breaking news
just friends
-
మేం లవర్స్ కాదు.. జస్ట్ ఫ్రెండ్స్!
ప్లేటులో పెట్టిన బిర్యానీ ప్లేటులోనే ఉంది. ఇప్పుడు తినకపోతే నేను కరిగిపోతా అని ఐస్‌క్రీమ్ ఆశగా చూసినా ఊహూ... ఐసు, మనసు వాటి మీద ఉంటేనే కదా. వెళ్లింది లంచ్ డేట్‌కే అయినా కారణం వేరు. స్వీట్లు, హాటులు తినడంకన్నా స్వీట్ నథింగ్స్ చెప్పుకోవాలన్నదే మెయిన్ రీజన్. కారణం ఏదైనా లంచ్ డేట్‌కి వెళ్లిన ప్రేమ పక్షుల మీదే అందరి చూపు. ముంబైలోని రెండు ప్రముఖ రెస్టారెంట్స్‌లో రెండు జంటలు లంచ్ డేట్‌కి వెళ్లి హాట్ టాపిక్‌గా మారారు. ఒక జంట మథియాస్ బో–తాప్సీ అయితే మరో జంట టైగర్ ష్రాఫ్–దిశా పాట్నీ. ‘‘మీరంతా అనుకున్నట్లు మేం లవర్స్ కాదు.. జస్ట్ ఫ్రెండ్స్. అయినా లవ్‌లో పడితే మేమే చెబుతాం’’ అని ఈ రెండు జంటలూ కొన్ని సందర్భాల్లో చెప్పారు. మరి.. ఏమీ లేకపోతే ఈ లంచ్ డేటులూ, డిన్నర్ డేటులూ ఏంటమ్మా? అంటే.. నో ఆన్సర్. ‘‘మేమే చెబుతాం’’ అన్నారు కదా సమాధానం ఎదురు చూడటం కూడా కరెక్ట్ కాదేమో. ఇంతకీ మథియాస్ బోతో తాప్సీ లవ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి కదా.. ఆ మథియాస్ ఎవరంటే డెన్మార్క్‌కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓసారి మ్యాచ్ చూడ్డానికి వెళ్లినప్పుడే ఇద్దరి కళ్లూ కలిశాయని, పరిచయం ప్రేమగా మారిందని టాక్. ఇక, టైగర్, దిశా గురించి చెప్పాలంటే, రెండేళ్ల క్రితం ‘బేఫిక్రా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారని వార్త. ఆ తర్వాత ఇద్దరూ ‘భాగీ 2’ సినిమాలో జంటగా నటించారు. ప్రేమ రోజు రోజుకీ పెరుగుతోందట. కానీ మేం క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఏదేతైనేం ఔత్సాహికరాయుళ్ల నోటికి ఈ జంటలు మంచి మేత ఇస్తున్నాయి. -
‘జస్ట్ఫ్రెండ్స్’
షార్ట్ ఫిల్మ్ రివ్యూ ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఎంతో ప్రేమ ఉన్నా, పెళ్లికి సమయం దాటవేస్తుండటంతో ప్రేయసి తన స్నేహితురాలితో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని హాస్యపరిమళాన్ని కాస్తంత ఎక్కువగా జోడించి చిత్రీకరించిన ‘జస్ట్ఫ్రెండ్స్’ లఘుచిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బుల్లితెర నటుడు, సినీనటుడు భరత్‌రాజ్ ప్రధాన పాత్రలో మేఘన, సుచిస్మితలు నటీమణులుగా సినిమా టికెట్ సంస్థ ఈ లఘుచిత్రాన్ని నిర్మించింది. తన స్నేహితురాలితో కలిసి యువకుడికి కోపం తెప్పించి, తనలో మార్పును ఎలా తీసుకొచ్చారనే అంశానికి కామెడీ జోడించి పండించడంలో సఫలీకృతమయ్యాడు దర్శకుడు అర్షద్. భరత్ తన ప్రేమను తన స్నేహితులకు వివరిస్తూ తన ప్రేయసి స్నేహితురాలిపై ఉన్న కోపాన్ని, తమ ప్రేమ మధ్య ఎల్లప్పుడూ అడ్డంగా ఉండే ఆమెపై కోపం ఎలాంటి పరిణామాలకు దారితీసిందో చెప్పే సీన్లు కడుపుబ్బా నవ్వించాయి. ఈ చిత్రానికి మాటలు శ్రీతేజ అందించగా, సంగీతం మెహర్ చంటి, నిర్మాతగా దుశ్యంత్ వ్యవహరించారు.