breaking news
Indian Davis Cup team
-
భారత డేవిస్‌కప్ జట్టులో రిత్విక్
న్యూఢిల్లీ: డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పోటీపడే భారత పురుషుల టెన్నిస్ జట్టును ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా టోగో జట్టుతో భారత బృందం తలపడుతుంది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) సెలెక్షన్ ప్యానెల్ ఐదుగురు సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించగా... ఈ ఏడాది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో నిలకడగా రాణించిన తెలంగాణ ప్లేయర్ బొల్లిపల్లి రితి్వక్ చౌదరీ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, కరణ్ సింగ్ జట్టులోని ఇతర సభ్యులు. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్, డబుల్స్‌లో భారత రెండో ర్యాంకర్ యూకీ బాంబ్రీ టోగోతో మ్యాచ్‌కు తాము అందుబాటులో ఉండటం లేదని ఏఐటీఏకి తెలిపారు. సింగిల్స్ మ్యాచ్‌ల్లో శశికుమార్, రామ్‌కుమార్... డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–రిత్విక్ చౌదరీ ఆడే అవకాశం ఉంది. ఆర్యన్ షా, మానస్ ధామ్నె, దక్షిణేశ్వర్ సురేశ్, యువన్ నందల్లను డేవిస్‌కప్ సన్నాహక శిబిరానికి ఎంపిక చేశారు. ఈ నలుగురిలో నుంచి ఇద్దరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేస్తామని భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ తెలిపారు. స్వీడన్‌తో గత సెప్టెంబర్‌లో జరిగిన వరల్డ్ గ్రూప్ పోటీలో ఆడిన సిద్ధార్థ విశ్వకర్మ, నిక్కీ పునాచాలను టోగోతో మ్యాచ్‌కు ఎంపిక చేయలేదు. -
కెనడా గట్టి ప్రత్యర్థే: భూపతి
ఎడ్మంటన్ (కెనడా): స్టార్ ప్లేయర్ మిలోస్ రావ్‌నిచ్ లేకపోయినా... రైజింగ్ స్టార్ డెనిస్ షపోవలోవ్, డబుల్స్ స్పెషలిస్ట్ వాసెక్ పోస్పిసిల్, డానియల్ నెస్టర్లతో కూడుకున్న కెనడా జట్టు పటిష్టంగా కనిపిస్తోందని భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి అభిప్రాయపడ్డాడు. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భాగంగా ఈనెల 15 నుంచి 17 వరకు కెనడాతో భారత్ తలపడనుంది. ఈ పోటీ కోసం భారత్ వారం రోజులపాటు న్యూయార్క్‌లో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసింది. ‘రెండేళ్ల క్రితం భారత్‌లో ప్లే ఆఫ్ ఆడేందుకు వచ్చిన చెక్ రిపబ్లిక్ కంటే కెనడా జట్టే పటిష్టంగా కనిపిస్తోంది. అయితే కెనడాకు గట్టిపోటీనిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని భూపతి అన్నాడు.