breaking news
India Holdings Corporation
-
వాటాదారుల ప్రయోజనాలకు పూర్తి భద్రత
న్యూఢిల్లీ: ఆంగ్లో అమెరికన్ పీఎల్‌సీలో తన విదేశీ సంస్థ కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్ చేసిన పెట్టుబడి పరిపాలనా అనుమతులకు లోబడే ఉన్నాయని, ఇది వాటాదారుల ప్రయోజనాలను కాపాడుతుందని వేదాంత లిమిటెడ్ వివరణ ఇచ్చింది. వేదాంత షేర్లు గత శుక్రవారం 20 శాతం వరకు నష్టపోయిన నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. ‘‘ఈ పెట్టుబడి ఇప్పుడు పూర్తి మూలధనంగా ఉంది. డౌన్‌సైడ్ రక్షణతోపాటు వేదాంత వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణకు భరోసానిస్తుంది’’ అని వేదాంత లిమిటెడ్ స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన వివరణలో తెలియజేసింది. ఆంగ్లో అమెరికన్ కంపెనీలో ఉన్న వృద్ధి అవకాశాల నేపథ్యంలో కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్ లిమిటెడ్ వద్ద ఉన్న మిగులు నిల్వల నుంచి కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేందుకు వోల్కన్ ఆఫర్ చేసినట్టు తెలిపింది. ఇతర విదేశీ నగదు నిర్వహణ పెట్టుబడులతో పోలిస్తే దీనిపై అధిక రాబడులు వస్తాయని, సాధారణంగా 2% రాబడులొస్తాయని పేర్కొంది. రిస్క్ ఆధారిత రాబడుల అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించిన మీదటే తన నగదు నిల్వల నుంచి కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓటింగ్ హక్కులు మాత్రం వోల్కన్ వద్దే ఉంటాయని స్పష్టం చేసింది. స్వతంత్ర వాల్యూయర్ చేసిన మదింపు అనంతరం, కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్, వేదాంత లిమిటెడ్ బోర్డుల ఆమోదం అనంతరమే ఇన్వెస్ట్ చేసినట్టు వివరణ ఇచ్చింది. డిసెంబర్ త్రైమాసికం ఫలితాల్లో ఈ విషయాన్ని స్వచ్చందంగానే వెల్లడించినట్టు తెలిపింది. -
ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఎన్‌సీఎంఎస్ మెజారిటీ వాటా
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ వ్యవసాయ స్టోరేజ్ కంపెనీ అయిన నేషనల్ కొల్లేటరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్(ఎన్‌సీఎంఎస్)లో మెజారిటీ వాటాను ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. రూ.800 కోట్ల రూపాయిలకు ఈ వాటా కొనుగోలును తమ పూర్తి అనుబంధ సంస్థ ఎఫ్ఐహెచ్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పూర్తి చేశామని ఫెయిర్ప్యాక్స్ ఇండియా చైర్మన్ ప్రేమ్ వాత్స చెప్పారు.