నయీమ్ కేసులో ఇద్దరి అరెస్ట్
వలిగొండ/భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అరెస్టయిన వారిలో వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, దాశిరెడ్డిగూడానికి చెందిన జూకంటి భిక్షపతి అలియాస్ బుచ్చయ్యలు ఉన్నారు. పలు కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న నయీమ్ ప్రధాన అనుచరులను మంగళవారం భువనగిరి కోర్టులో హాజరు పరిచారు.
వరంగల్ జైలులో ఉన్న పాశం శ్రీను, సందెల సుధాకర్, భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌యాదవ్, కౌన్సిలర్ ఎండీ నాసర్, వారి అనుచరులు బచ్చు నాగరాజు, కత్తుల జంగయ్య, పులిరాజుతోపాటు మరో 5 మందిని కోర్టులో హాజరు పరిచారు.