breaking news
inspires
-
యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..
ఈ సినిమా చూసిన చాలామంది యువత న్యాయవృత్తిని చేపడతామని బాధితులకి న్యాయం చేకూరేలా తమ వంతు కృషి చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. చెన్నైకి చెందిన శ్రవణ్ అనే కామర్స్ విద్యార్థి ఈ సినిమా చూసిన తర్వాత తాను న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు తనకు న్యాయ రంగం నచ్చిందని, పైగా ఈ చిత్రంలో సూర్య తీసుకున్న తుది నిర్ణయం తనకు బాధితులకు న్యాయం చేయడానికి ఉపకరించేలా ఉందని అన్నాడు. (చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!) అయితే శ్రవణ్ లైంగిక వేధింపుల బాధితులు తమ తప్పు లేకుండానే వారు శిక్షించబడుతున్నారని వారికి న్యాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎంబీఏ చేస్తున్న శ్రవణ్ సత్యనారాయణ అనే మరో విద్యార్థి ఈ సినిమా అట్టడుగు వర్గాలకు సహాయం చేయడానికి, సాధికారత కోసం ఏదైనా చేయాలనే సందేశాన్ని ఇస్తోందని అందువల్ల తాను వారికి ఉద్యోగాలు పొందేలా సాయం చేయాలనుకున్నట్లు చెప్పాడు. అయితే టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ లీగల్ సినిమా 1993లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారన్న సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాలో జస్టిస్ కే. చంద్రు పోరాడిన కేసు తాలుకా ఇరులర్ తెగకు చెందిన ఒక జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది. తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ చిత్రం సమాజంలోని అసమానతలు అణగారిన వర్గాల అణచివేతకు సంబంధించిన ఇతి వృత్తాలను స్పృశిస్తూనే, న్యాయవాది శక్తితో మానవ హక్కులను కాపాడేలా వారి బాధ్యత గురించి తెలియజేస్తుంది. ఈ మేరకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె. చంద్రు ఈ చిత్రాన్ని "అర్ధవంతమైన సినిమా"గా అభివర్ణించారు. అంతేకాదు దిద్దుబాటు యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయనే అంశాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒక న్యాయవాది సునిశితమైన న్యాయవ్యవస్థ సాయంతో బాధితులకు కచ్చితంగా న్యాయం జరిగేలా చేయడంలో సహాయపడగలరంటూ కె. చంద్రు విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
ప్రకృతి విపత్తులను తట్టుకునేట్టుగా...
జర్మనీః కొబ్బరి చెట్టు' వ్యాసం ప్రతి విద్యార్థీ చిన్న తరగతుల్లో చదువుకునే ఉంటాడు. కొబ్బరిచెట్టు ఆకులు, కాండం నుంచీ కాయలదాకా ప్రతి భాగం మనిషి జీవితంలో ఎంతో ఉపయోగ పడుతుందని ఆ వ్యాసం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఎందరికో అనుభవపూర్వకం కూడా. అందుకే కాబోలు జర్మనీ శాస్త్రవేత్తల దృష్టి కొబ్బరి పై పడింది. నాగరికతద్వారా మనుషులు భూమిపై వారి ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నా... ప్రకృతి సహజ విపత్తులు, అంటువ్యాధులు వంటివి ఇంకా జీవితాలపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి విపత్తుల పరిష్కారం దిశగా ఆలోచించిన జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. భూకంపాలను నిరోధించేందుకు కొబ్బరి కాయలో అత్యంత ధృఢంగా ఉండే పెంకులపై దృష్టి సారించారు. జర్మన్ రీసెర్చ్ ఫౌండేషన్ విపత్తులను ఎదుర్కొనేందుకు కొత్త మార్గంలో ప్రయోగాలు చేస్తోంది. తమ ప్రణాళికలను అభివృద్ధి పరిచేందుకు పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు. సహజ విపత్తులను తట్టుకోగలిగే శక్తి కొబ్బరి పెంకులో ఉన్నట్లు గుర్తించారు. అందులోని పదార్థాల ఆధారంగా భూ కంపాలు ఇతర ప్రకృతి విలయాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా 30 మీటర్ల ఎత్తు ఉండే కొబ్బరి చెట్లనుంచీ కాయలు కింద పడినా పగిలిపోకుండా కాపాడే కొబ్బరి పెంకు ధృఢత్వాన్ని గుర్తించిన పరిశోధకులు... దాని ఆధారంగా విపత్తు నివారణా మార్గాలపై అధ్యయనం చేశారు. కొబ్బరి పెంకు నిర్మాణానికి సంబంధించిన ఫార్ములాపై ప్రయోగాలు చేస్తున్నారు. కొబ్బరి పెంకులో ఉండే లెథరీ ఎక్సో కార్ప్, ఫైబరస్ మెకోకార్స్, ఎండోకార్ప్ అనే మూడు పొరల వల్ల కొబ్బరి పెంకు ధృఢంగా ఉంటుందన్న విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అదే స్ఫూర్తిగా ఇళ్ళ నిర్మాణం చేపడితే విపత్తులను, భూకంపాలను తట్టుగోగల్గుతాయన్న దిశగా ఆలోచిస్తున్నారు. బయోలాజికల్ డిజైన్ అండ్ ఇంటిగ్రేటివ్ స్ట్రక్చర్స్ ప్రాజెక్టు ద్వారా.. జర్మనీలోని ఫ్రీబర్గ్ యూనివర్శిటీ ప్లాంట్ బయో మెకానిక్స్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు, మెటీరియల్ సైంటిస్టు ల బృందం సంయుక్తంగా భూకంపాలను తట్టుకునే నిర్మాణాలను చేపట్టే దిశగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాలను వినియోగించి కొబ్బరి పెంకులోని మూడు పొరల్లో ఉండే శక్తిని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎండోకార్ప్ పొర కారణంగా కొబ్బరి పెంకు ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలదని, పగుళ్ళు లోపలకు పోనీకుండా అందులోని లిగ్నిఫైడ్ స్టోన్ సెల్స్ ప్రభావం చూపిస్తాయని గుర్తించారు. తమ ప్రయోగాలు ఫలిస్తే.. భవిష్యత్తులో భూకంపాలు వచ్చినా తట్టుకోగలిగే ఇళ్ళ నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు.