breaking news
kanaganapalle by election
-
‘మంత్రి సునీతను బర్తరఫ్ చేయాలి’
-
‘మంత్రి సునీతను బర్తరఫ్ చేయాలి’
కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల్లో దౌర్జన్యానికి పాల్పడ్డ మంత్రి పరిటాల సునీతను బర్తరఫ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం పట్టణంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాప్తాడు నియోజవవర్గంలో గత 20 ఏళ్లుగా ప్రజాస్వామ్యమే లేదని, బీసీ నేతలు ఎంపీపీ కాకుడదన్నదే మంత్రి సునీత ఉద్దేశమని ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగానే లేఖ రాసినా ఏపీ డీజీపీ సాంబశివరావు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్ఆర్ సీపీకి మద్దతు ఇచ్చిన ఎంపీటీసీలను పోలీసులే పరిటాల పర్గీయుకలు అప్పగించడం దుర్మార్గం అన్నారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల అక్రమాలపై హెచ్ఆర్సీ, కోర్టులను ఆశ్రయిస్తామని వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు.