ఆమిర్‌ఖాన్ ఇచ్చిన టోపి బాగా పనిచేస్తోంది.
గతంలో తన పేరిట ఉన్న రికార్డులను షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్‌లు తిరగ రాయడం వల్ల తనెలాంటి మనోవ్యధకు గురి కావడం లేదని సల్మాన్‌ఖాన్ చెప్పారు. త్వరలో విడుదల కానున్న ‘జయహో’ చిత్రం ప్రమోషన్లో ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ -‘‘ఆమిర్, షారుక్‌ఖాన్ చిత్రాలు ఏ రేంజ్లో బిజినెస్ చేశాయనేది నాకు ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను’’ అన్నారు. ఆమిర్ ఇచ్చిన టోపీని పెట్టుకుని ‘జయహో’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ‘‘ఆమిర్ ఇచ్చిన టోపి ధరించినప్పటి నుంచి అద్భుతమైన మార్కెటింగ్ ఆలోచనలు వస్తున్నాయి’’ అని చమత్కరించారు.