breaking news
Jawaharlal Nehru pharmasiti
-
ఆయువు తీసిన వాయువు.. తోటి కార్మికుడు ఎంతకూ బయటకు రాకపోవడంతో..
పరవాడ (పెందుర్తి): విశాఖ జిల్లా పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో రాంకీ ఇంటర్మీడియట్ పంప్ హౌస్ వద్ద ఆదివారం రాత్రి విష వాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పాయకరావుపేటకు చెందిన మణికంఠ(22), తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన అన్నంరెడ్డి దుర్గాప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 10.05 గంటల సమయంలో దుర్గాప్రసాద్ పంప్ హౌస్ లోపలికి వెళ్లి మ్యాన్ హోల్ తెరవగా.. వాల్వ్ నుంచి అధిక మొత్తంలో విష వాయువులు లీకై గది నిండా వ్యాపించాయి. దీంతో దుర్గాప్రసాద్ ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. అతడు ఎంతకీ బయటకు రాకపోవడంతో మణికంఠ గది లోపలికి వెళ్లాడు. అతను కూడా విష వాయువులను పీల్చడంతో ఊపిరాడక పడిపోయాడు. ఇద్దర్నీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మరణించారు. రాంకీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.27 లక్షల చొప్పున పరిహారం, దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేల చొప్పున చెల్లించేందుకు రాంకీ యాజమాన్యం అంగీకరించింది. -
‘ఫార్మా’లో ప్రమాద ఘంటికలు!
కంటితుడుపుగా నివారణ చర్యలు అభ్యంతరాలతో నడుస్తున్న పరిశ్రమలు ఆందోళనలో కార్మికులు, ప్రజలు గ్లోకెమ్ ఘటనతో మరింత బెదురు పరవాడ : జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఔషధ పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలు కార్మికులు, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నగరంలోశుక్రవారం గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలు డు ఘటన కళ్ల ముందు కదలాడుతుండగానే ఫార్మాసిటీ గ్లోకెమ్ పరిశ్రమలో ఆ తరహా పేలుడుతో కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫార్మాసిటీలో 45 ఔషధ పరిశ్రమల్లో కొన్ని మాత్రమే ఎన్ వోసీలు పొందాయి. మిగిలినవి అనుమతులు తీసుకోకుండా జాప్యం చేస్తూ ఉత్పత్తులు సాగిస్తున్నాయి. ఇలావుండగా గత ఏడాది మే 30న గ్లోకెమ్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.60 కోట్ల ఆస్తినష్టం సంభవించింది. కార్మికులు భయం తో పరుగులు తీయడంతో అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పింది. ఇదే పరిశ్రమలో అంతకు ముందు విద్యుత్ షాక్‌తో ఒ కార్మికుడు ప్రాణా లు కోల్పోయాడు. 2009లో సంభవించిన రియాక్టర్ పేలుడులో ఇద్దరు కార్మికుల ప్రాణా లు గాలిలో కలిసిపోయాయి. స్థానిక ఆవ్రా పరి శ్రమలో 2013 మార్చి 17న జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. అప్ప ట్లో కార్మికులు అక్కడ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 2012 అక్టోబర్ 8న ఆక్టాస్ పరిశ్రమలోనూ భారీ అగ్ని ప్రమాదం సంభవించిం ది. గ్లోకెమ్ పరిశ్రమలో యుటిలిటీ బ్లాక్‌లో శనివారం జరిగిన ప్రమాదం కూడా అత్యంత తీవ్రమైందని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ఉత్పత్తిని ప్రారంభించిన గ్లోకెమ్ పరిశ్రమను పీసీబీ రెండేళ్ల క్రితం మూసి వే సిం ది. ఆ తరువాత యాజమాన్యం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పెనాల్టీ రుసుం చెల్లించి మళ్లీ పరిశ్రమను తె రిచింది. కొరవడిన భద్రతా ప్రమాణాలు పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. అవగాహన లేని కార్మికులతో పని చేయించడం, పైపు లైన్లో లీకేజీలు, రసాయనాలను కలపడంలో అ జాగ్రత్త, రియాక్షన్ కలిగిన రసాయనాలను అతి దగ్గరగా ఉంచడం, వాటికి దగ్గరగా విద్యుత్ పరికరాలతో పనులు చేయడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. భద్రత ప్రమాణాలను పాటించని పరిశ్రమలపై అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకొంటున్నారని ఆరోపణలున్నాయి. ఫార్మాసిటీలో అరకొర సౌకర్యాలు ఫార్మాసిటీ ఔషధ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన సౌకర్యాలు అరకొరగా ఉన్నాయి. ఫార్మాసిటీలో ఒకే ఒక్క అగ్నిమాపక శకటం, సిబ్బంది కొరతతో ప్రమాదాల వేళ సమీప అగ్నిమాపక కేంద్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాలను నివారించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణకు డ్రై కెమికల్ పౌడర్, ఫోమ్లను అందుబాటులో ఉంచాలి. వీటిపై యాజమాన్యాలు శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాదాలతో బెంబేలెత్తితున్న ప్రజలు పరిశ్రమల్లో ప్రమాదాలతో వాటికి చేరువలో ఉన్న తాడి, తానాం గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పరిశ్రమల్లోని సాల్వెంటు డ్రమ్ములు, రియాక్టర్లు, ట్యాంకుల వల్ల తరచూ సంభవిస్తున్న పేలుళ్లతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వణికిపోతున్నారు. రాత్రి వేళ పేలుళ్లు జరిగితే కుటుంబాలతో ప్రాణ భయంతో పరుగులు తీయాల్సివస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన అధికారులు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు.