ఖమ్మంతో సంపూర్ణ విజయం
మంత్రి ఈటల వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ విజయం సంపూర్ణమైందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గెలుపుతో టీఆర్ఎస్ 99 శాతం విజయం సాధించినట్లయిందని.. వరంగల్, ఖమ్మం, అచ్చంపేటలలో పాగా వేయడంతో నూటికి నూరు శాతం తమ విజయ లక్ష్యం నెరవేరిందని ఈటల అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో కరీంనగర్, వరంగల్‌లో తప్ప టీఆర్ఎస్కు బలమే లేదనే అభిప్రాయాలు ఉండేవని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు తమ ప్రభుత్వంపై ఎనలేని విశ్వాసం ఉందని ఇప్పుడు రుజువైందన్నారు.