breaking news
indian banker
-
బ్యాట్స్‌మన్ టు బిజినెస్‌మన్: రిచెస్ట్ బ్యాంకర్ గురించిన ఆసక్తికర విషయాలు
కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేసినట్లు తాజాగా ప్రకటించారు. అయితే ఆయన బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. భారతదేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ అయిన ఉదయ్ కోటక్ గురించిన పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఉదయ్ కోటక్ ఈ సంవత్సరం డిసెంబరులో పదవీ విరమణ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పదవీ విరమణ రోజుకు నాలుగు నెలల ముందే ఆయన రాజీనామా చేశారు. మొత్తంగా 38 సంవత్సరాలకుపైగా ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగారు. ఇండియన్ రిచెస్ట్ బ్యాంకర్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. 2023 సెప్టెంబరు 2 నాటికి ఉదయ్ కోటక్ దాదాపు 13.7 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో భారతదేశపు అత్యంత సంపన్న బ్యాంకర్. ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఆయన ఆదాయంలో దాదాపు 26 శాతం బ్యాంకులో వాటా నుంచే వస్తుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఉదయ్ కోటక్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 133వ స్థానంలో ఉన్నారు. కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో 1985లో ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించిన ఉదయ్ కోటక్ 2003లో దాన్ని బ్యాంక్‌గా మార్చారు. ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్.. కోటక్ 811 బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ముంబయిలో పత్తి వ్యాపారం చేసే ఓ గుజరాతీ కుటుంబంలో ఉదయ్ కోటక్ జన్మించారు. 60 మంది సభ్యులున్న పెద్ద ఉమ్మడి కుటుంబం వారిది. సిడెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బీకామ్ డిగ్రీని పొందారాయన. అలాగే జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఒకప్పుడు క్రికెటర్ రిచెస్ట్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి అంతగా తెలియని విషయం ఏమిటంటే ఆయన అద్భుతమైన క్రికెటర్. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అలాగే కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. వాస్తవంగా క్రికెటర్‌గానే తన కెరీర్‌ను కొనసాగించాలకున్నారు ఉదయ్ కోటక్. కానీ విధి మరోలా తలచింది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరుగుతున్న కంగా లీగ్‌లో వికెట్ల మధ్య పరిగెత్తుతుండగా ప్రమాదవశాత్తు బాల్ ఆయన తలకు బలంగా తగిలింది. మెదడులో రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేశారు. ఈ ప్రమాదం ఆయన్ను కొన్ని నెలలపాటు మంచం పట్టించింది. క్రికెట్ కెరీర్‌ను ముగించడమే కాకుండా జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఒక విద్యా సంవత్సరం కూడా కోల్పోవాల్సి వచ్చింది. (Warren Buffett Assets 2023: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి..) ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తన కుటుంబం, స్నేహితుల నుంచి కొంత పెట్టుబడి తీసుకుని ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించారు. పెట్టుబడిలో ఎక్కువ భాగం ఉదయ్ కోటక్ ప్రాణ స్నేహితుడైన ఆనంద్ మహీంద్రా నుంచే వచ్చింది. తరువాత కొన్ని సంవత్సరాలలో ఉదయ్ కోటక్ తన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఫైనాన్స్ వంటి వివిధ ఆర్థిక సేవల రంగాలలోకి విస్తరించారు. -
ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం: వీడియో వైరల్
డ్యూటీలోని ఓ పోలీసు చేతిలో భారతీయ ఫైనాన్షియల్ బ్యాంకర్ హతమయ్యాడు. అతను తన రుణం విషయమై సదరు బ్యాంకర్‌తో వాదించి మరీ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఉగాండా రాజధాని కంపాల నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మే 12న ఉత్తమ్ భండారీ అనే ఫైనాన్షియల్ బ్యాంకర్‌పై 30 ఏళ ఇవాన్ వాబ్‌వైర్ కాల్పులు జరిపాడు. నిజానికి భండారీ టీఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వాబ్‌వైర్ అతడి క్లయింట్. వాబ్‌వైర్ సంస్థ నుంచి మొత్తం రూ. 46 వేలు లోన్(రుణం) తీసుకున్నాడు. ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో వాబ్‌వైర్ ఏకే 47తో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో భండారీ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులో తీసుకుని అరెస్టు చేశారు. దర్యాప్తులో పోలీసులు వాబ్‌వైర్ డ్యూటీలో లేని ఓ పోలీసుగా పేర్కొన్నారు. తన సహచర ఉద్యోగి నుంచి ఏకే 47ని దొంగలించి మరీ అతడిపై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలిందన్నారు. వాబ్‌వైర్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, అందుకోసం రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న చరిత్ర కూడా ఉందని చెప్పారు. అతను ఈ విషయమై ఐదేళ్ల వరకు తుపాకిని కలిగి ఉండకుండా నిషేధించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉగాండాలో ఈ విషయమై ఆందోళన చెందుతున్న భారతీయ కమ్యూనిటీలను కలుసుకుని వారి భద్రత విషయమై హామి ఇచ్చారు. కాగా, అందుకు సంబంధించిన వీడియో నెట్లింట వైరల్ అవుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: మళ్లీ అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి) -
లైంగిక రుగ్మతతో జైలుపాలైన భారతీయ బ్యాంకర్
చిన్నవయసులోనే ఉన్నత స్థానానికి ఎదిగిన ఓ భారతీయ బ్యాంకు అధికారి.. ఓ అవలక్షణం కారణంగా దేశంకాని దేశంలో జైలపాలయ్యాడు. అతని పేరు.. మహా విగ్నేశ్ వెలిప్పన్. వయసు..32 ఏళ్లు. గతంలో నిర్వహించిన పదవి.. సింగపూర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్. సహోద్యోగులు, పక్కింటి వాళ్లు.. చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా అమ్మాయిలందరినీ నీచ దృష్టితో చూడటం.. వారి శరీర భాగాల్ని రహస్యంగా ఫొటోలు తీయడం విగ్నేశ్ అలవాటు! అతగాడి స్మార్ట్ ఫోన్లో అలాంటివి 596 వీడియోలున్నాయి! 2011లో విగ్నేశ్ బాధితురాలైన ఓ సహోద్యోగిని ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుట్టు రట్టైంది. మొత్తం 75 సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదయింది. మూడేళ్లపాటు విచారణ జరిపిన సింగపూర్ కోర్టు మంగళవారం అతనికి ఎనిమిదివారాల కఠిన కారాగార శిక్షను ఖరారుచేసింది. కాగా తన కక్షిదారుడు వాయొరిజం (విపరీత మానసిక లైంగిక రుగ్మత)తో బాధపడుతున్నాడని, ఆ వ్యాధి లక్షణాలవల్లే అతడలా రహస్య ఫొటోలు తీశాడని, పైగా అదే సమయంలో గర్ల్ ఫ్రెండ్‌తో గొడవపడి ఒంటరిగా ఉడేవాడని విగ్నేశ్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించాడు. దీంతో విగ్నేశ్‌కు భారీ శిక్ష తప్పినట్లయింది.