breaking news
Julayi Remake
-
'సాహసం'లో నర్గీస్ ఫక్రీ ఐటెం సాంగ్
బాలీవుడ్ తార నర్గీస ఫక్రీ దక్షిణాదికి వచ్చింది. ప్రశాంత్ హీరోగా తమిళంలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 'సాహసం'లో ఆమె ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. ఇందులో ఆమెతో పాటు వంద మంది డాన్సర్లు పాల్గొంటారు. ఆమె నేరుగా హంగేరీ నుంచి విమానంలో చెన్నై వచ్చి ఈ షూటింగ్లో పాల్గొంటోంది. బిన్నీ మిల్స్ ప్రాంగణంలో దాదాపు వంద మంది డాన్సర్లతో కలిసి ఈ పాట షూటింగ్ జరుగుతోంది. తెలుగులో బన్నీ నటించిన సూపర్‌హిట్ చిత్రం జులాయికి తమిళ రీమేక్ 'సాహసం'. ఈ సినిమాలో తన పాట షూటింగ్ అయిపోయిన తర్వాత చెన్నై వీధుల్లో సరదాగా తిరగాలని కూడా నర్గీస్ ఫక్రీ భావిస్తోంది. ఇప్పటికే ఆమె ప్రశాంత్ బంగారు నగల దుకాణానికి వెళ్లిందని, ఆయన తండ్రి త్యాగరాజన్‌ను కూడా కలిసిందని సినిమా వర్గాలు తెలిపాయి. తాను గత ఏడేళ్లుగా కలవని ఓ స్నేహితుడు కూడా చెన్నైలో కలిశాడంటూ ట్విట్టర్లో ఫొటోతో సహా పెట్టింది. ఈ సినిమాలో ప్రశాంత్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. అరుణ్ రాజ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. Haven't seen my friend in 7 years! N I bump Into him in Chennai !!! Of all places in the... http://t.co/S19iT50drC pic.twitter.com/cVggXeyQwM — Nargis (@NargisFakhri) July 29, 2014 -
ఇలియానా పాత్రలో...
పళ్లకు క్లిప్, కళ్లకు జోడు... ఫ్యాషన్లకు పోకుండా సాదాసీదా పంజాబీ డ్రస్... ఇది ‘జులాయి’ సినిమా ఇలియానా ఆహార్యం. తన అందంపై తనకే నమ్మకం లేని అమ్మాయిలా కనిపిస్తారు ఆ సినిమాలో ఇలియానా. అలాంటి అమ్మాయిలో కూడా అందాన్ని చూస్తాడు బన్నీ. ‘ఓ మధూ.. ఓ మధూ’ అని ప్రేమించమంటూ ప్రాథేయపడతాడు. నిజంగా త్రివిక్రమ్... నవ్యమైన ఆలోచనకు ఇదో ఉదాహరణ. ఓ విధంగా ఈ తరం కథానాయికల పాత్రలతో పోలిస్తే...‘జులాయి’లో ఇలియానా చేసింది భిన్నమైన పాత్రే. అందుకే అనుకుంటా... ‘జూలాయి’ తమిళ వెర్షన్లో ఇలియానా పాత్రను మీరు చేస్తారా’ అని అడగడమే ఆలస్యం.. ‘సై’ అనేశారట తమన్నా. ప్రశాంత్ ఇందులో కథానాయకుడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందని సమాచారం. అంటే... త్వరలో తమన్నా కూడా పళ్లకు క్లిప్‌తో, కళ్లకు జోడుతో వెరైటీగా తమిళ తంబీలకు కనిపించనున్నారన్నమాట. మరి ఇలియానా కేక పుట్టించిన ఆ పాత్రను తమన్నా ఏ మాత్రం మెప్పిస్తారో చూడాలి.