breaking news
jailed six months
-
మైనర్ బాలిక అబార్షన్.. జైలు శిక్ష
జకార్త : మైనర్ బాలిక అబార్షన్ చేయించుకున్నందుకు స్థానిక కోర్టు బాలికకు ఆరు నెలలు జైలు శిక్షను విధించింది. ఈ ఘటన ఇండోనేషియలో శనివారం చోటుచేసుకుంది.15 ఏళ్ల బాలికపై ఆమె సోదరుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చింది. మైనర్ బాలిక గర్భం దాల్చడం ఇండోనేషియలో నేరంగా పరిగణిస్తారు. దీనిపై విచారించిన మౌరా బులైనా జిల్లా కోర్టు న్యాయమూర్తి లిస్టో అరిఫ్ బుడిమాన్ శనివారం తీర్పును వెలువరించారు. మైనర్ బాలిక అబార్షన్ చేయించుకున్నందుకు పిల్లల సంరక్షణ చట్టం ప్రకారం బాలికకు ఆరు నెలలు, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఆమె సోదరుడికి రెండేళ్లు శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. దీనికి బాలిక తల్లి కూడా సహకరించిందని కోర్టు తెలిపింది. బాలికపై ఆమె సోదరుడు గత ఏదాది సెప్టెంబర్ నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడాడు.ఇండోనేషియలో ఏటా 30 నుంచి 40 శాతం ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయని 2013లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఇండోనేషియాలో అమలులో ఉన్న చట్టాలపై ప్రపంచ ఆరోగ్య ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చట్టాల మూలంగా మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బాడిమన్ ఇచ్చిన తీర్పుపై న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. మైనర్‌గా ఉండి గర్భందాల్చినందుకు బాలికకు ఏడాది, ఆమె సోదరుడికి ఏడేళ్లు జైలు శిక్షను విధించాలని డిమాండ్ చేస్తున్నారు. -
జడ్జి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి జైలు
నిజామాబాద్: కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వారిని బెదిరించి, జడ్జి విధులకు ఆటంకం కలిగించిన ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శీతల్ సరిత బుధవారం తీర్పు ఇచ్చారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయరామ్ నాయక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన రహమాన్ ఓ క్రిమినల్ కేసులో విచారణకు 2013 డిసెంబర్ 17న నిజామాబాద్ ప్రత్యేక ప్రథమశ్రేణి సంచార న్యాయస్థానంలో హాజరయ్యాడు. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన అస్మా బేగంభాను, రజియా బేగంలను బెదిరించాడు. వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారా అంటూ కోర్టులోనే హల్చల్ చేశాడు. జడ్జి విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో అతనిపై ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. ఈ కేసులో జడ్జి సరిత బుధవారం తీర్పు ఇచ్చారు. నిందితుడికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.