breaking news
i Alert
-
నష్టాల బస్సుకు ‘సెన్సర్’ ఊరట
సాక్షి, హైదరాబాద్: ‘అంతా బాగానే ఉంది, కొత్తగా చేసేదేముంది’ అన్న నిర్లిప్తత వీడితే ప్రభుత్వ సంస్థల్లోనూ అద్భుతాలు చేయవచ్చని తెలంగాణ ఆర్టీసీ నిరూపిస్తోంది. దశాబ్దన్నర కాలం పాటు వరుస నష్టాలతో కొట్టుమిట్టాడిన సంస్థకు ఇప్పుడు చిన్న సాంకేతిక మార్పు పెద్ద ఊరటనిస్తోంది. డ్రైవర్ల డ్రైవింగ్ తీరును అనుక్షణం పర్యవేక్షించే ‘ఐ–అలెర్ట్’ సెన్సర్ వ్యవస్థతో సంస్థ ఖజానాకు నెలకు రూ.2 కోట్ల చొప్పున ఆదా అవుతోంది. కేవలం 16%బస్సుల్లో ఈ విధానాన్ని అమ లు చేయడంతోనే ఏడాదిలో భారీ దుబారాకు అడ్డుకట్ట పడటం విశే షం. అయితే, ఇదే మార్పును కొన్నేళ్ల కిందటే తీసుకొచ్చి ఉంటే ఆర్టీ సీ నష్టాల పద్దు ఇంతగా పెరిగేది కాదన్న చర్చ ఇప్పుడు మొదలైంది.తొలుత 1,500 బస్సుల్లో..తెలంగాణ ఆర్టీసీ నెలకు దాదాపు 1.80 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ఆర్టీసీ ఆదాయంలో పెద్ద భాగం దీనికే వ్యయమవుతోంది. దీన్ని ఎంత నియంత్రిస్తే సంస్థకు అంత ఆదా అవుతుంది. గత ఏడాదిన్నరగా కీలక పోస్టుల్లోకి వచ్చిన కొత్త అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. ఆర్టీసీకి ఎక్కువగా బస్సులు సరఫరా చేసే అశోక్ లేలాండ్ కంపెనీ ‘ఐ–అలెర్ట్’ పేరుతో ఓ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీన్ని ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేశారు. మొదట 10 బస్సుల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఆ సంస్థ ఉచితంగా సాంకేతికతను అందించింది. ఫలితాలు మెరుగ్గా ఉండటంతో దూరప్రాంతాలకు నడిచే భారత్ స్టేజ్–6 మోడల్‌కు చెందిన 1,500 బస్సుల్లో ఏర్పాటు చేశారు.‘ఐ–అలెర్ట్’ ఎలా పనిచేస్తుందంటే?బస్సును డ్రైవర్ ఎలా నడుపుతున్నాడో ‘ఐ–అలెర్ట్’ అనుక్షణం గుర్తిస్తుంది. బ్రేకులు, గేరు, యాక్సిలేటర్.. ఇలా ప్రతి ప్రధాన భాగాన్ని నిర్వహిస్తున్న తీరును సెన్సర్ల ద్వారా పరిశీలిస్తుంది. బస్సు ప్రయాణం ప్రారంభమవటానికి ఎంత ముందు ఇంజిన్ ఆన్ అయింది? తొలుత ఏ గేర్ వాడారు? గేర్లను ఎలాంటి పరిస్థితిలో మారుస్తున్నారు? సడన్ బ్రేకులు ఎన్ని సార్లు వేశారు? యాక్సిలేటర్ వినియోగం ఎలా ఉంది? సిగ్నళ్ల వద్ద, బస్సు ఆగిన ఇతర ప్రాంతాల్లో ఇంజిన్ ఆన్‌లో ఉంటోందా?.. ఆఫ్ చేస్తున్నారా? వేగ పరిమితి ఎలా ఉంది? ఇలా ప్రతి అంశాన్ని ఆ వ్యవస్థ పరిశీలిస్తుంది.దానికి స్కోర్ కూడా ఇచ్చి ఫైనల్‌గా గ్రేడ్ కేటాయిస్తుంది. దీన్ని మొబైల్ యాప్ ద్వారా అధికారులు వెంటనే పరిశీలించి డ్రైవింగ్ బాగాలేని డ్రైవర్‌కు నిపుణుల ద్వారా సూచనలు చేయించి మెరుగైన గ్రేడ్ వచ్చేలా చూస్తున్నారు. ఇలా ఏడాదిగా 1,500 బస్సుల డ్రైవర్ల నైపుణ్యంలో చాలా మార్పు వచ్చింది. సగటున నెలకు 1.98 లక్షల లీటర్ల డీజిల్‌ను ఆదా చేయగలుగుతున్నారు. నెలకు సగటున రూ.2 కోట్ల మేర మిగులుతోందని ఆర్టీసీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే డీజిల్ ఆదా వల్ల రోజుకు 16.90 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాల తగ్గుదల నమోదైనట్లు ప్రకటించింది.రూ.36 కోట్లు ఆదా..ఈ టెక్నాలజీతో మంచి ఫలితాలు వస్తుండటంతో ఇటీవల మరో 500 బస్సుల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 వేల బస్సుల్లో ఇది కొనసాగుతోంది. డీలక్స్ బస్సులతోపాటు కొన్ని ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లోనూ అమలు చేశారు. ఆ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చుకాగా, దీని ద్వారా రూ.36 కోట్ల మేర ఆదా అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు టాటా కంపెనీ బస్సుల్లో కూడా, ఆ కంపెనీ అభివృద్ధి చేసిన ఇదే తరహా వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఆపరేషన్ ‘ఆమ్లా’ ఆరంభం
సాక్షి, చెన్నై: ముంబైలో పేలుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ పేలుళ్లకు పాల్పడిన తీవ్రవాదులు సముద్రమార్గం గుండానే దేశంలోకి చొరబడినట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా సముద్ర తీరాల్లో భద్రతను పెంచారు. రాష్ట్రంలో పదమూడు జిల్లాలు సముద్ర తీరాల్లోనే ఉన్నాయి. దీంతో భారత కోస్టు గార్డ్, నావికాదళంతోపాటుగా మెరైన్ పోలీసులు, హార్బర్ పోలీసులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీరి పని తీరుకు సవాల్ విసిరే రీతిలో, ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారో పసిగట్టేందుకు ఆపరేషన్ ఆమ్లా మాక్ డ్రిల్‌ను నిర్వహిస్తున్నారు.ఆపరేషన్ ఆరంభం : 36 గంటల పాటు సాగే ఈ ఆపరేషన్ ఆమ్లా మాక్ డ్రిల్ బుధవారం ఉదయం ఆరు గంటలకు ఆరంభం అయిం ది. మరుసటి రోజు రాత్రి వరకు సముద్ర తీరాల్లో గస్తీ కట్టుదిట్టంగా ఉంటుంది. ఆదిశగా రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, కడలూరు, తూత్తుకుడి, నాగపట్నం, రామనాధపురం, కన్యాకుమారి తదితర 13 సముద్ర తీర జిల్లాల్లో నిఘాను పటిష్ట వంతం చేశారు. ఓ వైపు భారత కోస్ట్ గార్డ్, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని సముద్ర తీర భద్రతా విభాగం, కేంద్ర బలగాలు, మెరైన్ పోలీసులు డేగ క ళ్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోకి సముద్ర తీరం గుండా తీవ్రవాదులు గుంపులు గుంపులుగా బయలు దేరినట్టు ఏక కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సముద్ర తీర జిల్లాల పోలీసు స్టేషన్లకు, ప్రత్యేక భద్రతా విభాగాలు, అధికారులకు పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి సమాచారం చేర వేశారు. పరుగో పరుగు: తీవ్రవాదుల చొరబాటు సమాచారంతో సముద్ర తీర జిల్లాల్లో భద్ర తా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మఫ్టీలో చొరబడే పోలీసుల(తీవ్రవాదుల)ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల్ని తనిఖీలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో నూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పడవల్లో సముద్రంలోకి దూసుకెళ్లారు. చేపల వేట నుంచి వస్తున్న జాలర్లను తనిఖీల అనంత రం అనుమతించారు. కాశిమేడు హార్బర్లోకి ఆరున్నర గంటల సమయంలో వేర్వురుగా రెండు పడవల్లో చెన్నైలోకి చొరబడేందుకు యత్నించిన ఆరుగురిని అరెస్టు చేశారు. నీలాంకరైలో మరో ముగ్గురిని అరెస్టు చేశా రు. ఇంకా మరి కొంత మంది జట్టులు జట్టులుగా సముద్ర తీర జిల్లాల్లో చొరబడనుండడంతో వారి కోసం వేట కొనసాగుతోంది. ఆమ్లా ఆపరేషన్ గురువారం రాత్రి వరకు కొనసాగుతుండడంతో పోలీసులకు విశ్రాంతి లేనట్టే. మఫ్టీలో ఉన్న వాళ్లను వదలి పెట్టిన పక్షంలో ఎక్కడ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనన్న ఆందోళనలతో సముద్ర తీరాల్లో కళ్లు కాయలు కాచేలా భద్ర తా విధుల్లో సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ఈ సారి ఆమ్లా ఆపరేషన్‌లో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరినిసైతం కలుపుకున్నారు. బంగారం పట్టి వేత: ఆపరేషన్ ఆమ్లాలో భాగంగా తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ సమయంలో ఓ యువకుడు కోయంబేడులోకి రావడం, అతడి వద్ద జరిపిన తనిఖీల్లో బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. నగదు సైతం లభించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భువనేశ్వర్‌కు చెందిన రాహుల్ అగర్వాల్‌గా తేలింది. కోయంబత్తూరులోని ఓ బంగారం దుకాణానికి వీటిని తీసుకెళ్తున్న ట్టు పేర్కొన్నా, అందుకు తగ్గ రశీదులు అతడి వద్ద లేవు. పట్టుబడిన 8 కిలోల బంగారం, రూ.8 లక్షల నగదును వాణిజ్య పన్నుల విభాగం అధికారులకు అప్పగించారు.


