breaking news
IDFC Premier Equity
-
స్టాక్ మార్కెట్‌పై ‘చిన్న’ చూపు ఎందుకో?
హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, యూటీఐ ఈక్విటీ, ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ, సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్, రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్.... ఈ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అదనంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీలో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మీ అభిప్రాయం తెలుపగలరు? - హితేష్, నిజామాబాద్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ ఫండ్ అనేది వాల్యూ-ఓరియెంటెడ్ ఫండ్. మీ పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా ఉంచుకోదగ్గ ఫండ్ ఇది. ఈ ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గత కొన్నేళ్లుగా ఇది మంచి పనితీరును కనబరుస్తోంది. ఈ ఫండ్‌లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ఇది సెక్టోరియల్ ఫండ్. వ్యవస్థాగత మార్పులకు, తీవ్ర ఒడిదుడుకులకు గురువుతుండే ఫండ్ ఇది. ఇప్పటికైతే ఈ ఫండ్ ద్వారా మీకు మంచి లాభాలే వచ్చి ఉంటాయనుకుంటున్నాను. అందుకే ఈ ఫండ్ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం. ఈ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించి ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. కానీ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 2008 భారీ పతనం తర్వాత రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్కేసే చూడడం లేదు. ఎందుకని? - భువనేశ్వరి, గుంటూరు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో వచ్చింది చిన్న ర్యాలీ మాత్రమే. చిన్న ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉన్నారన్న మీ అభిప్రాయం సరైనదే. భారత మార్కెట్లు ఆకర్షణీయమైనవని విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. ఈ విషయంపై చిన్న ఇన్వెస్టర్లకు ఇంకా నమ్మకం కుదరడం లేదు. బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్లపై 10% రాబడి వస్తుండటంతో చిన్న ఇన్వెస్టర్లు.. వాటిపై ఆసక్తి చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా మార్కెట్లు బాగా లేకపోయినప్పటికీ, వడ్డీరేట్లు పెరిగిపోవడంతో తమ రాబడులు బాగానే ఉన్నాయని వారనుకుంటున్నారు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నా ఇన్వెస్టర్లకు దక్కే నికర రాబడులు స్వల్పమే అయినప్పటికీ, అదే పదివేలు అనుకుంటున్నారు. సాధారణంగానే భారత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం తక్కువే. నేను ఒక మిత్రుడి సలహా ప్రకారం అవైవా-సేవ్‌గార్డ్ యులిప్ స్కీమ్‌లో 2006లో ఇన్వెస్ట్ చేశాను. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాతనే నేను ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోలిగాను. ప్రతీ ఏడాది ఈ సంస్థ పెద్ద మొత్తంలో చార్జీలు వసూలు చేస్తోంది. మరోవైపు సరెండర్ పెనాల్టీ భారీగా ఉండటంతో ఈ స్కీమ్‌ను బలవంతంగా కొనసాగించాల్సి వస్తోంది. ఎనిమిదేళ్లుగా ప్రీమియం చెల్లిస్తూ వచ్చినప్పటికీ, సంతృప్తికరమైన రాబడులు లేవు. ఇలాంటి సంస్థలు ఇలాంటి స్కీమ్‌లను నిర్వహించడానికి నియంత్రణ సంస్థలు ఎలా అనుమతిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. చిన్న ఇన్వెస్టర్లు కష్టపడి సంపాదించిన సొమ్ములు ఇలాంటి సంస్థల పాలు కావల్సిందేనా? ఈ పరిస్థితుల నుంచి తక్కువ నష్టాలతో బయటపడే మార్గాన్ని సూచించండి. - హఫిజ్, హైదరాబాద్ అవైవా సేవ్‌గార్డ్ అనేది నాన్-పార్టిసిపేటింగ్ యూనిట్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. ఇది చాలా పాత పాలసీ. ఈ సంస్థ పెద్ద మొత్తంలో చార్జీలను వసూలు చేస్తుందనే విషయం వాస్తవమే. ఈ ప్లాన్‌కు సంబంధించి ప్రీమియం అలొకేషన్ చార్జ్ అనేది ప్రతీ ఏడాది 4 నంచి 6 శాతంగా ఉంటోంది. ఇక ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు 0.75 శాతం నంచి 1.75 శాతం రేంజ్లో ఉంటున్నాయి. ఇవి కాక పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీ, మోర్టాలిటీ చార్జీలను కూడా వసూలు చేస్తున్నారు. చార్జీలు అధికంగా ఉండటంతో రాబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సంప్రదాయక బీమా పాలసీలు మంచి రాబడులను ఇవ్వలేవు. సదరు సంస్థలు మీ సొమ్ములను సురక్షితమైన రుణసాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుండడమే దీనికి కారణం. మరోవైపు అధికంగా ఉండే చార్జీలు మీ లాభాలను తినేస్తాయి. ఈ ప్లాన్ మీరు చెల్లించే వార్షిక ప్రీమియానికి ఐదు రెట్లు లైఫ్ కవర్‌ను మాత్రమే అందిస్తోంది. ఇది ఏ మాత్రం సరిపోదు. టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. ఇవి తక్కువ ప్రీమియానికే ఎక్కువ బీమాను అందిస్తున్నాయి. మీకు ఏమైనా అయితే మీ కుటుంబ అవసరాలకు ఎంత మొత్తం కావాలో లెక్కించి, ఆ మేరకు టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే, మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, టాటా బ్యాలెన్స్డ్, బిర్లా సన్‌లైఫ్ 95.. ఈ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇక మీ అవైవా పాలసీ విషయానికొస్తే, మీరు ఈ పాలసీని సరెండర్ చేయండి. మీరు ఏడేళ్లపాటు ప్రీమియమ్‌లు చెల్లించి ఉంటే, ముఖ విలువలో 1 శాతంగా సరెండర్ చార్జీలు ఉంటాయి. ఒకవేళ మీరు ఎనిమిదేళ్లకు మించి ప్రీమియమ్‌లు చెల్లించి ఉంటే ఎలాంటి సరెండర్ చార్జీలు ఉండవు. ఈ పాలసీని సరెండర్ చేసి నష్టాలను పరిమితం చేసుకోండి. -
నెట్‌వర్త్ నిబంధనపై ఆందోళన వద్దు..
నేను ప్రస్తుతం క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఇటీవల సెబి మ్యూచువల్ ఫండ్లకు రూ.50 కోట్ల నెట్‌వర్త్ పరిమితిని విధించింది. ఈ నేపథ్యంలో చిన్న ఇన్వెస్టర్లపై ఏమైనా ప్రభావం పడుతుందా ? నా సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా ? - మరియన్న, నెల్లూరు క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించండి. గత ఐదేళ్ల కాలంలో కేవలం 2013లో మాత్రమే ఈ ఫండ్ మంచి పనితీరును కనబరచలేకపోయింది. ప్రస్తుతం ఈ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 1.25 శాతంగా ఉంది. ఇతర ఈక్విటీ ఫండ్స్ ఎక్స్పెన్స్ రేషియో 1.25 నుంచి 1.5 శాతంగా ఉంది. ఈ ఫండ్ పనితీరు బాగా ఉండడం, ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండడం వల్ల ఇన్వెస్టర్లకు మంచి రాబడులు వస్తున్నాయి. ఫండమెంటల్స్ పరంగా చూసినా, ఈ కేటగిరి ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయదగ్గ ఫండ్ ఇది. ఇక క్వాంటమ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రస్తుత నెట్‌వర్త్ రూ.25.74 కోట్లుగా ఉంది. నెట్‌వర్త్ అవసరాలను సెబి రూ.50 కోట్లకు పెంచింది. నెట్‌వర్త్ తక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ నిర్దేశించిన రూ.50 కోట్ల నెట్‌వర్త్ పరిమితిని అందుకోవడానికి మూడేళ్ల సమయాన్నిచ్చింది. మీ క్వాంటమ్ ఫండ్ సెబి నెట్‌వర్త్ నిబంధనను అందుకోవడానికి మరో మూడేళ్ల సమయముంది. కాబట్టి ఆందోళన చెందకుండా సదరు మ్యూచువల్ ఫండ్‌లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను యూటీఐ ఆపర్చునిటీస్, ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ, రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తు ఉన్నాను. దీర్ఘకాలంలో ఈ ఫండ్స్ నాకు మంచి రాబడులనిస్తాయా? - నందిని, తిరుపతి మీరు చాలా మంచి ఫండ్స్‌నే ఎంచుకున్నారు. ఇవన్నీ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్. వివిధ రకాల మార్కెట్ క్యాపిటలైజేషన్లు, వివిధ రంగాల కంపెనీల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. గత 5-6 ఏళ్లలో మార్కెట్లు అనిశ్చితిగా ఉన్నప్పటికీ, ఈ ఫండ్స్ మంచి పనితీరునే కనబరిచాయి. ప్రస్తుతం మార్కెట్లు మంచి రైజింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఫండ్స్ మంచి రాబడులనే అందించగలవు. ఎలాంటి శషభిషలు లేకుండా ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. నేను ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా ఒక షార్ట్‌టెర్మ్ డెట్ ఫండ్‌లో ఒకేసారి రూ.రెండున్నర లక్షలు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అంతేకాకుండా మరో మిడ్-క్యాప్ ఫండ్‌లో కూడా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాకు కొన్ని మంచి ఫండ్స్‌ను సూచించండి. - జుబేదా బేగం, హైదరాబాద్ మిడ్-క్యాప్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేద్దామనుకోవడం మంచి ఆలోచన. మీరు ఎంచుకోవడానికి కొన్ని మంచి మిడ్-క్యాప్ ఫండ్స్- బీఎన్పీ పారిబస్ మిడ్ క్యాప్, రెలిగేర్ ఇన్వెస్కో మిడ్ ఎన్ స్మాల్‌క్యాప్ ఫండ్. వీటిల్లో ఏదైనా ఒక ఫండ్‌ను ఎంచుకోండి. అంతేకాకుండా ఇదే ఫండ్ ఫ్యామిలీ నుంచి ఏదైనా షార్ట్-టెర్మ్ డెట్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. నేను కొన్ని ఫండ్స్ డెరైక్ట్ గ్రోత్ స్కీముల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 15-20 శాతం రాబడులను ఆర్జించగలిగాను. వచ్చిన లాభాలను ఇదే మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన లిక్విడ్ ఫండ్స్‌కు మళ్లిద్దామనుకుంటున్నాను. నా ఆలోచనా విధానం కరెక్టేనా? -అనంతరామ్, వరంగల్ మార్కెట్ల ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోకుండా దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడమే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ముఖ్య ఉద్దేశం. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న సొమ్ములు 2 లేదా 3 ఏళ్లలో మీకు అవసరమైన పక్షంలో వచ్చిన లాభాలను డెట్ ఫండ్స్‌కు మళ్లించుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న సొమ్ములు మీకు పదేళ్లలోపు అవసరం లేదనుకోండి.. ఈ స్కీమ్ల్లోనే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మార్కెట్లు ఎప్పుడూ అనిశ్చితిగా ఉంటాయి. ఎప్పుడు ఎంత వరకూ పడతాయో, ఎంత వరకూ పెరుగుతాయో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతా సానుకూలంగా ఉంటే మార్కెట్లు మరిన్ని కొత్త రికార్డులను సృష్టించగలవు. అందుకని మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి తగినంత సమయముంటే, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగించండి.