breaking news
Joint entrance exams
-
మే నెలాఖరులోగా అన్ని సెట్స్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్) ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభించి మే నెలాఖరులోగా పూర్తి చేసేలా ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. జూన్‌లో ప్రవేశాలను చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో జూలైలోగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సెట్స్ కన్వీనర్ల ఎంపికపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏయే ప్రవేశ పరీక్షను ఏయే యూనివర్సిటీ నిర్వహించాలో ఖరారు చేసింది. సెట్స్‌కు కన్వీనర్లుగా నియమించేందుకు పేర్లను పంపించాలని రెండు రోజుల కిందట ఆయా యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి లేఖలు రాశారు. ఈ మేరకు వర్సిటీల నుంచి పేర్ల జాబితా రెండు మూడు రోజుల్లో రానుంది. యూనివర్సిటీలు పంపే మూడు పేర్లలో ఒకరిని కన్వీనర్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడనుంది. పాత కన్వీనర్లే మేలు! 2017 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షలను నిర్వహించిన కన్వీనర్లనే 2018లోనూ నియమించాలని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. తద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రవేశ పరీక్షలను నిర్వహించవచ్చని భావిస్తున్నాయి. ఈ మేరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) సెట్ కన్వీనర్‌కు ప్రతిపాదించిన పేర్ల జాబితా ఉన్నత విద్యా మండలికి మంగళవారమే అందింది. 2017లో పీఈసెట్‌ను విజయవంతంగా నిర్వహించిన ప్రొఫెసర్ సత్యనారాయణను 2018లోనూ కన్వీనర్‌గా నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇక అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను ఈసారి కూడా ప్రొఫెసర్ యాదయ్యకే అప్పగించేలా జేఎన్టీయూ ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఉన్నత విద్యా మండలి కూడా ఇదే అభి ప్రాయంతో ఉండటంతో మిగతా సెట్స్‌కు దాదాపు పాత కన్వీనర్లే ఖరారయ్యే అవకాశం ఉంది. రెండింటికి కొత్త వారు.. న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ను 2017లో నిర్వహించిన కన్వీనర్లు పదవీ విరమణ పొందారు. దీంతో ఈసారి ఆ రెండింటికి కన్వీనర్లు మారనున్నారు. మరోవైపు 2017లో లాసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా, 2018లో నిర్వహణ బాధ్యతలను ఓయూకు అప్పగిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. సెట్స్ వారీగా నిర్వహణ యూనివర్సిటీలు, కన్వీనర్లు సెట్ యూనివర్సిటీ కన్వీనర్ ఎంసెట్ జేఎన్టీయూ యాదయ్య ఈసెట్ జేఎన్టీయూ గోవర్ధన్ పీజీఈసెట్ ఉస్మానియా సమీన్ ఫాతిమా ఐసెట్ కాకతీయ కొత్తవారు లాసెట్ ఉస్మానియా కొత్తవారు ఎడ్‌సెట్ ఉస్మానియా దమయంతి పీఈసెట్ మహాత్మాగాంధీ సత్యనారాయణ -
విద్యార్థులకూ తప్పని జీఎస్టీ మోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులపైనా జీఎస్టీ భారం పడనుంది. వివిధ ఉమ్మడి ప్రవేశపరీక్షల (సెట్ల)కు హాజరయ్యే ఒక్కో అభ్యర్థి సగటున రూ. 70 వరకు అదనంగా చెల్లించాల్సి రానుంది. మొత్తంగా సుమారు 4.95 లక్షల మంది విద్యార్థులపై జీఎస్టీ రూపంలో రూ.3.5 కోట్ల అదనపు భారం పడనుంది. టీఎస్ ఆన్లైన్, ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ల అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వచ్చే విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంసెట్, లాసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్, పాలీసెట్ వంటి పరీక్షల ఫీజుపై పన్ను రూపంలో ఈ భారం పడనుంది. ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో.. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వివిధ కోర్సుల ప్రవేశపరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మంగళవారం ఉన్నత విద్యా మండలితో టీఎస్ ఆన్లైన్–టీసీఎస్ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ మేరకు ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశపరీక్షలను టీఎస్ ఆన్లైన్–టీసీఎస్ నిర్వహించనున్నాయి. గతేడాది విద్యార్థుల లెక్కతో.. పరీక్షల నిర్వహణ ఒప్పందం నేపథ్యంలో వి ద్యార్థులపై పడే జీఎస్టీ ప్రభావాన్ని టీఎస్ ఆన్ లైన్–టీసీఎస్ అంచనా వేశాయి. గతేడాది ప్రవేశపరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను బట్టి భారాన్ని తేల్చాయి. ఏటా సుమారు 4.95 లక్ష ల మంది వివిధ ప్రవేశపరీక్షలకు దరఖాస్తు చే సుకుంటున్నారు. ఇందులో ఒక్క ఎంసెట్‌కే దా దాపు 2 లక్షల మందికిపైగా విద్యార్థులు దర ఖాస్తు చేసుకుంటుండగా.. ఐసెట్‌కు దాదాపు 80 వేల మంది వరకు హాజరవుతున్నారు. మిగతావారు ఎడ్‌సెట్, ఈసెట్, పీఈసెట్, పీజీఈసెట్ వంటి పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వారు చెల్లించే పరీక్ష ఫీజుపై ఇప్పటివర కు పన్ను మినహాయింపు ఉండగా.. ఈ ఏడాది నుంచి జీఎస్టీ చెల్లించాల్సి రానుంది. ఈ భారం ఒక్కో విద్యార్థిపై రూ.70 వరకు ఉం టుందని అంచనా వేశారు. దీనికితోడు ఆన్లైన్, ప్రాసెసింగ్ ఫీజు కలిపి ఒక్కో విద్యార్థిపై రూ.100 నుంచి రూ.150 వరకు భారం పడే అవకాశముందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
మే 14న ఎంసెట్
* ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసిన విద్యా మండలి * మే 19న లాసెట్, 21న ఈసెట్, 22న ఐసెట్ * ఎడ్‌సెట్, పీఈసెట్, పీజీఈసెట్ తేదీలనూ ప్రకటించిన చైర్మన్ పాపిరెడ్డి * జేఎన్టీయూహెచ్, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు బాధ్యతలు * 15 శాతం ఓపెన్ కోటాలో ఏ రాష్ట్ర విద్యార్థులైనా పోటీ పడొచ్చు * దీనికోసం ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ సెట్స్ రాయాల్సిందే * ఉమ్మడి పరీక్షలను నిర్వహించే అధికారం మాకే ఉంది * ఉమ్మడి నిధులను ఏపీ మండలే వాడుకుంటోందని ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) తేదీలను రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. మే 14న ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. అలాగే వివిధ యూనివర్సిటీల నేతృత్వంలో లాసెట్/పీజీలాసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, పీజీఈసెట్‌లను నిర్వహించనున్నట్లు సోమవారం ఆయన మండలి కార్యాలయంలో మీడియాకు వివరించారు. హైదరాబాద్ జేఎన్టీయూతోపాటు ఉస్మానియా, కాకతీయ విశ్వ విద్యాలయాలకు సెట్స్ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. మండలి నిర్ణయం మేరకు మే 25 తేదీ నుంచి మూడు నాలుగు వారాల పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ కొనసాగుతుంది. జూన్ 4 నుంచి నాలుగైదు రోజులపాటు పీజీఈసెట్ ఉంటుం ది. ఏపీ కూడా సెట్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వేర్వేరు తేదీల్లోనే తెలంగాణ సెట్స్ ఉండేలా తేదీలను ఖరారు చేశారు. ఆర్టికల్ 371(డి) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని విద్యా సంస్థల్లో 15 శాతం ఓపెన్ కోటా సీట్లకు రాష్ర్ట విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడవచ్చని, అయితే ఏపీ సహా ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ సెట్స్‌ను రాయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు కన్వీనర్ల వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ఏపీ నుంచి స్పందన రానందునే... ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున, విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం ఆ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి జవాబుదారీగా పని చేయాలని పాపిరెడ్డి అన్నారు. కానీ నిబంధనలను తుంగలో తొక్కి విభజన చట్టానికి విరుద్ధంగా ఆ సంస్థ వ్యవహరించిందని పేర్కొన్నారు. ఏపీ సర్కారు ఆదేశాలను అనుసరిస్తూ.. తెలంగాణకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి రాజద్రోహానికి పాల్పడిందని మండిపడ్డారు. అందుకే విభజన చట్టంలోని నిబంధనల మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలిని రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దీని ఆధ్వర్యంలోనే సెట్స్‌ను నిర్వహించేలా చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. ఇందులోభాగంగా రెండు రాష్ట్రాలకు తామే ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈనెల 8న లేఖ రాశామని గుర్తు చేశారు. చట్ట ప్రకారం ఏపీకి కూడా సేవలు అందిస్తామని, ఓపెన్ కోటా ప్రవేశాల కోసం ఏపీ ప్రభుత్వ ప్రతినిధిని ప్రవేశాల కమిటీలో చేర్చుతామని, ఇందుకు పేరును ప్రతిపాదించాలని కూడా కోరినట్లు చెప్పారు. అయితే ఇప్పటికీ ఏపీ నుంచి స్పందన రాలేదన్నారు. అందుకే తెలంగాణ విద్యార్థుల కోసం సొంతంగా సెట్స్ నిర్వహించేందుకు తేదీలను ప్రకటించినట్లు ఆయన చెప్పారు. ‘‘ఏపీ కలిసి రానందునే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిబంధనల ప్రకారం ముందుకు సాగుతామని గతంలో గవర్నర్‌ను కలిసినప్పుడే చెప్పాం. ఆ మేరకు చర్యలు చేపట్టాం. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం కూడా పేర్కొంది’’ అని పాపిరెడ్డి తెలిపారు. నిధుల పంపిణీ విషయంలోనూ ఏపీ కౌన్సిల్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి నిధులను వాటా ప్రకారం తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ కౌన్సిలే వినియోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాల్సి ఉన్నా.. మండలి విభజన జరగలేదన్న సాంకేతికాంశాన్ని సాకుగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఏపీ మండలికి ఆ అధికారం లేనందున, ఆ ఖాతాలను నిలిపేయాలని బ్యాంకులను కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కాగా, మీడియా సమావేశానికి ముందు జరిగిన మండలి సమావేశంలో చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్లు మల్లేష్, వెంకటాచలం, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ఏపీ సెట్స్ ఖరారు ఏపీ నిర్వహించబోయే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రకటించింది. ఈ షెడ్యూల్ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని పేర్కొంది. కానీ తెలంగాణ విద్యా మండలి మాత్రం తెలంగాణకు ప్రత్యేకంగా తేదీలను ప్రకటించింది. దీంతో ఓ రాష్ర్టంలోని విద్యార్థులు మరో రాష్ర్టంలోని విద్యా సంస్థల్లో ఓపెన్ కోటాలో సీటు పొందాలంటే ఆ రాష్ర్ట సెట్స్ ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఏపీ సెట్స్ షెడ్యూల్ కేటగిరీ నిర్వహణ తేదీ ఎంసెట్ 10-05-2015 ఐసెట్ 16-05-2015 ఈసెట్ 14-05-2015 ఎడ్‌సెట్ 28-05-2015 లాసెట్/పీజీలాసెట్ 30-05-2015 పీఈసెట్ 14-05-2015 నుంచి పీజఈసెట్ 25-05-2015 నుంచి