breaking news
Joram Movie
-
సూపర్ హిట్ సినిమా డైరెక్టర్.. ఉండటానికి ఇల్లు లేక దీన స్థితిలో..
మనోజ్ భాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జొరమ్. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అనేక అవార్డులు ఎగరేసుకుపోయింది. ఈ సూపర్ హిట్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అద్దె పద్ధతిన అందుబాటులో ఉంది. పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈ మూవీ పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. సైకిల్ కొనేందుకు కూడా తాజాగా ఈ మూవీ దర్శకనిర్మాత దేవశిష్ మఖిజ తను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టాడు. 'నాకిప్పుడు 40 ఏళ్లు. కనీసం ఒక సైకిల్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. నేను తీసిన సినిమాలతో నేను కొంచెం కూడా డబ్బు కూడబెట్టుకోలేకపోయాను. ఇప్పటికీ అద్దె కట్టడానికి కష్టపడుతున్నాను. జొరమ్ మూవీ వల్ల నాకు లాభాలు రావడం కాదు కదా.. ఏకంగా దివాలా తీశాను. గత ఐదు నెలలుగా అద్దె కట్టడం లేదు. నన్ను ఇంటి నుంచి గెంటేయొద్దని మా ఓనర్‌ను వేడుకుంటున్నాను. కళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే ఇదిగో ఇలాంటి మూల్యమే దక్కుతుంది' అని బాధపడ్డాడు. రూ.1 కోటి పెడితే.. కాగా దేవశిష్ కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి సమస్యలతోనే సతమతమవుతున్నాడు. 2017లో అతడు అజ్జి అనే సినిమా తీశాడు. రూ.1 కోటి రూపాయలతో సినిమా తీయగా పెట్టుబడి అయినా వెనక్కు వస్తుందనుకున్నాడు. కానీ రూ.15 లక్షలు మాత్రమే వచ్చాయి. మొన్నటికి మొన్న జొరమ్ సినిమాతో నిండా మునిగిపోయాడు. తను నమ్ముకున్న కళ కోసం జీవితంలో ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు డైరెక్టర్. ప్రస్తుతం తన చేతిలో 20 స్క్రిప్టులదాకా ఉన్నాయని.. కానీ దాన్ని సినిమాగా మలిచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయాడు. చదవండి: మళ్లీ వచ్చేసిన మగజాతి ఆణిముత్యాలు.. సేవ్ ద టైగర్స్ 2 సిరీస్ ఎలా ఉందంటే? -
ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
పలు అవార్డులు గెలుచుకున్న సూపర్‌హిట్ థ్రిల్లర్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. గత కొన్నాళ్ల నుంచి సినీ ప్రేమికులు ఈ చిత్రం తెగ ఎదురుచూస్తూ వచ్చారు. తెలుగు మూవీ కానప్పటికీ దీని కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే చిన్న కండీషన్. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా సంగతేంటి? బాలీవుడ్లో గతేడాది రిలీజైన విభిన్నమైన సినిమాల్లో 'జొరమ్' ఒకటి. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా.. డిసెంబరు 8న థియేటర్లలో రిలీజైంది. కానీ అంతకంటే ముందే సిడ్నీ, డర్బన్, షికాగో, ఎడిన్‌బరో లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో దీన్ని ప్రదర్శించారు. అలానే బెస్ట్ యాక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ తదితర విభాగాల్లో అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ మధ్య కాలంలో అయితే ఫిలింఫేర్-2024లో ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) కథేంటి? జార్ఖండ్ అడవుల్లో నివసించే దస్రు-వాను అనే గిరిజన జంటకు జొరమ్ అనే మూడు నెలల కూతురు ఉంటుంది. ఊళ్లో పనిలేక పొట్టచేత పట్టుకుని ముంబై వస్తారు. బిల్డింగ్ కట్టే చోట రోజూవారీ కూలీలుగా పనిచేస్తుంటారు. అయితే తన కొడుకుని దస్రు చంపేశాడని అతడిని పట్టుకునేందుకు ముంబై వస్తుంది. భార్య వానుని చంపేయడంతో మూడు నెలల కూతురితో కలిసి దస్రు పారిపోతాడు. పోలీసుల నుంచి దాక్కుని మరీ సొంతూరికి పయనమవుతాడు. మరి నెలల కూతురితో కలిసి దస్రు ఊరికి చేరుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఏ ఓటీటీలో? ఆదివాసులకు ఉండే సమస్యలు, అడవులు విధ్వంసం లాంటి స్టోరీ లైన్‌తో తీసిన 'జొరమ్'.. దాదాపు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. హిందీలో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతానికి అయితే రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ వీకెండ్ సమ్‌థింగ్ డిఫరెంట్ ఉంటే సర్వైవల్ థ్రిల్లర్ చూద్దామనుకుంటే 'జొరమ్' ట్రై చేయొచ్చు. రియాలిటీకి దగ్గరగా ఉండే ఈ చిత్రం మరి ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)