breaking news
innovative offer
-
అమెరికాలో తుపాకీ అప్పగిస్తే.. గిఫ్ట్ కార్డు బహుమానం
న్యూయార్క్: తుపాకీ సంస్కృతిని అరికట్టేందుకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వినూత్న ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఒక్కో తుపాకీకి 500 డాలర్ల విలువైన గిఫ్ట్ కార్డు ఇస్తామని ప్రకటించి, అందుకు గాను 9 కేంద్రాలను శనివారం ఏర్పాటు చేసింది. వీటికి పౌరుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వివిధ రకాల అసాల్ట్ రైఫిళ్లు, ఘోస్ట్ గన్స్ కలిపి 3 వేలకు పైగా తుపాకులను పౌరులు అప్పగించినట్లు న్యూయార్క్ అధికారులు తెలిపారు. మొదటి ఆయుధానికి 500 డాలర్లు, ఆపై ప్రతి ఆయుధానికి 150 డాలర్ల చొప్పున అందజేశామన్నారు. బ్రూక్లిన్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మూడు గంటల్లోనే 90 గన్లను సరెండర్ చేయగా, సిరాక్యుజ్లో అత్యధికంగా 751 ఆయుధాలను అప్పగించారన్నారు. తమ వద్దకు చేరిన ప్రతి ఆయుధంతో ఒక జీవితాన్ని కాపాడినట్లే, ఒక ప్రమాదకర కాల్పుల ఘటనను నివారించినట్లేనన్నారు. ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. ఇదేం పెళ్లి! -
వీడియోకాన్ ఫీచర్ ఫోన్ ఆఫర్
హైదరాబాద్: వీడియోకాన్ మొబైల్ ఫోన్స్ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. రూ.3,790 విలువగల వీ40హెచ్డీ1 స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు రూ.2,999లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు రూ.1,049 ఖరీదు చేసే వీ1ఈఏ7 లేదా వీ1ఎఫ్ఏ7 ఫీచర్ ఫోన్‌ను కేవలం రూ.99లకే అందుకోవచ్చు. వీ40హెచ్డీ1ను 4 అంగుళాల డబ్ల్యువీజీఏ డిస్ప్లే, యాంటీ స్క్రాచ్ గ్లాస్‌తో తయారు చేశారు.