breaking news
Jio Additional Data
-
జియో బంపర్ ఆఫర్, ఇక యూజర్లకు పండగే!
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం జియో భారీ ఆఫర్లతో మరోసారి తన యూజర్లను కట్టిపడేసింది. జియో రూ. 499 టారిఫ్ ప్లాన్లను సవరించి మరోసారి అడిషనల్ బెన్ఫిట్స్ను అందిస్తుంది. యూజర్లు రూ.499తో రీఛార్జ్ చేయించుకుంటే ప్రతి రోజు 2జీబీ డేటాతో పాటు డిడ్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. జియో రూ.499 ప్లాన్ బెన్ ఫిట్స్ యూజర్లు రూ.499తో రీఛార్జ్ చేయించుకుంటే ప్రతి రోజు 2జీబీ డేటాను పొందవచ్చు. అదే సమయంలో తగ్గిన 64 కేబీపీఎస్ డేటా స్పీడ్‌ను వినియోగించుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ షిప్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో జియో టూ జియో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్,రోజుకు 100 మెసేజ్‌లను సెండ్ చేసుకోవచ్చు. రూ.499ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ సంవత్సరం వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వినియోగించుకోవచ్చు. వీటితో పాటు జియో సినిమా, జియోటీవీని పొందవచ్చు. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ పొడిగింపు జియో న్యూఇయర్ రూ.2,545 ప్లాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గత డిసెంబర్ నెలలో జియో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 2వరకు వ్యాలిడిటీ విధించింది. కానీ ఇప్పుడు ఆ ఆఫర్‌ను జనవరి 7వరకు పొడిగించింది. రూ.2,545 ప్లాన్‌లో ప్రతిరోజు 100ఎస్ఎంఎస్లు, 1.5జీబీను 336 రోజులు వినియోగించుకోవచ్చు. హ్యాపీ న్యూయర్ ఆఫర్లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే యూజర్లు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను పొందవచ్చు. దీంతో 365 రోజులపాటు వ్యాలిడిటీ యూజర్లు వినియోగించుకోవచ్చు. చదవండి: రిలయన్స్ జియో కీలక నిర్ణయం...! ఇక యూజర్లకు పండగే..? -
ఆ యూజర్లకు జియో 25జీబీ అదనపు డేటా
సాక్షి, ముంబై : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ మార్కెట్లో దూసుకుపోతుంది. మరోవైపు టెల్కోలకు హడలెత్తిస్తూ డేటా ఆఫర్ల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా దేశీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండు ఇంటెక్స్ టెక్నాలజీ యూజర్లకు జియో అదనపు డేటా ప్రయోజనాలను ప్రకటించింది. ఇంటెక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అదనంగా 25జీబీ వరకు డేటాను అందించనున్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. ఈ స్కీమ్ కింద జియో కనెక్షన్ వాడుతున్న ఇంటెక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికీ.. సాధారణంగా రూ.309 రీఛార్జ్ లేదా ఆపై రీఛార్జ్‌లపై పొందే మొత్తాలకంటే అదనంగా ఒక్కో రీఛార్జ్‌పై 5జీబీ 4జీ డేటాను అందిస్తామని జియో తెలిపింది. ఇలా ఐదు రీఛార్జ్‌లపై జియో ఈ ఆఫర్ అందించనుంది. ప్రపంచపు అతిపెద్ద జియో ఎండ్ టూ ఎండ్ ఐపీ నెట్వర్క్, ఇంటెక్స్ ప్యాన్ ఇండియా మొబైల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కలిసి వినియోగదారులకు ఈ సేవలందించనున్నట్టు ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్, బిజినెస్ హెడ్ నిధి మార్కెండేయ చెప్పారు. గత నెలలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో కూడా జియోతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ భాగస్వామ్యం మేరకు ఒప్పో స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకూ జియో అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుచేసి, జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఎన్రోల్ చేసుకుంటే, అదనపు డేటా ప్రయోజనాలు జియో ఆఫర్ చేస్తోంది. ఆ కొత్త ఆఫర్ కింద ఒప్పో ఎఫ్3, ఎఫ్3 ప్లస్, ఎఫ్1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు అదనంగా ఒక్కో రీఛార్జ్‌పై 10జీబీ వరకు డేటాను ఉచితంగా అందిస్తోంది. మరోవైపు ఒప్పో ఎఫ్1ఎస్, ఏ37, ఏ33 మోడల్స్‌కు 7జీబీ వరకు అదనపు డేటాను ఇస్తోంది. ఆరు జియో రీఛార్జ్‌లపై కంపెనీ ఈ అదనపు ప్రయోజనాలను ఒప్పో యూజర్లకు అందించనుంది.