ఫేస్బుక్లో చేరనున్న హీరోయిన్
ముంబై: బాలీవుడ్ నటి కాజోల్ అధికారికంగా సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్లో చేరనుంది. కాజోల్ తన భర్త, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్తో కలసి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో ఫేస్బుక్ కార్యాలయాన్ని ఈ రోజు సందర్శించనుంది.
అజయ్ దర్శకత్వం వహించిన శివాయ్ సినిమా ప్రమోషన్ కోసం ఈ జంట ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. కాజోల్, అజయ్.. న్యూయార్క్, చికాగో, డల్లాస్ నగరాలను సందర్శించారు. చివరగా శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. ఈ వివరాలు, ఫొటోలను కాజోల్ అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.