breaking news
Janasabha
-
కాంగ్రెస్‌లోకి జనసభ అధ్యక్షుడు
సాక్షి, విజయవాడ : బడుగు, బలహీన వర్గాలతోపాటు అగ్రవర్ణ పేదలనూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. బీసీ జనసభ అధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ చేరిక సందర్భంగా ఆదివారం విజయవాడలో న్విహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాండ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి పల్లంరాజులు డాక్టర్ గంగాధర్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటాలు చేస్తుందని, గంగాధర్ రాకతో పార్టీకి పునర్వైభవం వచ్చిందని కేవీపీ అన్నారు. మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ ప్రధాని మోదీ తీరును ఎండగట్టారు. ‘‘పరిపాలనా దక్షత ఏమాత్రంలేని మోదీ.. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. చరిత్రలోనే లేనివిధంగా నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు మీడియా ముందుకు వచ్చారంటే దేశంలో పరిపాలన ఏవిధంగా సాగుతున్నదో అర్థంచేసుకోవచ్చు. గురువు అద్వానీకి కనీసం నమస్కారం పెట్టని మోదీ ఎంత కుసంస్కారో ప్రజలే అర్థంచేసుకోవాలి’’ అని పల్లంరాజు వ్యాఖ్యానించారు. -
48 గంటలు.. రూ. 48 లక్షలు
► నాచారం డివిజన్‌లోనే తిండి, నిద్ర ► ‘సాక్షి’ జనసభలో ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రకటన ► హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు ► ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు నాచారం: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘సాక్షి’ దినపత్రిక చేపట్టిన ‘జనసభ’లకు అనూహ్య స్పందన లభిస్తోంది. సమస్యలపై ‘సాక్షి’ సమరానికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ ఒకడుగు ముందుకు వేసి నాచారం డివిజన్లో 48 గంటలపాటు పర్యటిస్తానని, రూ.48 లక్షలు నిధులు ఖర్చుచేస్తానని ప్రకటించారు. డివిజన్‌లోనే తిండి, నిద్ర అంటూ స్పష్టం చేశారు. తాను ఇంటికి సైతం వెళ్లనని.. రెండు రోజుల పాటు డివిజన్‌లోనే పర్యటిస్తానన్నారు. ఉదయం అల్పాహారం ఒకరింట.. భోజనం మరొకరి ఇంట.. రాత్రి బస ఇంకొకరి ఇంట్లోనే ఉండేలా తన పర్యటన ఉంటుందని సభికుల హర్షాతిరేకాల నడుమ ప్రకటించారు. నాచారం హెచ్ఎంటీ నగర్ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం ‘సాక్షి’ జనసభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ... డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ లో వోల్టేజీ సమస్యను, రోడ్డు నిర్మాణాన్ని ఒక వ్యక్తి అడ్డుకుంటున్నారని గుర్తుచేశారు. వ్యక్తి ప్రయోజనాల కన్నా... వ్యవస్థ ప్రయోజనాలే ముఖ్యమని, అభివృద్ధిని అడ్డుకునేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. హెచ్ఎంటీ నగర్‌లోని ఫుత్‌పాత్‌లపై చిరువ్యాపారాల వల్ల పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఆయన దృష్టికితెచ్చారు. 19, 20 తేదీల్లో డివిజన్‌లోనే... నాచారం డివిజన్ అభివృద్ధికి రూ. 48 లక్షలు కేటాయించి డివిజన్‌ను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఈ నెల 19, 20 తేదీల్లో డివిజన్లో కార్పొరేటర్ సాయిజేన్ శాంతితో కలసి 48 గంటల పాటు పర్యటించి వెలుగులోకి వచ్చిన సమస్యలకు రూ. 48 లక్షలను కేటాయించి పరిష్కరిస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీహాల్స్‌ను త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు. హెచ్ఎంటీనగర్ పార్కులో ఉచిత వైఫై ఏర్పాటు చేయిస్తామని హెచ్ఎంటీ నగర్, ఎర్రకుంట పటేల్‌కుంట చెరువులను సుందరీకరిస్తామన్నారు. నాచారం డివిజన్ నుంచి బంగారు తెలంగాణకు నాంది పలుకుతామన్నారు. స్థానికులు పలువురు ఎమ్మెల్యే చొరవను అభినందిస్తూ ఇందుకు వేదికగా మారిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.