breaking news
Indian golf
-
చరిత్ర సృష్టించిన అదితి
గుర్గావ్: భారత గోల్ఫ్ చరిత్రలో టీనేజి సంచలనం అదితీ అశోక్ చరిత్ర సృష్టించింది. లేడీస్ యూరోపియన్ టూర్లో భాగంగా జరిగిన మహిళల ఇండియన్ ఓపెన్‌లో 18 ఏళ్ల అదితి విజేతగా నిలిచింది. దీంతో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారత గోల్ఫర్గా రికార్డులకెక్కింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో బ్రిటానీ లిన్సికోమ్ (అమెరికా)పై తను గెలిచింది.విజేతగా నిలిచిన ఈ కర్ణాటక అమ్మారుుకి 60 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో పాటు రూకీ ఆఫ్ ద ఇయర్ ర్యాంకింగ్‌సలో టాప్ స్థానం దక్కింది. -
అనిర్బన్ లాహిరి కొత్త చరిత్ర
కోహ్లర్ (విస్కాన్సిన్): భారత గోల్ఫ్ చరిత్రలో అనిర్బన్ లాహిరి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ప్రతిష్టాత్మక పీజీఏ చాంపియన్‌షిప్‌లో సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటుకున్నాడు. ఓ మేజర్ టోర్నీలో భారత గోల్ఫర్స్ నుంచి ఈస్థాయి ప్రదర్శన ఇప్పటిదాకా లేదు. ఈ రాణింపుతో అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు మెరుగుపరుచుకుని 38వ ర్యాంకుకు చేరాడు. గతంలో 2013 బ్రిటిష్ ఓపెన్‌లో శివ్ కపూర్ తొమ్మిదో స్థానంలో నిలవడమే అత్యుత్తమం. ఇంతకుముందు మూడు వారాల వ్యవధిలోనే మలేసియా ఓపెన్, హీరో ఇండియన్ ఓపెన్‌ను గెలిచిన 28 ఏళ్ల లాహిరి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుత ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఎలాంటి ప్రత్యర్థికైనా గట్టి పోటీనివ్వగల ధీమా కలిగిందని లాహిరి తెలిపాడు.