-
కోహ్లీ సరికొత్త రికార్డు.. క్రికెట్లో అనుకుంటే పొరపాటే..!
న్యూఢిల్లీ: క్రికెట్లో రికార్డుల రారాజుగా చలామణి అవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. అయితే, ఈ సారి కింగ్ కోహ్లి రికార్డును క్రియేట్ చేసింది క్రికెట్లో మాత్రం కాదు. కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో 150 మిలియన్ల (15 కోట్లు) ఫాలోవర్ల రేర్ ల్యాండ్ మార్క్‌ను క్రాస్ చేసి సోషల్‌మీడియా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుల్లో నిలిచాడు. భారత్‌లోనే కాక ఆసియా ఖండం మొత్తంలో ఈ ఫీట్ అందుకున్న తొలి వ్యక్తి కోహ్లినే కావడం మరో విశేషం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇన్‌స్టాలో అత్యంత ప్రజాదరణ(ఫాలోవర్స్) కలిగిన క్రీడాకారుల్లో కింగ్ కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. 337 మిలియన్ల ఫాలోవర్లతో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. మెస్సీ (260 మిలియన్లు), నెయ్మార్ (160 మిలియన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, టీమిండియా కెప్టెన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్ (43.4 మిలియన్లు), ఫేస్బుక్ (48 మిలియన్లు)లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి ఒక స్పాన్సర్ పోస్టు ద్వారా ఏకంగా రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. చదవండి: "కోచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు".. భారత స్టార్ ప్లేయర్ సంచలన ఆరోపణలు -
ఇదీ... ఇన్‌స్టాగ్రమ్!
ఫేస్బుక్, వాట్స్యాప్లు విరివిగా వాడేస్తున్నారు... లైన్, వైబర్లలో ముచ్చట్లు మొదలవుతున్నాయి. ఈ హడావుడిలో ఇప్పుడిప్పుడే విస్తృతం అవుతున్న మరో సోషల్నెట్ వర్కింగ్ సేవ ‘ఇన్‌స్టాగ్రమ్’. ఇప్పటికే ప్రముఖులు వాడేస్తుండటంతో దీనికి ఉచితంగా పబ్లిసిటీ కూడా దక్కుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గర నుంచి అనేక మంది సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రమ్ యూజర్లే. మరి ఇందులో ఏముంది? దీని ప్రత్యేకత ఏంటి... అత్యంత విస్తృతంగా వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న ఇన్‌స్టాగ్రమ్ సేవల గురించి... ఫొటో షేరింగ్... ఇన్‌స్టాగ్రమ్ ఆత్మ. మరి ఫేస్‌బుక్‌లోనూ, వాట్స్యాప్లోనూ ఫొటోలనూ షేర్ చేయవచ్చు కదా.. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రమ్ ఎందుకు... అనే సందేహం వస్తే, ఇన్‌స్టాగ్రమ్‌లోకి లాగిన్ అయితే తేడా అర్థం అవుతుంది. ఎలా లాగిన్ కావాలి? చేతిలో ఐ ఫోన్ ఉన్నా, ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఉన్నా ఐస్టోర్, ప్లేస్టోర్ల నుంచి ఇన్‌స్టాగ్రమ్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒక యూజర్ నేమ్ పెట్టుకోవడం, పాస్వర్డ్ సెట్ చేసుకోవడం సులభమే. ఫేస్బుక్, ట్విటర్లకు ఒకే కీ ఇది! ఏవైనా ఫొటోలను సోషల్నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్, ట్విటర్ ల ద్వారా ఒకే సారి షేర్ చేసేయవచ్చు ఇన్‌స్టాగ్రమ్ ద్వారా. ఇన్‌స్టాగ్రమ్‌లోకి అప్లోడ్ చేస్తే చాలు అవే ఫోటోలు ట్విటర్, ఫేస్బుక్ అకౌంట్లలోకి కూడా అప్లోడ్ అవుతాయి! దాంతో పాటు ఇన్స్టాగ్రమ్లోని స్నేహితులకు కూడా షేర్ కావడం బోనస్. ఇలా ఒకేసారి విభిన్నమైన సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోకి షేర్ కావడానికి అవకాశం ఇవ్వడంతో ఇన్‌స్టాగ్రమ్ ఆదరణకు నోచుకొంటోంది. ఫేస్బుక్, ట్విటర్లలోకి మాత్రమే కాకుండా టంబ్లర్ వంటి బ్లాగ్సైట్లోకి, ఇంకా ఫ్లికర్, ఫోర్స్క్వయర్ వంటి సైట్లలోకి కూడా ఇన్‌స్టాగ్రమ్ నుంచి ఫోటోలను షేర్ చేయవచ్చు. ఇదే విధంగా వీడియోలను కూడా. సూపర్ ఫ్రేమింగ్..! తాము దిగిన ఫొటోలను, సెల్ఫీలను ఇన్‌స్టాగ్రమ్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు సెలబ్రిటీలంతా. అందుకు అత్యున్నత ఈ సైట్ అందించే నాణ్యతే కారణం. ‘ఫిల్టర్స్’ అని పిలిచే ఫొటో ఫ్రేమ్ టెక్నిక్స్ ఎవ్వరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. ఫొటోకు ఒక రిచ్‌లుక్ అందిస్తుంది ఇన్‌స్టాగ్రమ్. సాధారణంగా అందుబాటులో ఉండే ఫొటో ఎడిటింగ్ టెక్నిక్స్‌తో పోల్చలేనంత అందంగా ఉంటుంది ఇన్‌స్టాగ్రమ్ ఫ్రేమింగ్. అప్లోడ్ చేయదలచిన ఫొటోలను నచ్చిన ఫిల్టర్లలో సెట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి అందరి ఛాయిస్ ఇన్‌స్టాగ్రమ్ అవుతోంది. ప్రస్తుతానికి అయితే సెలబ్రిటీలదే! వినియోగదారుల విషయానికి వస్తే ఈ సేవ వినియోగదారుల్లో సెలబ్రిటీలే ముందున్నారు. ట్విటర్, ఫేస్‌బుక్‌లకు అనుసంధానం చేసి ఇన్‌స్టాగ్రమ్‌లో ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు వారంతా. అయితే వారు అప్లోడ్ చేసే ఫోటోలను చూడానికి ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ అవసరంలేదు. కాబట్టి ఈ సైట్లో అకౌంట్ల సంఖ్య అమాంతం పెరగడం లేదు. అయితే తమ ఫొటోలను సోషల్నెట్వర్కింగ్సైట్లలో ప్రెజెంట్ చేసుకోవాలనుకొనే వారికి మాత్రం ఇన్‌స్టాగ్రమ్ చక్కటి మార్గం. ఇక్కడా స్నేహితులను చేసుకోవచ్చు... ఎలాగూ ఫేస్బుక్, ట్విటర్లతో అనుసంధానం అయి ఉండే సేవే కాబట్టి.. ఆయా సైట్లలో స్నేహితులందరినీ ఇక్కడా యాడ్ చేసుకోవచ్చు. వారితో టచ్‌లో ఉండవచ్చు. వాళ్లనే కాకుండా ‘ఫాలో’ కావడం ద్వారా ప్రముఖుల ఫోటోలను అందుకోవడంతోపాటు, కొత్తస్నేహాలనూ పెంపొందించుకోవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement