breaking news
janmabhumi committies
-
ఓట్లకోసం తెలుగుదేశం నాయకుల బరితెగింపు
-
'కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కొంటోంది'
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ పీపీ ఉద్యమం చేపడుతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చరించారు. నగరంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కొంటోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి నీచమైన కార్యక్రమాలకు దిగుతున్నారంటూ ఆ పార్టీ నేతలమై మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మోహన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.