సొంత జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం కిరణ్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో పర్యటన కోసం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరారు. చెన్నై నుంచి హెలికాఫ్టర్‌లో సత్యవేడు సమీపంలోని శ్రీసిటీకి చేరుకుంటారు. అక్కడ అధికార, అనధికార ప్రముఖలతో సమావేశం అవుతురు.
ఆ తర్వాత శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌కు చేరుకుని వివిధ యూనిట్లకు భూమిపూజ నిర్వహిస్తారు.అనంతరం హెలికాప్టర్లో తిరుపతి చేరుకుని నగరంలో నిర్మించనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థానం చేస్తారు. అలాగే స్విమ్స్‌లోని పద్మావతి మహిళా వైద్య కళాశాల, చిత్తూరుకు నీటి సరఫరా పథకాలను శంకుస్థాపన చేస్తారు. జిల్లేళ్లమందలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో సీఎం కిరణ్ పాల్గొంటారు.