అనిర్బన్ లాహిరి కొత్త చరిత్ర | Anirban lahiri new history in golf | Sakshi
Sakshi News home page

అనిర్బన్ లాహిరి కొత్త చరిత్ర

Aug 18 2015 1:19 AM | Updated on Sep 3 2017 7:37 AM

అనిర్బన్ లాహిరి కొత్త చరిత్ర

అనిర్బన్ లాహిరి కొత్త చరిత్ర

భారత గోల్ఫ్ చరిత్రలో అనిర్బన్ లాహిరి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు...

కోహ్లర్ (విస్కాన్సిన్): భారత గోల్ఫ్ చరిత్రలో అనిర్బన్ లాహిరి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ప్రతిష్టాత్మక పీజీఏ చాంపియన్‌షిప్‌లో సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటుకున్నాడు. ఓ మేజర్ టోర్నీలో భారత గోల్ఫర్స్ నుంచి ఈస్థాయి ప్రదర్శన ఇప్పటిదాకా లేదు. ఈ రాణింపుతో అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు మెరుగుపరుచుకుని 38వ ర్యాంకుకు చేరాడు. గతంలో 2013 బ్రిటిష్ ఓపెన్‌లో శివ్ కపూర్ తొమ్మిదో స్థానంలో నిలవడమే అత్యుత్తమం. ఇంతకుముందు మూడు వారాల వ్యవధిలోనే మలేసియా ఓపెన్, హీరో ఇండియన్ ఓపెన్‌ను గెలిచిన 28 ఏళ్ల లాహిరి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుత ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఎలాంటి ప్రత్యర్థికైనా గట్టి పోటీనివ్వగల ధీమా కలిగిందని లాహిరి తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement