breaking news
jakkula venkataswamy
-
కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు
-
కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు
కరీంనగర్ : అత్యాచారం, హత్య కేసులో కరీంనగర్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం అనంతరం హత్య చేసిన నిందితుడి జక్కు వెంకటస్వామికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. కాటారం మండలం దామరకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాటారం మండలం దామెరకుంటలో ఈ ఏడాది పిబ్రవరి 28న నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన జక్కుల వెంకటస్వామి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు అనంతరం చిన్నారి దారుణంగా హతమార్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టు ముందు హజరు పర్చారు. కేసు విచారణ పూర్తి కావడంతో...కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి సురేష్ నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువడించారు. కరీంనగర్ కోర్టులో ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి.