breaking news
infant deadbody
-
ఏ తల్లి వదిలి వెళ్లిందో... మృత శిశువును!
బంజారాహిల్స్ (హైదరాబాద్): యూసుఫ్‌గూడలోని జానకమ్మ తోటలో సోమవారం ఆడ శిశువు మృతదేహం వెలుగు చూసింది. ఓ శిశువు మృతదేహం ఉన్నట్లు స్థానిక మెకానిక్ ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. నెలలు నిండకుండానే శిశువును గర్భస్రావం ద్వారా తొలగించుకోవడం వల్ల మృతి చెంది ఉంటుందని తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ముళ్లపొదల్లో పసికందు మృతదేహం
మెదక్(కౌడిపల్లి): రోజు వయసు కూడా లేని శిశువు మృతదేహం ముళ్ల పొదల్లో లభించింది. సంఘటన స్థలంలో ఇంకా రక్తపు మరకలు కూడా పోలేదు. మహిళా అక్కడే శిశువుకు జన్మనిచ్చిందా?.. లేదా ఎవైనా పడేసి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో బుధవారం వెలుగు చూసింది. ఫైజాబాద్గేట్ సమీపంలోని రోడ్డు పక్కన ముళ్ల పొదల్లో స్థానికులకు పసికందు మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న సమత సొసైటీ మహిళా కార్యకర్తలు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారు శిశువు మృతదేహాన్ని అక్కడే పూడ్చివేశారు. కాగా, సంఘటన స్థలంలో రక్తపు మరకలు చూస్తుంటే ప్రసవం అక్కడే అయినట్లు ఆనవాళ్లు ఉన్నాయని సమత సొసైటీ జేఆర్సీ సుగుణ, సీఆర్పీ స్వప్న చెప్పారు. కాన్పు సమయంలో పసికందు మృతి చెందడంతో అక్కడే పడేసి వెళ్లారా.. లేక ఇతర కారణాల వల్ల వదిలించుకోవడానికి ఈ పనిచేశారా అనే అనుమానం వ్యక్తం చేశారు.