breaking news
Irandam Ulagam
-
అనుష్క ఉదారత
సినిమా అనేదే జంతర్ మంతర్. ఇక తారల మాటలు ఉల్టాపల్టీలు అంటుంటారు. 99 శాతం మంది మాటలకు చేతలకు పొంతన ఉండదనే వారు లేకపోలేదు. నటీనటులు చాలామంది అనే మాటలు పారితోషికానికి ప్రాధాన్యతనివ్వ ను. పారితోషికం లేకుండా నటిస్తాలాం టివి ఎన్నో వింటుంటాం. ఆచరణకు వచ్చేసరికి పారితోషికం అంత కావాలి, ఇంత ఇస్తేనే నటిస్తానంటూ డిమాండ్ చేస్తుంటారు. అలాంటిది నటి అనుష్క తాజా చిత్రానికి పారితోషికం చాలా తగ్గించుకుని నటిస్తున్నారన్న సమాచారం పరిశ్రమ వర్గాలకు తీయని వార్తగా మారింది. అసలు విషయంలోకి వెళితే ఇంతకుముందు ఆర్య, అనుష్కలతో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇరండాం ఉలగం ఈ చిత్రం తమిళంతోపాటు, తెలుగులోను ప్రేక్షకులను నిరాశ పరచింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థకు తీరని నష్టం కలిగిందని సమాచారం. అదే చిత్ర నిర్మాణ సంస్థ మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నూ ఆర్య, అనుష్కలే నాయికా నాయకులు విశేషం. ప్రస్తుతం అత్యధిక పారితోషికం పొందుతున్న దక్షిణాది నాయికల్లో మొదటి స్థానం అనుష్కదే. ఈ ముద్దుగుమ్మకు తెలుగు పరిశ్రమకు సమానంగా తమిళ చిత్ర పరిశ్రమలోను మార్కెట్ ఉంది. దీంతో అనుష్క సుమారు రూ.3 కోట్ల పారితోషికం పుచ్చుకుంటోందట. తాజా చిత్రానికి తన పారితోషికాన్ని భారీగా తగ్గించుకున్నట్లు తెలిసింది. ఆమే కాదు ఆర్య కూడ తన పారితోషికాన్ని తగ్గించుకున్నారట. చిత్ర నిర్మాతల స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా అధి క పారితోషికాలను గుంజే నటీనటుల మధ్య అనుష్క, ఆర్య లాంటి ఉదార స్వభావం గల వారు ఉండడం విశేషమే కదా! -
ఆరు నెలల వరకు అగాల్సిందే: అనుష్క
మరో ఆరు నెలల వరకు కొత్త చిత్రాలలో నటించేందుకు ఒప్పుకునేది లేదని టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి వెల్లడించింది. ప్రస్తుతం రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో మహాబిజీగా ఉన్నట్లు చెప్పింది. అదికాక ఆ రెండు చిత్రాలలో కొన్ని సన్నివేశాల కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్దాలు నేర్చుకోంటున్నట్లు వివరించింది. అంతేకాకుండా ఆ రెండు చిత్రాల షూటింగుల్లో పాల్గొనడంతో ఉన్న సమయం అంతా వాటిలో నటించడానికే సరిపోతుందని తెలిపింది. రుద్రమదేవి, బాహుబలి చిత్రాలు షూటింగ్ పూర్తి అయ్యేవరకు విరామం అనేది ఉండదని చెప్పింది. బహుశ ఆ చిత్రాలు వచ్చే ఏడాది మొదట్లో విడుదల కావచ్చని చెప్పింది. అప్పుడు కానీ తనకు కాస్త విరామం దొరుకుంది, ఆ సమయంలో కొత్త చిత్రాలలో నటించేందుకు ఆలోచిస్తానని అనుష్క తెలిపింది. అయితే ఈ ఏడాది మొదట్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న తమిళ చిత్రం ఇరందమ్ ఉలగమ్ విడుదల కోసం ఎదురుస్తున్నట్లు చెప్పింది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తెలుగు, తమిళంలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.