ITR: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. రేపే చివరి తేదీ!

ITR Verification: Check The Last Date To Verify ITR For AY 2020-21 - Sakshi

2020-21 మదింపు సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)ని దాఖలు చేసి ఇంకా ఈ-వెరిఫై చేసుకోని వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయపు పన్ను విభాగం సూచించింది. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసిన 120 రోజుల్లో ఈ-వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-వెరిఫై చేసుకోలేకపోతే వాటిని 'డీఫెక్టివ్ రిటర్న్' అని అంటారు. గత రెండేళ్లుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంతోమంది రిటర్నుల ఈ-వెరిఫైని పట్టించుకోలేదు. 

దీంతో ఐటీ విభాగం ఈ ఏడాది ఐటీఆర్-వీ లేదా ఈ-వెరిఫికేషన్ సమర్పించకపోవడం వల్ల వెరిఫికేషన్ కోసం పెండింగ్'లో ఉన్న అన్ని ఆదాయపు పన్ను రిటర్నులను ఫిబ్రవరి 28, 2022 వరకు ధృవీకరించవచ్చని పన్ను శాఖ డిసెంబర్ 28, 2021న జారీ చేసిన సర్క్యులర్'లో తెలిపింది. ఫిబ్రవరి 28 వరకు ఈ-వెరీఫై చేసుకొనే అవకాశాన్ని ఇచ్చింది. ఆధార్‌ ఓటీపీ, నెట్‌ బ్యాంకింగ్‌, బ్యాంకు ఖాతా/డీమ్యాట్‌ ద్వారా ఈవీసీ ద్వారా ఇ-వెరిపై చేసుకునేందుకు వీలుంది. లేకపోతే.. సీపీసీ బెంగళూరుకు అక్నాలడ్డ్‌మెంట్‌ను పంపించాలి. లేకపోతే రిటర్ను సమర్పించినప్పటిక్సీ, అది చెల్లదు.

(చదవండి: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం..భారీగా పెర‌గ‌నున్న స్మార్ట్ ఫోన్‌ ,ఎల‌క్ట్రిక్ కార్ల ధ‌ర‌లు?!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top