IND vs OMAN: గర్వంగా ఉంది.. మా వాళ్లు సూపర్: ఒమన్ కెప్టెన్
భారత్ వంటి పటిష్ట జట్టుపై పసికూన ఒమన్ (IND vs OMAN) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకుంది. వరల్డ్ నంబర్ వన్ టీమిండియా చేతిలో ఓటమిని అంతతేలికగా అంగీకరించకుండా ఆఖరి వరకు పోరాటం చేసింది. చివరికి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైనా.. ఈ మ్యాచ్ ఒమన్ చరిత్రలో గుర్తుంచుకోదగ్గదిగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు.ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ తర్వాత ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ (Jatinder Singh) మాట్లాడుతూ.. తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘మా వాళ్ల ఆట తీరును చూస్తుంటే గర్వంగా అనిపించింది. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం,.గర్వంగా ఉంది.. మా వాళ్లు సూపర్ఎలాంటి పరిస్థితుల్లోనూ మా వాళ్లు పోరాట పటిమను వదల్లేదు. చివరి వరకు అద్భుతంగా పోరాడారు. ఇది నాకు గర్వకారణం. నిజానికి మా జట్టులో అంతగా అనుభవం ఉన్న ఆటగాళ్లులేరు. మా గురించి ఏమాత్రం హైప్ కూడా లేదు.అయినా సరే మేము ఇలా ఆడటం గొప్పగా అనిపించింది. మా దేశంలోనే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ జరుగబోతున్నాయి. ఇందుకు మా వాళ్లు సిద్ధంగా ఉన్నారు. పపువా న్యూగినియా, సమోవా జట్లను మేము ఎదుర్కోబోతున్నాము.అతడు హైలైట్ఏదేమైనా టీమిండియాతో మ్యాచ్‌లో మా వాళ్లు సూపర్. ముఖ్యంగా జితేన్ రామ్నంది రనౌట్లతో హైలైట్ అయ్యాడు. అతడు టీమ్ మ్యాన్. జట్టు కోసం ఏమైనా చేస్తాడు’’ అని జతీందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియాతో మ్యాచ్‌లో ఒమన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జితేన్ రామ్నంది రెండు వికెట్లు తీయడంతో పాటు.. హార్దిక్ పాండ్యా (1), అర్ష్‌దీప్ సింగ్ (1)లను రనౌట్ చేశాడు.ఇక ఒమన్ బ్యాటర్లలో కెప్టెన్ జతీందర్ సింగ్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. మరో ఓపెనర్ ఆమిర్ ఖలీమ్ (46 బంతుల్లో 64), వన్‌డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 51) మెరుపులు మెరిపించారు. అయితే, 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఒమన్ 167 పరుగులకే పరిమితమైంది.టీమిండియా వర్సెస్ ఒమన్ స్కోర్లు👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి👉టాస్: టీమిండియా.. తొలుత బ్యాటింగ్👉టీమిండియా స్కోరు: 188/8 (20)👉ఒమన్ స్కోరు: 167/4 (20)👉ఫలితం: ఒమన్‌పై 21 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్ (టీమిండియా- 45 బంతుల్లో 56).Awww… we agree with you @sanjaymanjrekar 😊Sending some virtual hugs from us too Jatinder! 🤗Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/A6ZIElXmhl— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025చదవండి: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్!