breaking news
Jakimar Rehman
-
లఖ్వీ బెయిల్ ను సవాల్ చేసిన పాక్
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్ జకీమర్ రెహ్మాన్ లఖ్వీ కి ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్నిసవాల్ చేస్తూ పాకిస్థాన్ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు నిర్బంధంలో ఉన్న లఖ్వీని విడుదల చేయాల్సిందిగా ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అతను డిసెంబర్ 18 వ తేదీన బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే దీన్ని సవాల్ చేసిన పాక్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా మరోకేసులో లఖ్వీని మంగళవారం పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
మరో కేసులో లఖ్వీ అరెస్ట్
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి అయిన జకీమర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ పోలీసులు మరో కేసులో అరెస్టు చేశారు. ఈ దాడుల కేసులో లఖ్వీకి బెయిల్ రావడం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వం అతడిని ముందస్తు నిర్బంధంలో ఉంచింది. అయితే ఇస్లామాబాద్ హైకోర్టు ఈ నిర్బంధాన్ని తప్పుబట్టి, విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో లఖ్వీని విడుదల చేయడానికి కొద్ది గంటల ముందు... ఆరేళ్ల కిందటి కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అన్వర్ అనే వ్యక్తిని ఆరేళ్ల కింద కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపిస్తూ.. సోమవారమే ఈ కేసును నమోదు చేయడం గమనార్హం. దీంతో లఖ్వీని ఈ కేసులో అరెస్టు చేసి, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా... న్యాయమూర్తి పోలీసు కస్టడీకి ఇచ్చారు. అనంతరం పోలీసులు లఖ్వీని గుర్తుతెలియని ప్రదేశానికి తరలించారు.