breaking news
Indian Road Congress
-
దేశ పురోగతికి ‘మార్గం’: తుమ్మల
హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం మెరుగైన రోడ్ల నిర్మాణానికి సదస్సు దోహదపడుతుందని ఆశాభావం సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సులో తీసుకునే నిర్ణయాలు దేశానికి ప్రయోజనకరంగా మారతాయని రోడ్లు భవనా ల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొ న్నారు. రోడ్ల వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నప్పుడే దేశ పురోగతికి మార్గం సుగమమ వుతుందని చెప్పారు. రోడ్ల నిర్మాణంలో కొత్తపుంతలు తొక్కించే నిర్ణయాలు తీసుకు నేందుకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వేదిక కానుందన్నారు. 77వ రోడ్ కాంగ్రెస్ సదస్సును గురువారం హైటెక్స్‌లో తుమ్మల ప్రారంభిం చారు. రెండున్నరేళ్ల అనతికాలంలోనే తెలంగాణ పురోగతి మార్గంలో ఎంతో ముందుకెళ్లిందని, ఇందులో మెరుగైన రోడ్ల నిర్మాణం కూడా భాగమని తుమ్మల చెప్పారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందాలంటే నాణ్యమైన రోడ్లు ఉండాలని గుర్తించిన సీఎం చంద్రశేఖరరావు రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.12,500 కోట్లు కేటాయించినట్లు పేర్కొ న్నారు. అంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నందున రోడ్ల నిర్మాణం మరింత మెరుగ్గా ఉండేందుకు ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు దోహదపడుతాయని చెప్పారు. రోడ్లు మాత్రమే కాకుండా వాగులు, వంకలు, నదులపై వంతెనలు నిర్మిస్తు న్నామని, నీటి నిల్వకు ఉపయోగపడేలా చెక్‌డ్యాం నమూనాలో రోడ్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించే అవకాశం రావడం గర్వ కారణమని, ఇప్పటివరకు ఏ సదస్సు జరగని రీతిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయంగా రోడ్ల నిర్మాణంలో వస్తున్న కొత్త పద్ధతులు, విధానాలపై అవగాహన పెంచుకోవటానికి ఈ సదస్సు దోహదపడుతుందని ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోర్వాల్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీలు భిక్షపతి, రవీందర్రావు, గణపతిరెడ్డి పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఉత్పత్తుల ప్రదర్శన.. రోడ్ల నిర్మాణానికి ఉపయోగపడే వివిధ అంశాలతో కూడిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. వివిధ ఉత్పత్తులను ఆయా సంస్థలు ప్రదర్శించాయి. హైటెక్స్ రెండో స్టాల్‌ను ఇందుకు కేటాయించారు. టెక్నికల్ సెషన్ ప్రారంభానికి ముందు తుమ్మల ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కాంక్రీట్ మిక్స్, రోడ్లపై గుర్తులు గీసేందుకు వినియోగించే రంగులు, స్పీడ్ బ్రేకర్ల వద్ద బ్లింకర్స్, తారు కలిపే యంత్రాలు సెన్సార్ల ద్వారా తారు, కాంక్రీట్ కలిపే భారీ యంత్రాలు, టిప్పర్లు వంటి ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. శుక్రవారం జరిగే టెక్నికల్ సెషన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర ప్రారంభిస్తారు. -
15నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు
హైదరాబాద్: హైటెక్స్‌లో ఈనెల 15వ తేదీ నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిర్మాణంలో నూతన పద్ధతులు, పర్యావరణం, రోడ్ల భద్రత, ప్రమాదాల నివారణపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కాగా, 338 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
డిసెంబర్ 15 నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఆయా శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 15 నుంచి 18 వరకు సదస్సు జరగనున్న నేపథ్యంలో నగరంలో రోడ్లను సుందరంగా మార్చాలని జీహెచ్ఎంసీ అధికా రులను ఆదేశించారు. రోడ్లపై చెత్త లేకుండా పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. సదస్సుకు హాజరయ్యే దాదాపు 3 వేల మంది ప్రతినిధుల పర్యటనల కోసం పర్యాటక శాఖ ఏర్పాట్లు చేయాలన్నారు. హైటెక్స్‌లో సదస్సు.. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 1934లో ఏర్పడ్డ తర్వాత దేశంలోని వివిధ నగరాల్లో నాలుగు రోజుల చొప్పున సదస్సులు నిర్వహించటం ఆనవారుుతీ. 1998లో నగరంలోని పబ్లిక్ గార్డెన్సలో నిర్వహించిన తర్వాత మళ్లీ ఇప్పుడు అవకాశం లభించింది. రోడ్ల నాణ్యతను పెంచటంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చిస్తారు. ఇటీవల తెలంగాణకు కొత్తగా 2,500 కి.మీ. కొత్త జాతీయరహదారులు మంజూరైన నేపథ్యంలో వాటి నిర్మాణంలో అనుసరించాల్సిన ఆధునిక పరిజ్ఞానం, దేశంలోనే గొప్ప రోడ్లుగా వాటిని తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలై ఇందులో సూచనలు అందే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.