breaking news
Jawaharlal Nehru Port Trust
-
రూ. 180కోట్ల కుంభకోణంలో ఆర్థిక నేరస్థుడి ఆరెస్ట్
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్పీటీ) తరఫున నకిలీ (ఫోర్జరీ) లేఖలను సృష్టించి, ఆ సంస్థకు సంబంధించిన కోట్లాది రూపాయులను ఓరియుంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌నుంచి దొంగచాటుగా బదలారుుంచుకున్న ఆరోపణలపై గుజరాత్‌కు చెందిన ఒక ఆర్థిక నేరస్థుడిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. విచారణ అనంతరం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌నుంచి నట్వర్లాల్ బంగావాలాను శనివారం రాత్రి తాము అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ సోమవారం ప్రకటించింది. జేఎన్‌పీటీకి సంబంధించిన రూ.180కోట్ల నగదును రెండు ఓబీసీ శాఖలనుంచి ఎవరో దొంగచాటుగా బదలాయించుకున్నారన్న సంస్థ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో దర్యాప్తు కొలిక్కి వచ్చింది, జేఎన్పీటీ పేరిట జవు అరుున మొత్తం సొవుు్మ, ఏడు బ్యాంకులకు 12వుంది ఖాతాదార్లకు ఫోర్జరీ లేఖల ద్వారా బదిలీ అరుునట్టు తేలింది. ఇలా డబ్బును బదలారుుంచుకుని లబ్ధిపొందినవారిలో నట్వర్లాల్ బంగావాలా ఒకరని సీబీఐ తెలిపింది. -
జన్మ ధన్యమయింది!
సాక్షి, ముంబై: ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత మహారాష్ట్రలో తొలిసారిగా రాయగఢ్‌కు రావడంతో తన జన్మ ధన్యమయిందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న రాయగఢ్ ప్రాచీన హిందూ నగర రాజధాని అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా రాయగఢ్ నవశేవాలో రూ.నాలుగు వేల కోట్ల అంచనావ్యయంతో నిర్మించబోయే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి శనివారం భూమిపూజ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. నవశేవాలోని ‘జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్’ (జేఎన్పీటీ) సమీపంలో దీనిని నిర్మిస్తారు. బీజేపీ పాలనలో భూమిపుత్రులకు (అన్నదాతలు) అమిత ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై’ అన్న నినాదంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోడీ చివర్లోనూ ఇదే నినాదం చేసి రాయగఢ్ ప్రజల మనసులను గెలుచుకున్నారు. అదేవిధంగా నౌకాశ్రయాల అనుసంధానం కోసం రూ. 1,926 కోట్లతో నిర్మించనున్న రహదారి ప్రాజెక్టుకు కూడా మోడీ భూమిపూజ నిర్వహించారు. భూమిపుత్రులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ విద్య,ఆరోగ్యంతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాయగఢ్ పర్యటనతో తన జన్మ ధన్యమయిందని వ్యాఖ్యానించినప్పుడు చప్పట్లు మార్మోగాయి. ఈ సెజ్ కారణంగా నష్టపోయిన రైతులకు ఈ సందర్భంగా మోడీ చేతుల మీదుగా భూములు పంపిణీ చేశారు. విలాస్ జోషి, బాలకృష్ణ ధరణే, మధుకర్, ఠాకూర్, కమలాకర్ ధరణే తదితరులకు భూమి పత్రాలు అందజేశారు ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉంది... మనదేశానికి దిగుమతులకంటే ఎగుమతుల అవసరం అధికంగా ఉందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. యువశక్తితో ఎగుమతులను వృద్ధి చేయవచ్చన్నారు. ‘ఓడరేవులు దేశానికి ప్రవేశద్వారాలుగా మారాలి. ఎగుమతుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడాలి. ఇలా జరిగితే మన జాతి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. ప్రపంచమార్కెట్ లో మనదేశంసుస్థిరస్థానాన్ని సాధించగలుగుతుం ది. అంతర్జాతీయ విపణిలో సముద్రవాణిజ్యం అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కం టెయినర్లు హిందూ మహాసముద్రం మీదుగా వెళ్తున్నాయి. భవిష్యత్‌లో సముద్ర వాణిజ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని వివరించారు. అందుకే రేవు పట్టణాల్లో ‘సాగర్మాల’ పథకాలను ప్రారంభిస్తామని ప్రధాని ప్రకటించారు. వీటి వల్ల తీర ప్రాంతాలు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. చవాన్.. ఆందోళన చెందకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 146 సెజ్‌ల గురించి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ముందుకు కదలడం లేదని అన్నారు. దీనిపై నరేంద్ర మోడీ స్పందిస్తూ సెజ్‌ల పురోగతిపై ముఖ్యమంత్రి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.