breaking news
Indiramma beneficiaries
-
శ్లాబ్ ఎక్కడిదాకా అయింది.. బిల్లులు వస్తున్నాయా?
సాక్షి, హైదరాబాద్: ‘హలో... నేను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మాట్లాడుతున్నా. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచి్చన ఇల్లు వచి్చందా.. దానికి సంబంధించిన బిల్లులు వస్తున్నాయా.. ఇంటి శ్లాబ్ ఎక్కడి వరకు వచ్చింది..అధికారులు మీకు సహకరిస్తున్నారా’అంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. గురువారం మంత్రి హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ కాల్ సెంటర్, హెల్ప్‌డెస్‌్క, ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో ఫోన్లో మాట్లాడారు.ముందుగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం లబ్ధిదారుతో మాట్లాడారు. ‘బేస్మెంట్ వరకు మా ఇల్లు పూర్తయింది. కానీ ఇంకా బిల్లు రాలేదు’అని ఆమె చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ బేస్మెంట్ పూర్తయి ఎన్ని రోజులైంది, దాని ఫొటోలు అప్లోడ్ చేశారా అని అడిగారు. అప్పుడు అక్కడే ఆధార్ నంబర్‌తో అన్నీ పరిశీలించారు. రూ.లక్ష వచ్చే సోమవారం మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయని పొంగులేటి చెప్పారు. మరో వ్యక్తి ఫోన్ చేసి గ్రేటర్ హైదరాబాద్‌లో ఎప్పుడు ఇళ్లు ఇస్తారని అడగ్గా, పొంగులేటి స్పందిస్తూ నగరంలో స్థల సమస్య ఉందని, త్వరలోనే పరిష్కారం కనుగొని అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు టోల్‌ఫ్రీ కాల్ సెంటర్ ఫోన్ 1800 599 5991 రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చన్నారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిఅగీత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుని లబ్ధిదారులకూ ఆ వివరాలను తెలియచేస్తారని పొంగులేటి చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లలో దేశానికే తెలంగాణ ఆదర్శం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం తన నివాసంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తదితరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తుంటే, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. -
కట్టేదెట్టా..!
►ఆకాశన్నంటుతున్న నిర్మాణ సామగ్రి ►సిమెంట్ ధరలు పైపైకి ►మధ్యలోనే నిలిచిపోతున్న నిర్మాణాలు ►ఇబ్బందుల్లో 2 లక్షల మంది కార్మికులు నెల్లూరు (దర్గామిట్ట): సామాన్యులకు సొంతింటి కల సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం నిర్మాణ సామగ్రి అంతకంతకూ పెరుగుతుండటమే. చాలాచోట్ల నిర్మాణ సామగ్రి ఉన్నంత వరకు పనులు పూర్తి చేసి నిలిపి వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా నిర్మాణాలు మధ్యలో నే నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్లకుపైగా విలువైన నిర్మాణాలు సాగుతున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. నెల్లూరులోనే సుమారు రూ. 80 కోట్లు నుంచి 90 కోట్లు మేర నిర్మాణ పనులు జరుగుతున్నాయనేది అంచనా. నిర్మాణరంగంపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 లక్షల మందికిపైగా ఆధారపడి జీవిస్తున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో మధ్యలోనే నిలిచిపోతుండటంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సిమెంట్ ధరలు పైపైకి ...: గతంలో 50 కిలోల సిమెంట్ బస్తా రూ. 210 నుంచి రూ.235 వరకు ఉండేది. ప్రస్తుతం రూ. 325కు పెరిగింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కంపెనీలన్నీ సిండికేట్ కావడం వల్లే ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఒక మాదిరి ఇంటి నిర్మాణానికి 500 బస్తాలు సిమెంట్ అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఒక్క సిమెంట్‌కే అదనంగా రూ. 50వేలు పైనే భారం పడుతుంది. అమాంతంగా పెరిగిన ఇసుక ధరలు : ప్రస్తుతం జిల్లాలోని ఇసుక రీచ్‌లకు వేలం నిర్వహించక పోవడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. 2వేలు ఉండగా ప్రస్తుతం రూ. 4 వేలకు పెరిగింది. ఒక్కో ఇంటికి దాదాపు 40 లారీల ఇసుక అవసరం ఉంటుంది. ఈ లెక్కన ఇసుకపైనే దాదాపు రూ. 2లక్షలపైనే భారం పడుతుంది. సామాన్య ప్రజలు పునాదులకు మట్టినే వాడుతున్నారు. ఇటుక ధరలకు రెక్కలు : ఆరు నెలల క్రితం 2 వేల ఇటుకలు రూ. 6500 ఉండేవి. ప్రస్తుతం రూ. 8 వేలకు పెరిగిది. ఒక్కో ఇంటికి దాదాపు 30 వేలకు పైగా ఇటుకలు అవసరం ఉంటుందని అంచనా. క్వాలిటీ ఇటుక అయితే మరో వెయ్యి రూపాయిలు అదనంగా ఖర్చు చేయాల్సిందే. కొండెక్కిన స్టీల్, ఇనుము ధరలు : ఇనుము ధరలు కూడా పెరిగిపోయాయి. ఆరు నెలల క్రితం వైజాగ్ స్టీల్ ధర టన్ను రూ. 38 వేలు ఉంది. అది ప్రస్తుతం టన్ను రూ. 45వేలకు పైగా పెరిగింది. గతంతో పోలిస్తే టన్నుకు రూ. 8వేలు పెరిగినట్టే. ఒక్కో ఇంటికి దాదాపు నాలుగు టన్నుల ఇనుము వినియోగిస్తున్నారని అంచనా. పెరిగిన కంకర ధర : నిర్మాణంలో కంకర కీలకమైంది. దీని ధరలు పెరిగిపోయాయి. గతంలో యూనిట్ ధర రూ. 4 వేలు ఉంటే ప్రస్తుతం రూ. 5 వేలకు పెరిగింది. అదే చీమకుర్తి, రాయవేలూరుల నుంచి తీసుకొచ్చిన కంకరైతే యూనిట్‌కు మరో రూ. 1500 అదనంగా చెల్లించాల్సిందే. ఒక్కో ఇంటికి 8 లారీలు కంకర అవసరం ఉంటుందని చెబుతున్నారు. పెరిగిన కలప ధరలు : ఇటీవల కలప ధరలు కూడా పెరిగాయి. నాణ్యమైన కలప కొనాలంటే ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తక్కువ కలప కొనాలన్నా అడుగు సుమారు. రూ. 1000 ఉంది. అదే నాణ్యత గల కలప కొనాలంటే అడుగు రూ. 2 వేల నుంచి రూ.8 వేల వరకు పలుకుతోంది. ఒక్కో ఇంటికి దాదాపు 50 నుంచి 60 అడుగుల కలప అవసరం. కొంత మంది కలప వినియోగం తగ్గించి ప్లాస్టిక్, ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు పెరిగిన కష్టాలు : నిర్మాణ సామగ్రి ధర పెరుగుదలతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఒక్కో ఇంటికి రూ.75 వేలు నుంచి రూ.లక్ష వరకు ఇస్తున్నారు. ఈ మొత్తం సరిపోవడం లేదు. దీంతో పాటు గత కొన్ని నెలలుగా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం లేదు. ఇంటి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి అమాంతంగా పెరిగి పోతున్న నిర్మాణ ధరలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.