breaking news
Jakabjuma
-
దక్షిణాఫ్రికాలో గుప్తా ఫ్యామిలీ అక్రమాలు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని ప్రముఖ వాణిజ్య సంస్థలకు అధిపతులైన గుప్తాల కుటుంబంలోని ఓ కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో సన్నిహిత సంబంధాలున్న గుప్తాల ఇళ్లపై పోలీసు దాడులు జరిగాయి. దక్షిణాఫ్రికాలోని ఫ్రీస్టేట్ ప్రావిన్సులో ఉన్న వ్రెడె అనే పట్టణంలో పాల ఉత్పత్తి కేంద్రం నుంచి పేదలకు చెందాల్సిన కోట్ల రూపాయల డబ్బును అధ్యక్షుడి అండతో గుప్తా సోదరులు అక్రమ పద్ధతుల్లో కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విషయమై జొహన్నెస్‌బర్గ్ శివారు ప్రాంతమైన శాక్సన్వల్డ్లో ఉన్న వారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేయగా వారిలో ఒకరు గుప్తా కుటుంబంలోని వ్యక్తి ఉన్నారు. జాకబ్ జుమాను పదవి నుంచి దిగిపొమ్మని ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) పార్టీ కోరడానికి కూడా గుప్తాలతో ఉన్న సంబంధాలే కారణమని తెలుస్తోంది. జాకబ్ జుమాపై అవిశ్వాసం! అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి జాకబ్ జుమాకు ఏఎన్సీ బుధవారం సాయంత్రం (నిన్న) వరకు గుడువిచ్చింది. ఆయన రాజీనామా చేయకపోతే పార్లమెంటులో గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతా మంది. రాజీనామా చేయాల్సిందిగా ఇప్పటికే జుమాను ఏఎన్సీ కోరగా ఆయన అందుకు నిరాకరిస్తున్నారు. ఏఎన్సీ నిర్ణయాన్ని తానెప్పుడూ ధిక్కరించలేదనీ, కానీ తనను ఎందుకు తొలగించాలనుకుంటున్నారో, తాను చేసిన తప్పేంటో ఎవరూ చెప్పడం లేదని జుమా అన్నారు. ఎవరీ గుప్తాలు? జాకబ్ జుమాను తమ గుప్పెట్లో పెట్టుకుని రాజ్యాంగాధికారాలు సైతం చెలాయించిన గుప్తా సోదరుల ప్రయాణం ఉత్తరప్రదేశ్ నుంచి మొదలైంది. యూపీ లోని సహారాన్పూర్కు చెందిన శాండ్‌స్టోన్ వ్యాపారి శివ్‌కుమార్ గుప్తాకు అజయ్, అతుల్, రాజేష్ ‘టోనీ’ గుప్తా అనే ముగ్గురు కొడుకులున్నారు. వీరు 1993లో జొహన్నెస్‌బర్గ్‌లో అడుగుబెట్టి విశాల వాణిజ్య సామ్రాజ్యం నిర్మించారు. కంప్యూటర్లు, వాటి విడిభాగాల వ్యాపారంతో ప్రారంభించి మీడియా, యురేనియం, బొగ్గు గనులు, రియల్ ఎస్టేట్, లోహాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల వరకూ విస్తరించారు. అడ్డగోలుగా వ్యాపా రాలు చేశారు. 2009లో దేశాధ్యక్షుడైన జుమాకు అత్యంత సన్నిహితులుగా మారి న గుప్తాలు.. పాలకపక్షమైన ఏఎన్సీని సైతం తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారు. ఊరి పేరుతో తొలి కంపెనీ.. గుప్తా సోదరులు తాము పుట్టి పెరిగిన సహారాన్పూర్ పేరు మీదుగా జొహన్నెస్ బర్గ్‌లో మొదటగా ‘సహారా కంప్యూట ర్స్’ను స్థాపించారు. ఇతర వ్యాపారాలకు విస్తరించాక 20 ఏళ్లలో అపర కుబేరుల య్యారు. 2013లో వారి సమీప బంధువు అనిల్ గుప్తా కూతురు పెళ్లికి చేసిన భారీ ఖర్చుతో వారి పేర్లు మార్మోగిపోయాయి. ఈ పెళ్లికి ఇండియా నుంచి 217 మంది అతిథులతో వచ్చిన విమానాన్ని వైమానికదళ స్థావరంలో దిగడానికి అనుమతించడంతో గుప్తాలు జుమాతో ఉన్న బంధాన్ని ఎలా వాడుకుంటున్నారో బయటపడింది. -
కలసికట్టుగా రక్షణ ఉత్పత్తి
-
కలసికట్టుగా రక్షణ ఉత్పత్తి
దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భేటీలో మోదీ ప్రతిపాదన - ఇరు దేశాల అవసరాలు తీరటంతో పాటు ప్రపంచ డిమాండ్‌నూ అందుకోవచ్చు - గనుల తవ్వకం, ఖనిజవనరుల రంగాల్లోనూ సహకారం మరింత బలోపేతం ప్రిటోరియా : భారత్, దక్షిణాఫ్రికాలు తమ సంప్రదాయ బంధాలను విస్తరిస్తూ.. కీలకమైన రక్షణ ఉత్పత్తి, తయారీ, గనులు, ఖనిజవనరుల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. అలాగే ఉగ్రవాదంపై పోరాటంలో, అంతర్జాతీయ వేదికలపై అంశాలలో క్రియాశీకలంగా సహకరించుకోవాలనీ తీర్మానించాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు, వ్యాపార అనుసంధానాలు, వాణిజ్యం, పెట్టుబడులే కాకుండా.. రక్షణ, భద్రత రంగాల్లోనూ ఇరు దేశాలూ భాగస్వాములు కావచ్చునని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జుమాతో పేర్కొన్నారు. భారత్‌లో రక్షణ రంగం సంపూర్ణంగా మారిపోతోందని అది అద్భుత అవకాశాలను అందిస్తోందని చెప్పారు. ప్రధాని ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా శుక్రవారం దక్షిణాఫ్రికా చేరుకున్నారు. ప్రిటోరియాలో జుమాతో సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మొత్తంగా సమీక్షించారు. రక్షణ పరికరాలు, వేదికల తయారీకి భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానమంటూ.. ఇరు దేశాల అవసరాలను తీర్చుకోవటం కోసమే కాకుండా.. ప్రాంతీయంగానూ ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న డిమాండ్‌కు స్పందించటానికి కూడా భారత్, దక్షిణాఫ్రికాలు చేతులు కలపాలని మోదీ పేర్కొన్నారు. ఆయుధాలను ఎగుమతి చేసే దేశాల్లో దక్షిణాఫ్రికా కూడా ఒక ముఖ్యమైన దేశం కావటం గమనార్హం. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేసుకున్న దరఖాస్తుకు దక్షిణాఫ్రికా మద్దతు ఇవ్వటం పట్ల ప్రధాని ఈ సందర్భంగా జుమాకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురు అగ్రనేతలూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. మహాత్మాగాంధీ గురించి ప్రస్తావిస్తూ ఆయన భారత్‌కు ఎంత చెందుతాడో దక్షిణాఫ్రికాకూ అంతే చెందుతాడని మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ భూమి మీద నడచిన అతి గొప్ప వ్యక్తులు ఇద్దరు మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాలకు నివాళులు అర్పించటానికి ఈ పర్యటన ద్వారా నాకు అవకాశం వచ్చింది’’ అని చెప్పారు. ఉగ్రవాదం అనేది సమాజపు పునాదులపైనే దాడి చేస్తోందంటూ.. దానిపై క్రియాశీలక సహకారంతో పోరాడాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. దక్షిణాఫ్రికాలో చిన్న, మధ్య తరహా వ్యాపారాల అభివృద్ధి కోసం భారత్ తన సామర్థ్యాలను పంచుకోవటానికి సిద్ధంగా ఉందన్నారు. ఐబీఎస్ఏ (ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి), బ్రిక్స్‌ల ద్వారా అంతర్జాతీయ ఎజెండాను రూపొందించటంలో ఇరు దేశాలూ కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో గోవాలో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షుడు జుమాను ఆహ్వానించటం కోసం తాను వేచిచూస్తున్నానని చెప్పారు. మోదీని ఆయన రెండో ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు జుమా పేర్కొన్నారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై తాము చర్చించామని.. అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేస్తామని చెప్పారు. 8 ఎంఓయూలపై సంతకాలు ఐబీఎస్ హైదరాబాద్‌తో గోర్డన్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం ప్రిటోరియా : భారత్, దక్షిణాఫ్రికాలు విస్తృత రంగాల్లో సహకారం కోసం 8 అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మోదీ పర్యటన సందర్భంగా జరిగిన దక్షిణాఫ్రికా- ఇండియా సీఈఓల వేదిక సమావేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, అంతర్జాతీయ రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించటం లక్ష్యంగా ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ► హిందుస్తాన్ జింక్ లిమిటెడ్.. భారత్‌లో భూగర్భ గనుల తవ్వకాల నిమిత్తం రాక్ సపోర్ట్ సిస్టమ్స్ అభివృద్ధి, సరఫరా కోసం మినోవా ఆఫ్రికా సంస్థతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. ఆధునిక యాంత్రీకృత భూగర్భ గనుల తవ్వకాల్లో భద్రత, పరికరాల సరఫరా, నిర్వహణ కోసం ఫెరెమెల్ సంస్థతో మరో ఒప్పందం చేసుకుంది. ళీ ఎంఎంఐ హోల్డింగ్స్, ఆదిత్య బిర్లా నువో సంస్థలు భారత్‌లో ఆరోగ్య-బీమా రంగంలో జాయింట్ వెంచర్ కోసం ఎంఓయూ కుదర్చుకున్నాయి. ► భారత్‌కు చెందిన వ్యర్థ, నీటి శుద్ధి సంస్థ ఐయాన్ ఎక్స్చేంజ్ సేఫిక్ దక్షిణాఫ్రికాలో భారీ స్థాయి నీటి, వ్యర్థ శుద్ధి ప్రాజెక్టుల కోసం స్టెఫానుటి స్టాక్స్ ఎస్ఏతో జట్టుకడుతుంది. ళీ భారత్‌లో భూతల ఎలక్ట్రానిక్ రక్షణ వ్యవస్థల ఉత్పత్తి చేయటం కోసం ఎస్ఏఏబీ గ్రినటెక్ డిఫెన్స్ సంస్థ టాటా పవర్ సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ళీ భారత రైల్వేల కోసం దెబ్బతిన్న రైల్వేలను పసిగట్టే అల్ట్రాసోనిక్ వ్యవస్థలను ఉత్పత్తి చేయటానికి, సాంకేతికత బదిలీకి పయనీర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియాకు ఆర్మ్స్కార్ సంస్థకు మధ్య ఎంఓయూ కుదిరింది. ► సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, విద్యార్థుల సందర్శన, ఉపాధ్యాయుల సందర్శన, సంయుక్త పరిశోధనల కోసం గోర్డన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ సైన్స్ సంస్థ.. ఐఎస్బీ హైదరాబాద్‌తో ఎంఓయూ చేసుకుంది ళీ డర్బన్‌లోని డ్యూబ్ ట్రేడ్ పోర్ట్‌కు, సిప్లా ఇండియా సంస్థకు మధ్య అతి పెద్ద ఎంఓయూ కుదిరింది. దీనికింద 130 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్ల వ్యయంతో స్పెషల్ ఎక్స్పోర్ట్ జోన్లో బయోసిమిలర్ ప్లాంటును నెలకొల్పనున్నారు.