breaking news
jabong
-
మింత్రాలో జబాంగ్ విలీనం..
ముంబై: ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్ సంస్థ మింత్రాలో అనుబంధ సంస్థ జబాంగ్ విలీనం కానుంది. విలీనమైనప్పటికీ.. జబాంగ్ ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగుతుందని మింత్రా తెలిపింది. రెండు సంస్థల టీమ్‌కు ప్రస్తుత మింత్రా సీఈవో అనంత్ నారాయన్నే సారథిగా కొనసాగుతారు. ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలను మింత్రా తోసిపుచ్చింది. ఆన్లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2014లో మింత్రాను కొనుగోలు చేసింది. 2016లో జబాంగ్ను మింత్రా కొనుగోలు చేసింది. అప్పట్నుంచి రెండు బ్రాండ్స్ కార్యకలాపాలను క్రమంగా అనుసంధానం చేయడం జరుగుతోందని మింత్రా ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇకపై టెక్నాలజీ, మార్కెటింగ్, ఆదాయాలు, ఆర్థికాంశాలు మొదలైన వాటన్నింటినీ పూర్తి స్థాయిలో ఏకీకృతం చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు, మింత్రా సీఎఫ్‌వో దీపాంజన్ బసు తన పదవికి రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలతో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో పదవి నుంచి బిన్నీ బన్సల్ వైదొలిగిన దరిమిలా ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉద్యోగాల్లో కోత.. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి కింద పనిచేయాలనే కారణంతో మింత్రా సీఈవో అనంత్ నారాయణన్ కూడా రాజీనామా చేయొచ్చన్న వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఆయన తోసిపుచ్చారు. ‘నేను ఇందులోనే కొనసాగబోతున్నాను‘ అని అనంత్ స్పష్టం చేశారు. మింత్రా సహ వ్యవస్థాపకుడు ముకేశ్ బన్సల్ స్థానంలో 2015లో ఆయన సీఈవోగా చేరారు. మింత్రా, జబాంగ్ కార్యకలాపాల ఏకీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, ఫలితంగా కొన్ని ఉద్యోగాల్లో కోత ఉండవచ్చని అనంత్ తెలిపారు. అయితే, ఇది మొత్తం సిబ్బందిలో 10 శాతం కన్నా తక్కువే ఉంటుందని చెప్పారు. తొలగించిన ఉద్యోగులకు 3–8 నెలల జీతాలు చెల్లించడంతో పాటు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడంలో సహకారం అందించడం, వైద్య బీమా వ్యవధిని పొడిగించడం మొదలైన మార్గాల్లో తోడ్పాటు అందిస్తున్నామని అనంత్ చెప్పారు. -
జబాంగ్ బిగ్గెస్ట్ సేల్ ఈవెంట్: భారీ డిస్కౌంట్లు
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గత రెండు నెలలుగా సేల్ ఈవెంట్లతో వినియోగదారులను మైమరపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆన్లైన్ ఫ్యాషన్ మార్కెట్ ప్లేస్ జబాంగ్ కూడా అతిపెద్ద సేల్ ఈవెంట్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈ సైట్ ''బిగ్ బ్రాండ్ సేల్'' ను లాంచ్ చేసింది. నేటి(జూలై 29) నుంచి జూలై 31 వరకు అంతర్జాతీయ, జాతీయ బ్రాండులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అడిడాస్, లెవిస్, ప్యూమా, జాక్ అండ్ జోన్స్, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెట్టన్ వంటి బ్రాండ్లపై 40 శాతం నుంచి 71 శాతం వరకు తగ్గింపును జబాంగ్ అందిస్తోంది. అదనంగా ఎస్బీఐ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్, మొబిక్విక్లపై 10 శాతం క్యాష్ బ్యాక్‌ను జబాంగ్ ప్రకటించింది. ప్రతిరోజు జబాంగ్ నిర్వహించే కంటెస్ట్‌తో గెలుపొందిన వారు మలేషియాను ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సేల్‌తో రెవెన్యూల్లో గణనీయమైన వృద్ధిని నమోదుచేయాలని జబాంగ్ ఆశిస్తోంది. ఈ సేల్‌ను ప్రమోట్ చేయడం కోసం పలు సెలబ్రిటీలతో డీల్స్‌పై ప్రచారం కూడా నిర్వహిస్తోంది. ''మా అతిపెద్ద బ్రాండ్ సేల్‌ను నిర్వహించడానికి ఎంతో ఆసక్తికరంగా వేచిచూస్తున్నాం. రూ.400 కోట్ల విలువైన ఉత్పత్తులను దీనిలో అందిస్తున్నాం. జూలై 29వ తేదీ అర్థరాత్రి నుంచి ఈ సేల్‌ను ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే ఈ సేల్ గురించి పలు బ్రాండ్ల సీఈవోలు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. యువరాజ్ సింగ్, షాజ్మీన్లు వైడబ్ల్యూసీ బ్రాండును, బింద్రా బిబాను ప్రమోట్ చేస్తున్నారు'' అని కంపెనీ తెలిపింది. -
ఫ్లిప్‘కార్ట్’లోకి.. జబాంగ్
♦ డీల్ విలువ రూ. 470 కోట్లు... ♦ అనుబంధ సంస్థ మింత్రా ద్వారా కొనుగోలు న్యూఢిల్లీ : దేశీ ఈ-కామర్స్ రంగంలో మరో కీలక డీల్‌కు దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెరతీసింది. ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్ స్టోర్ జబాంగ్ను చేజిక్కించకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ మింత్రా ద్వారా ఈ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. జబాంగ్ను నిర్వహిస్తున్న గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్(జీఎఫ్జీ)తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ డీల్ విలువ 7 కోట్ల డాలర్లు(దాదాపు రూ.470 కోట్లు). గతేడాది జబాంగ్ ఆదాయంలో ఈ మొత్తం సగం కావడం గమనార్హం. కాగా, ఈ డీల్‌తో భారత్ ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ మరింతగా దూసుకెళ్లేందుకు దోహదం చేయనుంది. ప్రధానంగా మహిళల ఫ్యాషన్ అపారెల్(దుస్తులు) వంటి విభాగాల్లో గట్టి పట్టున్న జబాంగ్ను దక్కించుకోవడం ద్వారా మింత్రా.. ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్‌లో సత్తా చాటేందుకు వీలవుతుంది. వివిధ రకాల అనుమతులకు లోబడి ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఈ ఒప్పందం పూర్తికావచ్చనేది అంచనా. కాగా, జబాంగ్ కొనుగోలు రేసులో మరో ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్‌తో పాటు ఫ్యూచర్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఆన్లైన్ ఫ్యాషన్ స్టోర్ అబాఫ్ కూడా పోటీపడటం గమనార్హం. మింత్రాతో ఆరంభం... 2014లో మింత్రాను ఫ్లిప్‌కార్ట్ దాదాపు రూ.2,000 కోట్ల మొత్తానికి కొనుగోలు చేయడం తెలిసిందే. దేశీ ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద ఒప్పందంగా కూడా ఇది నిలిచింది. జబాంగ్ కొనుగోలుతో మింత్రా నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 1.5 కోట్ల మందికి చేరుకోనుంది. జబాంగ్ వద్ద 1,500 ఇంటర్నేషనల్ హై-స్ట్రీట్ బ్రాండ్స్, స్పోర్ట్స్ లేబుల్స్, ఇండియన్ ఎత్నిక్-డిజైనర్ లేబుల్స్ లిస్ట్ అయి ఉన్నాయి. 1,000కి పైగా సెల్టర్లు రిజిస్టర్ అయ్యారు. 2012 జబాంగ్ ఆరంభమైంది. అయితే, ఈ సంస్థకు ప్రధాన ఇన్వెస్టర్ అయిన రాకెట్ ఇంటర్నెట్.. లాటిన్ అమెరికా, రష్యా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాల్లో ఉన్న మరో నాలుగు ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్లతో జబాంగ్ను విలీనం చేయడం ద్వారా జీఎఫ్‌జీని ఏర్పాటు చేసింది. స్వీడన్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ కినెవిక్కు ఇప్పుడు జబాంగ్ మాతృ సంస్థ జీఎఫ్జీలో అత్యధికంగా వాటా ఉంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన 12 నెలలకు జబాంగ్ నికర ఆదాయం 12.6 కోట్ల యూరోలుగా నమోదైంది. కాగా, ఈ ఏడాది(2016) తొలి త్రైమాసికంలో ఆదాయం 14% ఎగసి 3.26 కోట్ల యూరోలకు చేరింది. విడి విడిగానే... మింత్రా, జబాంగ్‌లను అనుసంధానించే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని.. విడివిడిగానే ఇవి రెండూ కార్యకలాపాలను కొనసాగిస్తాయని మింత్రా సీఈఓ అనంత్ నారాయణ్ పేర్కొన్నారు. దీనికున్న 40 లక్షల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు, అనేక అంతర్జాతీయ బ్రాండ్ల నేపథ్యంలో రెండూ ఒకదానితో ఒకటి సమన్వయంతో ముందుకెళ్లాలనేది తమ ప్రణాళిక అని ఆయన చెప్పారు. కాగా, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) అంచనాల ప్రకారం దేశంలో ఆన్లైన్ రిటైల్ వ్యాపారం(ఈ-టైలింగ్) వార్షికంగా 57 శాతం వృద్ధిని సాధిస్తోంది. 2014 డిసెంబర్ నాటికి రూ.2,4046 కోట్లుగా ఉన్న మార్కెట్.. గతేడాది డిసెంబర్‌కు రూ.37,689 కోట్లకు ఎగబాకింది. ఈ ఏడాది చివరికల్లా ఇది రూ.72,639 కోట్లకు దూసుకెళ్తుందనేది ఐఏఎంఏఐ అంచనా. భారత్ ఈ-కామర్స్ పరిశ్రమ వృద్ధికి ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు కీలకంగా నిలుస్తున్నాయి. ఈ విభాగాల్లో దూసుకెళ్లడమే మా లక్ష్యం. మింత్రా ద్వారా ఇప్పటికే తగినంత మార్కెట్‌ను సొంతం చేసుకున్నాం కూడా. దేశీ ఈ-కామర్స్ రంగంలో కీలక పరిణామాలకు అనుగుణంగా మా గ్రూప్ సాగిస్తున్న ప్రస్థానానికి జబాంగ్ కొనుగోలు నిదర్శనంగా నిలుస్తుంది. - బిన్నీ బన్సల్, ఫ్లిప్‌కార్ట్ సీఈఓ, సహవ్యవస్థాపకుడు జబాంగ్ విక్రయం తర్వాత మా కీలక ఆన్లైన్ ఫ్యాషన్ స్టోర్స్ వృద్ధిపై దృష్టిపెట్టనున్నాం. లామోడా, డాఫిటి, నమ్షి, ద ఐకానిక్, జలోరా ఆన్లైన్ స్టోర్స్‌కు 24 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వీటిని విస్తరించనున్నాం. - లారెంజో గ్రాబూ, జీఎఫ్జీ చైర్మన్, కెనెవిక్ సీఈఓ