breaking news
jasmith
-
మధుభాల బయోపిక్ షురూ
‘ప్యార్ కియా తో డర్నా క్యా..’ అంటూ ‘మొఘల్ ఎ అజం’ (1960) చిత్రంలో వెండితెరపై అనార్కలిగా ప్రేమ కురిపించిన మధుబాలను నాటి తరం అంత సులువుగా మర్చిపోదు. ఈ తరం ప్రేక్షకుల కోసం ఆమె జీవితం వెండితెరకు రానుంది. ‘ఇండియన్ సినిమా సౌందర్య దేవత’గా కితాబులందుకున్న మధుబాల తన ఇరవయ్యేళ్ల కెర్ర్లో అరవైకి పైగా చిత్రాల్లో నటించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55, హాఫ్ టికెట్, మహల్, బాదల్’.. ఇలా పలు చిత్రాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు మధుబాల. 1933లో జన్మించిన మధుబాల అతి చిన్న వయసు (36)లోనే కన్ను మూశారు. ఈ 36 ఏళ్ల జీవితంలో మధుబాల సినీ, వ్యక్తిగత జీవితం గురించి తెలియని చాలా విషయాలను బయోపిక్‌లో చూపించనున్నారు. ప్రముఖ నటుడు దిలీప్‌కుమార్‌తో అనుబంధం, ప్రముఖ గాయకుడు, నటుడు కిశోర్‌కుమార్‌తో వివాహం వంటి విషయాలూ ఈ చిత్రంలో ఉంటాయట. ఆలియా భట్‌తో ‘డార్లింగ్స్’ చిత్రాన్ని తెరకెక్కించిన జస్మీత్ కె రీన్ మధుబాల బయోపిక్‌కి దర్శకురాలు. ఈ చిత్రాన్ని మధుబాల వెంచర్స్ పతాకంపై మధుబాల సోదరి మధుర్ బ్రిజ్ భూషణ్ నిర్మించనున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, బ్రూయింగ్ థాట్స్ ్రౖపైవేట్ లిమిటెడ్ కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉంటాయి. ‘‘ఈ చిత్రంతో ఎవరి మనోభావాలనూ దెబ్బ తీయాలనే ఆలోచన లేదు. మధుబాల జీవితం గురించి ఉన్న కొన్ని అపోహలను ఈ చిత్రం తొలగిస్తుంది. సినిమా కోసం కొంత స్వేచ్ఛ తీసుకున్నప్పటికీ నిజాయితీగానే రూపొందిస్తాం’’ అని మధుర్ పేర్కొన్నారు. ఇంకా కథానాయిక ఖరారు కాలేదు. కాగా శుక్రవారం ఈ బయోపిక్ ప్రకటన వచ్చినప్పట్నుంచి మధుబాలగా నటించే చాన్స్ ఏ కథానాయికకు దక్కుతుందనే చర్చ మొదలైంది. -
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి
రాయదుర్గం టౌన్ : రాయదుర్గం పట్టణంలోని 21వ వార్డు మారెమ్మగుడి సమీపంలో పది నెలల చిన్నారి ఎన్.జస్మిత్ డెంగీ లక్షణాలతో శనివారం ఉదయం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. తిప్పేస్వామి, రాధ దంపతులకు మూడేళ్ల కుమారుడు, పది నెలల కుమార్తె జస్మిత్ ఉన్నారు. గత ఆదివారం జస్మిత్‌కు జ్వరం రావడంతో ఆర్ఎంపీతో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లారు. ప్లేట్లెట్ కౌంట్ తక్కువ స్థాయికి పడిపోవడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కాగా ఇదే నెల ఒకటో తేదీ తహసీల్దార్ రోడ్డులో అల్తాఫ్ కుమార్తె ఆయేషా(6) డెంగీతో మృతి చెందిన విషయం తెలిసిందే. 20 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలావుండగా పట్టణంలోని అన్ని వార్డుల్లో విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ప్రతిరోజూ ఆస్పత్రికి దాదాపు 500 దాకా రోగులు వస్తుండగా ఇందులో 50కిపైగా జ్వర పీడితులు ఉంటున్నారు. వారంరోజుల క్రితం కూడా ముగ్గురికి డెంగీ పాజిటివ్‌గా గుర్తించి అనంతపురంలో చికిత్సలు అందజేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.