ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యూరుు. ఆదివారం నుంచి జూన్ 1 వరకు జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు మొత్తం 27,625 మంది హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో ఇంప్రూవ్మెంట్ కోసం 10,066 మంది, నాన్ ఇంప్రూవ్మెంట్(ఫెయిలైనవారు) 9,334 మంది హాజరవుతున్నారు.
ఒకేషనల్ విభాగంలో ఇంప్రూవ్‌మెంట్‌కు 190 మంది, నాన్ ఇంప్రూవ్‌మెంట్‌కు 98 మంది విద్యార్థులు హాజరవుతున్నారు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం లేనందున ఫెయిలైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. జనరల్ విభాగంలో 7,678 మంది, ఒకేషనల్‌కు 259 మంది పరీక్షలకు హాజరవుతారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు ఓఎంఆర్ షీట్లు, నామినల్ రోల్స్, జవాబు పత్రాలు, స్టిక్కర్లు, పిన్నులు తదితర మెటీరియల్స్‌ను చేరవేశారు. జిల్లాలో 60 పరీక్ష కేంద్రాలకుగాను 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్ట్మెంట్ అధికారులు 32 మంది కస్టోడియన్లను నియమించారు. 32 స్టోరెజ్ పాయింట్లు(పోలీస్‌స్టేషన్స్)లకు ప్రశ్నాపత్రాలను చేరవేశారు.
డీఈసీ నియామకం, కేంద్రాలపై నిఘా...
గతంలో కాపీయింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలున్న పరీక్షా కేంద్రాలపై అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. దీనికోసం ఆర్ఐవో నేతృత్వంలో డీఈసీ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఎ.అన్నమ్మ, డీఈసీ సభ్యులుగా బి.యజ్ఞభూషనరావు(ప్రిన్సిపాల్-టెక్కలి), గురుగుబెల్లి అప్పలనాయుడు(ప్రిన్సిపాల్-కింతలి), ఆర్.భూషణ్‌రావు(సీనియర్ లెక్చరర్-శ్రీకాకుళం బాలురు), బొడ్డేపల్లి ప్రసాదరావు(ఒకేషనల్ లెక్చరర్-తొగరాం) వ్యవహరిస్తారు. వీరితోపాటు ఒక హైపవర్ కమిటీ(చౌదరి ఆదినారాయణ-ప్రిన్సిపాల్, రణస్థలం), ఐదు సిట్టింగ్, మూడు ఫ్లయింగ్ క్క్వాడ్ బృందాలను నియమించారు.
ఉదయం జూనియర్స్, మధ్యాహ్నం సీనియర్స్
ఇంటర్మీడీయెట్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రతి రోజు రెండు పూటలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ , మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా హాజరైన విద్యార్థులను లోపలికి అనుమతిస్తామని ఆ తరువాత వచ్చిన వారిని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్షకు అర్ధగంట ముందే ఆయూ కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.
144 సెక్షన్ అమలు..
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు పోలీసు బలగాలనూ మొహరించనున్నారు. పరీక్ష జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని పోలీసు శాఖ ద్వారా ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు (సెల్ఫోన్లు, కాలక్యులేటర్లు, పేజర్లు వంటివి) తీసుకురాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌళిక సదుపాయాలతోపాటు వైద్యసదుపాయాలు పూర్తిస్థారుులో కల్పించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే కొన్ని ప్రత్యేక రూట్లలో ఆర్టీసీ కూడా బస్సులను నడపనుంది. ఈసారి నేల రాతలు జరిగితే చర్యలు తీసుకుంటామని అధికారులు హుకుం జారీచేశారు.
సీఎస్, డీవోలతో సమీక్ష సమావేశం..
ఇవే అంశాలను ప్రస్తావిస్తూ గురువారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లతో ఆర్ఐవో అన్నమ్మ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వార్షిక పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లుగానే ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు. డీవీఈవో పాత్రుని పాపారావు, డీఈసీ సభ్యులు బి.యజ్ఞభూషనరావు, జి.అప్పలనాయుడు, ఆర్.భూషణరావు, బల్క్ ఇన్చార్జ్ మాడుగుల ప్రకాశరావు, హైపవర్ కమిటీ సీహెచ్ ఆదినారాయణ, బి.ప్రసాదరావు, బి.మల్లేశ్వరరావు, ఎం.రమణమూర్తి, శంకరరావు, రాంబాబు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలు సజావుగా నిర్వహించండి ఏజేసీ షరీఫ్
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఏజేసీ ఎండీ హషీమ్ షరీఫ్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై జిల్లాస్థారుు సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల సమయంలో బస్సులను సకాలంలో నడపాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స అందించేందుకు మందులతోపాటు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.జగన్నాథరావును ఆదేశించారు.
జవాబు పత్రాలను స్పీడ్ పోస్టులో పంపించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని పోస్టల్శాఖాధికారులకు సూచించారు. ఇన్విజిలేటర్లు అవసరమైన కేంద్రాల్లో టీచర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికార్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖాధికార్లను కోరారు. ఆర్ఐవో ఎ.అన్నమ్మతోపాటు డీఈసీ కమిటీ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.