మార్కెట్లోకి ‘సుజుకీ లెట్స్’
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ : సుజుకీ లెట్స్110 సీసీ స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేశారు. స్థానిక బోట్‌క్లబ్ ఎదురుగా ఉన్న కంటిపూడి సుజుకీ షోరూమ్‌లో మొదటి కొనుగోలుదారుడు గ్రంధి ప్రభాకరరావుకు స్కూటర్ తాళాన్ని షోరూమ్ అధినేత కంటిపూడి సర్వారాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుజుకీ లైట్స్ 110 సీసీ స్కూటర్ ఎంతో హుందాగా ఉంటుందన్నారు. సెప్ ఇంజన్ టెక్నాలజీతో అత్యాధునిక ఇంధన సామర్థ్యంతో విప్లవాత్మకంగా సుజుకీ ఎకో పెర్ ఫార్మెన్స్ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారన్నారు. కేవలం 97 కిలోల బరువుతో పార్క్ చేయడానికి సులువుగా ఉంటుందని, లీటర్‌కు 63 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో సుజుకీ మార్కెటింగ్ మేనేజర్ రాజారావు, కంటిపూడి డెరైక్టర్స్ జగన్, వినయ్ పాల్గొన్నారు.
రాజమండ్రిలో..
రాజమండ్రి మోరంపూడి జంక్షన్‌లోని కంటిపూడి సుజుకీ షోరూంలో ‘లెట్స్’ 110 సీసీ స్కూటర్‌ను వాణిజ్య పన్నుల శాఖ అధికారి మురళీకృష్ణ గురువారం మార్కెట్లోకి విడుదల చేశారు. మొదటి కొనుగోలుదారు దండమూడి జ్యోతిశ్రీకి తాళం అందజేశారు. కార్యక్రమంలో షోరూం అధినేత కంటిపూడి సర్వారాయుడు, మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్, సంస్థ డెరైక్టర్లు జగన్, వినయ్ పాల్గొన్నారు.