breaking news
Kaneswaran Avili
-
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆఫర్
స్పైస్‌జెట్ విమాన టికెట్లపై 25% వరకూ డిస్కౌంట్ న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద దేశీయ రూట్లలో ప్రయాణించే నలుగురు లేదా అంతకు మించిన(నాలుగు నుంచి తొమ్మిది మంది) ప్రయాణికులకు విమాన టికెట్లలో 25 శాతం వరకూ డిస్కౌంట్‌నిస్తోంది. ఈ డిస్కౌంట్ బేస్ఫేర్కు వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ కింద ఒక్కో విమానంలో పరిమితమైన సంఖ్యలోనే సీట్లు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఈ ఆఫర్‌కు మంచి స్పందన లభించగలదని స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ అవిలి ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం చౌక ధరలకే విమానయానాన్నందించే సంస్థ ఇండిగో ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఫ్లైట్ ఆలస్యమైతే గిఫ్ట్ వోచర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రయాణం ఆలస్యమైనా, విమానం రద్దు అయినా ఇక నుంచి స్పైస్‌జెట్ ప్రయాణికులు గిఫ్ట్ వోచర్లు అందుకోవచ్చు. ఆన్ టైమ్ గ్యారంటీ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి స్పైస్‌జెట్ శ్రీకారం చుట్టింది. 60 నిముషాలపైన విమానం ఆలస్యమైతే రూ.500 వోచర్‌ను ఇస్తారు. అది కూడా మరోసారి ప్రయాణించినప్పుడు ఇస్తారు. విమానం రద్దు అయినా, 120 నిమిషాలపైన ఆలస్యమైనా రూ.1,000 వోచర్ అందుకోవచ్చు. నేటి నుంచే ఇది అమలులోకి వస్తుంది. ఇక్కడ ఒక నిబంధన ఉందండోయ్.. వాతావరణం అనుకూలించక పోయినా, ఎయిర్ ట్రాఫిక్ రద్దీ కారణంగా విమానం రద్దు, ఆలస్యమైనా వోచర్ ఇవ్వరు. సంస్థ వల్ల జరిగిన ఆలస్యానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వోచర్ వివరాలు, వినియోగించే విధానాన్ని ప్రయాణికులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా తెలుపుతారు. గత కొన్ని నెలలుగా సరైన సమయానికి సర్వీసులను నడుపుతున్నట్టు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరణ్ అవిలి ఈ సందర్భంగా తెలిపారు. తమ విమానాలు ఆలస్యం కావని హామీ ఇస్తున్నామని చెప్పారు.