగ్, కర్మాన్ కౌర్ తండీ, ఆదిల్ బేడీ, శివానీ కటారియా, సాచికా కుమార్ ఇంగాలె, జెహాన్ దారువాలా, పింకీ రాణీ, మనోజ్ కుమార్‌లు అతిథులుగా ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెన్నిస్ స్టార్ అయిన కర్మాన్ కౌర్ తండీతో ఫొటోకి ఫోజిచ్చాడు. కోహ్లి కంటే కర్మాన్ కౌర్ హైట్ కాస్త ఎక్కువగానే ఉండటంతో ఆఎత్తును సమానం చేసేందుకు అక్కడ ఉన్న మెట్లను వాడాడు. చాలా సరదాగా కేవలం ఫొటో కోసమే మాత్రమే కోహ్లి ఈ పని చేసినప్పటికీ నెటిజన్లు విపరీతంగా స్పందించారు. 'నువ్వేమైనా చేసుకో.. కానీ, ఆడాళ్లు మగాళ్ల కంటే ఎత్తు ఎప్పుడూ కాలేరు’ అని ఒకరు వ్యంగ్యంగా ట్వీట్ చేయగా,‘ ఇప్పటికే క్రికెట్లో ప్రత్యేక స్థానం సంపాదించిన 29 ఏళ్ల కోహ్లినేమో 175 సెం.మీలు. రైజింగ్ టెన్నిస్ స్టార్ 20 ఏళ్ల కర్మాన్ కౌర్ తండీనేమో 183సెం.మీలు. అలాంటిది ఈ పిక్చర్లో కోహ్లినే ఎత్తుగా ఎలా కనిపిస్తున్నాడు. టిస్సాట్కి ప్రచారానికి ఇదెలా ఉపయోగపడుతుంది’ అంటూ మరొకరు స్పందించారు. ‘ వాటే షేమ్. ఒక ఫేమస్ క్రికెటరైన కోహ్లి ఇలా ఎందుకు చేశాడు. కోహ్లి ఇలా అయితే ఎలా’ అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.