breaking news
Kabali movie audio
-
రజనీకాంత్ ఓ కోహినూర్ డైమండ్! - టీఎస్సార్
‘‘యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్.. రజనీకాంత్ ఏం చేసినా సూపరే. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆయన ఓ కోహినూర్ డైమండ్. అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ‘కబాలి’ బంపర్ హిట్ అవుతుందనిపిస్తోంది’’ అని కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి అన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కబాలి’. పా.రంజిత్ దర్శకుడు. తమిళంలో కలైపులి ఎస్.థాను నిర్మించారు. తెలుగులో షణ్ముఖ ఫిలింస్ పతాకంపై ప్రవీణ్‌కుమార్ వర్మ, కె.పి.చౌదరి విడుదల చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని వరుణ్ తేజ్ ఆవిష్కరించగా, షణ్ముఖ ఫిలింస్ లోగోని టి. సుబ్బిరామి రెడ్డి ఆవిష్కరించారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ - ‘‘నాటి ‘బాషా’లో కనిపించినట్లుగా ‘కబాలి’లో రజనీగారు కనిపిస్తున్నారు. హార్డ్‌వర్క్, సింప్లిసిటీకి ఆయన ఎగ్జాంపుల్’’ అన్నారు. నిర్మాత ప్రవీణ్‌కుమార్ వర్మ మాట్లాడుతూ - ‘‘తూర్పు గోదావరిలో డిస్ట్రిబ్యూటర్‌గా నా ప్రయాణం స్టార్ట్ చేశాను. ఓ పెద్ద సినిమా చేయాలని కేపీ చౌదరి అన్నప్పుడు ‘కబాలి’ బాగుంటుందనుకున్నా. రైట్స్ విషయంలో మోహన్‌బాబుగారు సహాయం చేశారు. ఆయనకు ధన్యవాదాలు. ఫైనాన్షియల్‌గా అల్లు అరవింద్ మద్దతునిచ్చారు’’ అన్నారు. ‘‘రజనీగారిని ‘రోబో’గా చూడడం కంటే ‘బాషా’గా చూడడంలో కిక్ ఎక్కువుంది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చేది ఆయన ఒక్కరే’’ అని నాని అన్నారు. ఈ వేడుకలో దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, రామజోగయ్య శాస్త్రి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
12న కబాలి పాటల ఆవిష్కరణ
ఒక్క దక్షిణ భారతీయ సినిమానే కాదు యావత్ ప్రపంచంలోని రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఆశగా ఎదురు చూస్తున్న వేడుకలో ఒకటి ఈ నెల 12న బ్రహ్మాండంగా జరగనుంది. అదే కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం. సూపర్‌స్టార్ చాలా గ్యాప్ తరువాత గ్యాంగ్‌స్టర్‌గా నటించిన చిత్రం కబాలి. నటి రాధికాఆప్తే నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున్న నిర్మిస్తున్న చిత్రం ఇది. కబాలి చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చిత్ర టీజర్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక వ్యాపార పరంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది కబాలి. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియోను ఈ నెల 12న స్థానిక వైఎంసీ మైదానంలో గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో అమెరికాలో విహార యాత్రలో ఉన్న మన సూపర్‌స్టార్ ఆ సమయానికి చెన్నై చేరుకుంటారని సమాచారం. ఇకపోతే రజనీకాంత్ అభిమానులకు మరో పర్వదినం ఏమిటంటే జూలై ఒకటో తేదీన కబాలి చిత్రం విడుదలవుతుందని ఇటీవల ఆ చిత్ర దర్శకుడు రంజిత్ వెల్లడించారు.