breaking news
Jogini Shyamala
-
పడిపోయిన బోనం.. జోగిని శ్యామల కన్నీరు
-
మహంకాళి బోనాల్లో అపచారం.. ప్రభుత్వంపై భగ్గుమన్న జోగిన శ్యామల
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో జోగినులకు తీవ్ర అవమానం జరిగిందని జోగిన శ్యామల ఆరోపించారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న జోగినుల సంప్రదాయాలకు తగిన గౌరవం కల్పించడంలో దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బోనాల ఉత్సవాల్లో జోగినులకు తగిన గుర్తింపు, మర్యాదలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా నిన్న జోగినిలకు జరిగిన అవమాన ఘటనపై జోగిన శ్యామల తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా శ్యామల.. బోనాల జాతరలో జోగినుల పాత్ర ఎంతో కీలకమైనదని, అయినప్పటికీ ప్రతి ఏడాది తమకు హామీలు ఇస్తున్న అధికారులు వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. జోగినుల సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను నిర్వర్తించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.కాంగ్రెస్ తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న జోగినీలు..,అమ్మవారికి సమర్పించే బోనాలని నేలపై పెట్టేలా చేశారంటూ ఆవేదన…🥺💔నేను మాత్రం ఇన్నేళ్లల్లో జోగినిల ఏడుపులు చూడలేదు..🥺 pic.twitter.com/vNtSmx40cn— ChAnduBRS✊🏻 (@IamPRVChAnduBRS) August 2, 2026దేవాదాయ శాఖ పరిధిలో జోగినులకు ప్రత్యేక స్థానం, అధికారిక హోదా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆలయ సంప్రదాయాల్లో భాగమైన జోగినుల సేవలకు గుర్తింపు ఇవ్వడంతో పాటు, ఉత్సవాల్లో వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల్లో జరిగిన అపచారాన్ని వెంటనే సరిదిద్దాలని శ్యామల డిమాండ్ చేశారు. జోగినుల గౌరవానికి భంగం కలిగించేలా జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని కోరారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.సికింద్రాబాద్ బోనాల్లో అపశృతిపోలీసులు నెట్టడంతో సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయిన జోగినులు.. అమ్మవారి బోనాలుప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కన్నీటి పర్యంతమైన జోగినులుబోనం కింద పడేసి మమ్మల్ని ఏడిపించడం ఈ ప్రభుత్వానికి, రాష్ట్రానికే అరిష్టమంటూ శాపనార్థాలు… https://t.co/FRwrbOHsnc pic.twitter.com/AwuRsbUp09— Telugu Scribe (@TeluguScribe) August 2, 2026జరిగిన పరిణామాల నేపథ్యంలో వారం రోజుల్లో తిరిగి అమ్మవారికి బోనం సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు శ్యామల ప్రకటించారు. సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రతి ఏడాది జోగినుల సమస్యలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మాటలు మాత్రమే కాకుండా ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని జోగినుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. జోగినుల సంప్రదాయం తెలంగాణ సంస్కృతి, బోనాల ఉత్సవాల్లో విడదీయరాని భాగమని పేర్కొన్న శ్యామల.. ఆ సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, దేవాదాయ శాఖపై ఉందన్నారు. జోగినుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి చర్యలు ఉండకూడదని, జరిగిన ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.బోనాల పండక్కి అరేంజ్మెంట్స్ నిజంగా చాలా గలీజ్ గా చేశారంటూ నిశాక్రాంతి…,#CongressFailedGovernment pic.twitter.com/eCeuLZ8PZZ— dinesh reddy (@dinni73799) August 2, 2026 -
మహంకాళి అమ్మవారి బోనాలకు శివశక్తుల దూరం..! రాష్ట్రానికి మంచిది కాదు..
-
బోనాల జాతరలో పరిచయం.. జోగిని శ్యామలపై పాతబస్తీ మౌనిక వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: జోగిని శ్యామలగా ప్రాచుర్యం పొందిన శ్యామలా దేవికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. తనకు భక్తురాలిగా పరిచయమైన పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలతో వేధింపులకు గురి చేస్తున్నట్లు సోమవారం శ్యామల సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన శ్యామల నగరంలో బోనాల సందర్భంలో ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటారు. బోనాలు సమర్పించే సమయంలో అనేక మంది భక్తులు ఆమె వెంట ఉంటారు. పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ సైతం ఇలానే శ్యామలకు పరిచయమయ్యింది. కొన్నాళ్ల క్రితం ఓ అంశానికి సంబంధించి ఇద్దరి మధ్యా స్పర్థలు వచ్చాయి. తనను వేధించిన వ్యక్తికి శ్యామల మద్దతు ఇస్తున్నారనేది మౌనిక ఆరోపణ. దీంతో కక్షకట్టిన ఆమె ఓ సందర్భంలో శ్యామల ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగింది. అయితే కొన్నాళ్లుగా శ్యామల ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలను మౌనిక పంపిస్తున్నారు. వాటిలో శ్యామలతో పాటు ఆమె కుటుంబాన్నీ కించపరిచే, అవమానించేలా అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్యామల సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. (చదవండి: ఎంతటి విషాదం.. భార్య మరణవార్త తెలియకుండానే భర్త కూడా..)


