breaking news
jabardasth comedy team
-
నవ్వుల పండగ
లావేరు: మండలంలోని లావేరు గ్రామంలో జరిగిన చిన్న అసిరితల్లి సిరిమాను ఉత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి జబర్దస్త్ టీమ్, విశాఖకు చెందిన రోషన్ లాల్ ఆర్కెస్ట్రా సభ్యులు ఆటపాటలతో అలరించారు. జబర్దస్ కళాకారులు రాకెట్ రాఘవ, దొరబాబు, అప్పారావు, శాంతి స్వరూప్, రాజమౌళి, నాగిలు చేసిన స్కిట్లు ఆకట్టుకున్నాయి. స్థానికులు వీరితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. కార్యక్రమాలు చూడటానికి వేలాది మంది ప్రజలు వచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి లావేరు ఎస్ఐ సీహెచ్ రామారావుతో పాటు పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. -
కోర్టుకు హాజరైన జబర్దస్త్ టీం
హుజూరాబాద్ : ఈటీవీలో ప్రసారం అవుతున్న బజర్దస్త్ టీంలోని నటులు శుక్రవారం హుజూరాబాద్ సబ్కోర్టుకు హాజరయ్యారు. పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వర్రావు, ఫణి కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. అయితే నిర్మాత ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి, నాగబాబు, రోజా, రష్మీ, అనసూయ, మిగతా నటుల తరఫున న్యాయవాది ముక్కెర రాజు పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణకై న్యాయమూర్తి కంచె ప్రసాద్ కేసును జూన్ 30వ తేదీకి వాయిదా వేశారు. ఈటీవీలో 'జబర్దస్త్' కార్యక్రమంలో న్యాయవాద వృత్తిని అగౌరవ పరిచేలా ప్రసారం చేయడం ద్వారా సెక్షన్ 500 ఐపీసీ ప్రకారం నేరం చేశారంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన న్యాయవాది అరుణ్‌కుమార్ హుజూరాబాద్ సబ్ కోర్టును కేసు దాఖలు చేశారు. ఈ కేసులో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, సినీ నటి, ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు, యాంకర్లు అనసూయ, రష్మీలతోపాటు 22 మందికి సమన్లు జారీ అయ్యాయి.