breaking news
ITR-V Form
-
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. రేపే చివరి తేదీ!
2020-21 మదింపు సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)ని దాఖలు చేసి ఇంకా ఈ-వెరిఫై చేసుకోని వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయపు పన్ను విభాగం సూచించింది. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసిన 120 రోజుల్లో ఈ-వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-వెరిఫై చేసుకోలేకపోతే వాటిని 'డీఫెక్టివ్ రిటర్న్' అని అంటారు. గత రెండేళ్లుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంతోమంది రిటర్నుల ఈ-వెరిఫైని పట్టించుకోలేదు. దీంతో ఐటీ విభాగం ఈ ఏడాది ఐటీఆర్-వీ లేదా ఈ-వెరిఫికేషన్ సమర్పించకపోవడం వల్ల వెరిఫికేషన్ కోసం పెండింగ్'లో ఉన్న అన్ని ఆదాయపు పన్ను రిటర్నులను ఫిబ్రవరి 28, 2022 వరకు ధృవీకరించవచ్చని పన్ను శాఖ డిసెంబర్ 28, 2021న జారీ చేసిన సర్క్యులర్'లో తెలిపింది. ఫిబ్రవరి 28 వరకు ఈ-వెరీఫై చేసుకొనే అవకాశాన్ని ఇచ్చింది. ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంకు ఖాతా/డీమ్యాట్ ద్వారా ఈవీసీ ద్వారా ఇ-వెరిపై చేసుకునేందుకు వీలుంది. లేకపోతే.. సీపీసీ బెంగళూరుకు అక్నాలడ్డ్మెంట్ను పంపించాలి. లేకపోతే రిటర్ను సమర్పించినప్పటిక్సీ, అది చెల్లదు. Don’t miss the final chance to verify your ITR for AY 2020-21. Pl note that the ITR can be verified by several modes. The last date for verification is 28th February, 2022. Pl visit: https://t.co/GYvO3mStKf #ITR #VerifyNow pic.twitter.com/llkfxoppf3 — Income Tax India (@IncomeTaxIndia) February 26, 2022 (చదవండి: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం..భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ,ఎలక్ట్రిక్ కార్ల ధరలు?!) -
ఐటీ రిటర్న్స్: గుడ్ న్యూస్ చెప్పిన ఆదాయ పన్ను శాఖ!
IT Returns E Verification Date Extended: ఆదాయ పన్నుల చెల్లింపులు చేయడానికి 2021, డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలతో గడువు ముగిసింది. చాలామంది కోరుకున్నట్లుగా ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించలేదు. పైగా పొడిగింపు ఉద్దేశమే లేదంటూ చివరిరోజు స్వయంగా ప్రభుత్వమే ప్రకటన చేసింది. కానీ, రిటర్న్ దాఖలుచేసినా.. ఈ-వెరిఫై పూర్తి కానివాళ్ల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్ను వెరిఫై ప్రాసెస్ పూర్తి కానివాళ్ల కోసం ఊరట ఇచ్చింది ఆదాయ శాఖ. ఆన్లైన్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన టైంలో చాలామందికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్లైన్లో దాఖలు చేసిన తర్వాత రిటర్ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయటం అంటే.. పాన్‌తో ఆధార్ అనుసంధానమై, సంతకం అవసరం లేకుండా ఓటీపీ ద్వారా పంపటం. అయితే, ఓటీపీ వచ్చిన తర్వాత, పోర్టల్‌లో వేసినా ‘లోడింగ్’ కాకపోవడం వల్ల సబ్మిట్ అవ్వడం లేదు. దీనర్థం రిటర్నును దాఖలు చేసినప్పటికీ ఈ–వెరిఫై పూర్తి కాలేదని. ఇలా ఎంతో మంది .. గంటల తరబడి ప్రయత్నించినా వెరిఫై కాలేదు. ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకుని గడువును 2022 ఫిబ్రవరి 28 వరకూ డిపార్ట్మెంటు పెంచింది. ఇది కేవలం వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్న వారికి మాత్రమే. రిటర్నులు వేయడానికి పొడిగించినట్లు కాదు. వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే వారు వెంటనే వెరిఫై చేసుకోండి. ఇక పాన్‌తో ఆధార్ అనుసంధానం కాని వారు ‘‘వెరిఫై వయా ఫారం V’’ అని ఆప్షన్ పెట్టాలి. వారికి ఫారం V అంటే అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది. అటువంటి వారు ఫైల్ చేసిన రోజు నుంచి 120 రోజుల్లోగా ఫారంపై సంతకం చేసి బెంగళూరుకు పోస్ట్ ద్వారా పంపాలి. పైన చెప్పిన రెండు పద్ధతుల ద్వారా రిటర్న్ ఫైలింగ్ పూర్తి అయినట్లు చెప్పవచ్చు. గడువు తేది లోపల దాఖలు చేయకపోతే.. ఏ కారణం వల్లనైనా కానివ్వండి.. గడువు తేదీ లోపల రిటర్ను వేయలేకపోతే గాభరా పడక్కర్లేదు. ఈ ఆలస్యానికి, తప్పిదానికి, కాలయాపనకు ఒక వెయ్యి రూపాయలు లేదా రూ. 5,000 పెనాల్టీగా విధిస్తారు. ►1–1–2022 నుండి 31–3–2022 లోపల దాఖలు చేసినట్లయితే సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం రూ. 1,000 పెనాల్టీ చెల్లించాలి. రీఫండు క్లెయిమ్ చేసే వారికి ఆ రూ. 1,000 తగ్గిస్తారు. ► నికర ఆదాయం/ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 దాటి ఉంటే పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఈ రెండూ పెనాల్టీలే. చిన్న మొత్తాలతో వదిలిపోతుంది. ► నికర ఆదాయం లేదా ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 లోపలే ఉంటే గడువు తేదీ లోపలే వేసి ఉంటే రూపాయి కూడా పన్ను కట్టనవసరం లేదు. ► కొంత మందికి వ్యాపారం లేదా వృత్తిలో నష్టం వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసిన వారికి మాత్రమే ఆ నష్టాన్ని రాబోయే సంవత్సరానికి బదిలీ చేయడం సాధ్యపడుతుంది. ఇలా బదిలీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాలలో లాభానికి సర్దుబాటు (తగ్గింపు) చేసుకోవచ్చు. ► నష్టం ఉంటే సకాలంలో రిటర్నులు వేయనివారికి చాలా పెద్ద ఇబ్బంది. నష్టం. వారు నష్టాన్ని బదిలీ చేసుకునే హక్కును శాశ్వతంగా కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనా, రిటర్నులు సక్రమంగా సకాలంలో వేయడం అన్ని రకాలుగా మంచిది. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు -
ఐటీ రిటర్న్ దాఖలు..ఇలాగైతే ఈజీ!
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన గడువు ఇంకా నాలుగు వారాలే ఉంది. ప్రతి ఏటా రిటర్న్స్ దాఖలుకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ... గజిబిజి లెక్కలతో పన్నుల చెల్లింపుదారులకు గందరగోళం పెరుగుతుంది. చిన్నప్పుడు స్కూళ్లలో పైథాగరస్ థీరమ్స్, త్రికోణమితి లాంటి వాటి గురించి చెప్పారే తప్ప ఇలాంటి రోజువారీ అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పించలేదే...? అన్న బాధ కూడా కలుగుతుంటుంది. ట్యాక్స్ ఫైలింగ్ చాలా సంక్లిష్టమైన ప్రక్రియలా కనిపిస్తుండటమే దీనికి కారణం. సులభంగా రిటర్న్స్ ఎలా దాఖలు చేయాలో తెలియజేసేదే ఈ కథనం... సాధారణంగా వేతన జీవులు పన్నుల రిటర్న్ దాఖలు ప్రక్రియను చూసుకోవాల్సింది ఆఫీసే కదా మన పనేమీ ఉండదులే అనుకుంటుంటారు. కానీ, మీకు ఇతరత్రా ఆదాయ మార్గాలేమైనా ఉన్నా... లేక వేరే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా వాటి గురించి వెల్లడించకపోతే ఆ మేరకు మీకు వచ్చే డిడక్షన్ ప్రయోజనాలను ఆఫీసులో కల్పించలేకపోవచ్చు. కనుక, మీ పన్ను రిటర్నుల విషయంలో మీరు స్వయంగా పాలుపంచుకుంటే పన్ను లెక్కలు, డిడక్షన్లు సరిగ్గా ఉండేలా చూసుకోవడం వీలవుతుంది. పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం ఉన్న వారంతా... వారికి పన్ను కోత పడినా, పడకపోయినా ట్యాక్స్ రిటర్న్‌లను దాఖలు చేయాల్సిందే. రిఫండ్‌కు ఈ వివరాలుండాలి... మీ ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చినా... కొన్ని మినహాయింపుల వల్ల మీరు పన్నులు కట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయినప్పటికీ అదనంగా పన్ను ఏదైనా కట్ అయితే, దాన్ని తిరిగి పొందేందుకు (రిఫండ్) కూడా మీరు రిటర్న్ దాఖలు చేయాల్సి వస్తుంది. రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాక ఆదాయ పన్ను శాఖ అన్ని అంశాలు పరిశీలించి, సంతృప్తి చెందిన పక్షంలో డబ్బులు తిరిగిస్తుంది. రిఫండ్ కోసం ఈ-ఫైలింగ్ చేస్తున్నప్పుడు మీ బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు రిటర్న్ ఫారంలో తప్పులు లేకుండా పొందుపర్చాలి. మిగతావారికి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఫైలింగ్ తప్పనిసరి అయినప్పటికీ.. ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఫారమ్‌లు వర్తించే 80 ఏళ్ల పైబడిన వారు మాత్రం పేపరు రూపంలో ఉండే దరఖాస్తును కూడా సమర్పించవచ్చు. ఈ ఫైలింగ్ కోసం.. మీరు రిటర్నులను ఈ-ఫైలింగ్ చేశాక ఐటీ విభాగం మీకు ఐటీఆర్-వి ఫారంను ఈ-మెయిల్ చేస్తుంది. ఒక్క పేజీ ఉండే ఈ వెరిఫికేషన్ పత్రాన్ని మళ్లీ ఐటీ శాఖకు పంపిన తర్వాత మీ ఐటీ రిటర్ను ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. నిర్ణీత 120 రోజుల్లోగా దీన్ని పంపించకపోతే మరోసారి రిటర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్తగా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) వ్యవస్థను ప్రవేశపెట్టాక.. అక్నాలెడ్జ్మెంట్ ఫారంను తప్పనిసరిగా పోస్టులో పంపాల్సిన అవసరం తప్పింది. ఈవీసీని ఈ-ఫైలింగ్ వెబ్సైట్ లేదా ఆధార్ ఓటీపీ రూపంలో పొందటం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవచ్చు. ఆదాయ పన్ను శాఖ ఎంపిక చేసిన బ్యాంకుల్లో నెట్-బ్యాంకింగ్ ద్వారా కూడా ఈవీసీని పొందవచ్చు. ఇతర ఆదాయాలను తప్పనిసరిగా చెప్పాలి... పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ, ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ, పెన్షను, కిసాన్ వికాస్ పత్రాలపై వచ్చే వడ్డీ, జాతీయ పొదుపు పత్రాలపై వచ్చే వడ్డీ మొదలైనవి.. ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయాల కింద పరిగణనలోకి వస్తాయి. కనుక, వీటన్నింటినీ గురించి కూడా తప్పకుండా పొందుపర్చి, అవసరమైన పన్నులను కట్టడం శ్రేయస్కరం. పన్ను ప్రయోజనాలిచ్చే సాధనాలపై దృష్టి.. పన్నులపరమైన మినహాయింపు ప్రయోజనాలు అందించే కొన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అయిదేళ్ల వ్యవధి ఉండే ఫిక్సిడ్ డిపాజిట్లు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌లు, యులిప్స్, రియల్ ఎస్టేట్ మొదలైనవి ఈ కోవకి చెందినవే. రిస్కు సామర్థ్యాన్ని బట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్నుల భారాన్ని కొంత తగ్గించుకోవచ్చు. నివాస గృహంపైనా మినహాయింపులు.. అద్దె ఇంట్లో ఉంటున్న వారు హెచ్ఆర్ఏ మినహాయింపు ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుంది. సొంత ఇంటి కొనుగోలు కోసం రుణం తీసుకున్న వారు కూడా నిర్దిష్ట నిబంధనలను బట్టి.. రుణంపై కట్టే వడ్డీ మీద డిడక్షన్ క్లెయిము చేసుకోవచ్చు. వైద్య బీమాపై డిడక్షన్లు.. సెక్షన్ 80డీ కింద రూ. 40,000 దాకా (2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) మీ కుటుంబానికి తీసుకునే వైద్య బీమా పాలసీలతో పన్ను భారాన్ని త గ్గించుకోవచ్చు. సొంతానికి, జీవిత భాగస్వామికి, తమపైన ఆధారపడిన సంతానానికి సంబంధించి తీసుకునే పాలసీలు ఈ పరిధిలోకి వస్తాయి. తల్లిదండ్రులకు తీసుకునే మెడికల్ ఇన్సూరెన్స్‌పై కూడా డిడక్షన్ పొందవచ్చు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్‌కు సంబంధించి రూ. 5,000 దాకా డిడక్షన్ వెసులుబాటు ఉంది. ఐటీఆర్ ఫారం పరిభాషను తెలుసుకోవాలి.. ఆదాయమార్గాలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కో తరహా ఐటీఆర్ ఫారమ్ ద్వారా రిటర్నులను దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆదాయ వనరులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాక.. సరైన ఫారమ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా సర్వీసులు అందించేందుకు ప్రత్యేక సంస్థలు, నిపుణులు కూడా ఉన్నారు. అవసరమైతే వారి సహాయం తీసుకోవచ్చు. రెండేళ్ల దాకా ఫైలింగ్ .. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైలింగ్ చేయలేకపోతే.. రెండేళ్ల దాకా ఫైల్ చేసే వెసులుబాటు ఉంది. ఉదాహరణకు.. 2013-14 ఆర్థిక సంవత్సరపు రిటర్నుల దాఖలుకు 2014 జూలై 31 డెడ్‌లైన్. కానీ దీన్ని మిస్సయితే 2015 మార్చి 31 దాకా ఫైల్ చేయొచ్చు. అది కూడా వీలు కాకపోతే 2016 మార్చి 31 దాకా కూడా చేయొచ్చు. అయితే, ఇలా జాప్యం చేసినకొద్దీ పెనాల్టీలు పడతాయి. అంతే కాదు పన్నులేమైనా బకాయి ఉంటే వాటిపై వడ్డీ కూడా కట్టుకోవాల్సి వస్తుంది.