breaking news
International Tennis Association Womens Championship
-
Aquatic Championship: రజతం గెలిచిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ మూడో పతకం సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి రజత పతకం గెలిచింది. వ్రితి 9ని:17.62 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. భవ్య సచ్దేవ (ఢిల్లీ; 9ని:15.59 సెకన్లు) స్వర్ణం, అనన్య (మహారాష్ట్ర; 9ని:24.67 సెకన్లు) కాంస్యం నెగ్గారు. క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయిలు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి తమ భాగస్వాములతో కలిపి డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. థాయ్‌లాండ్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–1, 6–3తో పవిని –జులాలక్ (థాయ్‌లాండ్) జంటపై... సహజ–సోహా (భారత్) జోడీ 6–3, 3–6, 10–6తో ఆన్ యుజిన్ (కొరియా)–ఇకుమి (జపాన్) ద్వయంపై గెలిచాయి. -
నిధి, సౌజన్య ముందంజ
ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సంఘం (ఐటీఎఫ్) మహిళల చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 10 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నిధి 7-6 (7/5), 6-4 స్కోరుతో మన రాష్ట్రానికే చెందిన కాల్వ భువనపై విజయం సాధించింది. సానియామీర్జా టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నిధి, క్వార్టర్స్‌లో మూడో సీడ్ రిషిక సుంకరతో తలపడుతుంది. ప్రిక్వార్టర్స్‌లో రిషిక 6-2, 6-2తో అమృత ముఖర్జీని ఓడించింది. మరో ఏపీ అమ్మాయి సౌజన్య భవిషెట్టి కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్లో ఆమె 4-6, 6-2, 6-1 తేడాతో నాలుగో సీడ్ జపాన్ క్రీడాకారిణి ఎమి ముతగుచిని ఓడించింది. క్వార్టర్స్‌లో ఆమె రుతుజ భోంస్లేను ఎదుర్కొంటుంది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో అంకితా రాణాతో ప్రేరణ బాంబ్రీ, నటాషా పల్హాతో ప్రార్థన తోంబరే తలపడతారు. డబుల్స్‌లో ఏపీకి చెందిన సౌజన్య భవిషెట్టి జోడి క్వార్టర్స్‌కు చేరగా, అక్షర ఇస్కా-తీర్థ ఇస్కా జంటకు పరాజయం ఎదురైంది. సౌజన్య-షర్మద 6-0, 6-0తో ముతగుచి-నునోమె (జపాన్)ను చిత్తు చేయగా, శ్వేత రాణా-రిషిక సుంకర జంట 6-4, 6-1తో ఇస్కా అక్షర-ఇస్కా తీర్థలపై నెగ్గింది.