breaking news
Irfan Ahmed
-
పుట్టినరోజు.. వివాదాస్పద పోస్టర్ రిలీజ్..!
గోరఖ్ పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ లో బీజేపీ మైనారిటీ విభాగం మరోసారి వివాదాస్పద పోస్టర్ విడుదల చేసింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను రాముడిగా చూపిస్తూ, ఇతర పార్టీల నేతలను రావణుడి తలలుగా ప్రదర్శిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయనడంలో సందేహమే లేదు. బీజేపీ టౌన్ హాలులో కేక్ కట్ చేసి ఎంపీ పుట్టినరోజు నిర్వహించి, ఆ వెంటనే వివాదాస్పద పోస్టర్ ను విడుదల చేశారు. ఎంపీ యోగి ఆదిత్య నాథ్ రాముడి రూపంలో ఉండగా, బీఎస్పీ, కాంగ్రెస్, ఆప్, ఏఐఎంఐఎం, జేడీయూ, ఎస్పీ పార్టీలను రావణుడిగా పేర్కొనేలా తలలపై పార్టీల పేర్లు ముద్రించారు. యూపీ బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్ అహ్మద్ మాట్లాడుతూ.. నేడు ఎంపీ ఆదిత్య నాథ్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించాం, కేక్ కట్ చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా తమ పరిస్థితి ఏంటన్నది గ్రహించాలని, వచ్చే ఎన్నకల్లో విజయం బీజేపీదేనని తెలియజేసేందుకు ఆయా పార్టీలను రావణుడితో పోల్చి చూపించామని పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీని గాడిదగా పేర్కొంటూ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ లో బీజేపీ మైనారిటీ విభాగం ఒకటి గోడ పత్రికలు అంటించింది. ఒక్క రాహులే కాదు.. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మాయావతి, అసదుద్దీన్ ఓవైసీలు గాడిదలు తోలుతున్నారని పేర్కొంటూ.. బీజేపీ నేత యోగి ఆదిత్య నాథ్ ను పులితో పోలుస్తూ ఆయన పులిపై సవారీ చేసే వ్యక్తిగా అభివర్ణిస్తూ పోస్టర్ విడుదల చేసి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. -
హాంకాంగ్ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం
దుబాయ్: హాంకాంగ్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ అహ్మద్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రెండున్నరేళ్లు నిషేధాన్ని విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించాడన్న ఆరోపణలతో ఐసీసీ 2015 నవంబర్ 4న అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో బుకీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని ఇర్ఫాన్‌ను సంప్రదించినట్లు ఆరోపణలు వచ్చాయి. అవినీతికి పాల్పడకపోయినా, ఆ విషయాన్ని ఏసీయూ దృష్టికి తీసుకురానందుకు నిషేధం పడింది.