breaking news
Hyperloop Transportation Technologies
-
హైపర్‌లూప్ ‘పాడ్’.. అరగంటలో 350 కిలోమీటర్ల ప్రయాణం..
చెన్నై: భూమి మీద విమాన వేగంతో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే హైపర్‌లూప్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆసియాలో అతి పొడవైన హైపర్‌లూప్ ట్యూబ్ (410 మీ) త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. ఇదే సమయంలో ‘పాడ్’(రైలు బోగీ) నమూనాకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఐఐటీ మద్రాస్‌లోని హైపర్‌లూప్ ట్రాప్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ సహాయంతో అభివృద్ధి చేస్తున్న హైపర్‌లూప్ ట్యూబ్ పరిశీలించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘భారత్‌లో త్వరలోనే ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్‌లూప్ ట్యూబ్ అవుతుంది. దీని పొడవు 410 మీటర్లు ఉంటుంది. రానున్న కాలంలో మరో 40 మీటర్లు పొడగిస్తాం. ఆసియాలోనే అతి పొడవైన హైపర్‌లూప్ ఇది. హైపర్‌లూప్ రవాణా కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి అభివృద్ధి చేశాం. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న హైపర్‌లూప్ రవాణా సాంకేతికత ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితాలను ఇచ్చింది. త్వరలోనే అందుబాటులోకి వస్తుందనుకుంటున్నాం’ అని అన్నారు. మరోవైపు.. మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.Longest Hyperloop tube in Asia (410 m)… soon to be the world’s longest.@iitmadras pic.twitter.com/kYknzfO38l— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 16, 2025హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను రైల్వే మంత్రిత్వశాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటీ అభివృద్ధి చేసింది. ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారమైతే 350 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు. హైపర్‌లూప్‌ను ఐదో రవాణా విధానంగా అభివర్ణిస్తారు. హైపర్‌లూప్ టెక్నాలజీలో హైపర్‌లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ.. దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. వీటిలో రైలు బోగీలను పోలిన పాడ్లు ప్రయాణిస్తాయి.India completes its first 422-meter-long Hyperloop test trackWith mass adoption, this high-speed sci-fi project will make it possible to travel 350 km in just 30 minutes pic.twitter.com/q4aeo1uu2X— RT (@RT_com) February 25, 2025సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యంకాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్‌లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగంగా వెళ్లొచ్చు. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగాన్ని ఇవి అందుకునే వీలుందని చెబుతున్నారు. #WATCH | Chennai, Tamil Nadu | Union Minister Ashwini Vaishnaw inspects and assesses the work being done to develop a Hyperloop pod.A Hyperloop pod is a pressurized vehicle designed to travel at high speeds within a low-pressure tube, utilizing magnetic levitation and… pic.twitter.com/TQ1Vc76MkQ— ANI (@ANI) March 15, 2025 -
విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే..
శబ్దవేగంతో దూసుకెళ్లే విమానాల గురించి మనం వినే ఉంటాం. మరి అంతవేగంగా వెళ్లగలిగే ఫ్లైట్‌ని రూపొందించిన శాస్త్రవేత్తలు..అలాంటి ఓ బస్సునో రైలునో ఎందుకు సృష్టించలేకపోతున్నారో ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మన చుట్టూ ఉన్న గాలే అందుకు కారణం. వేగంగా వెళ్లే ఏ వస్తువునైనా అది అడ్డుకుంటుంది. ఆ ఘర్షణలో అగ్గిరాజుకుంటుంది. అందుకే విమానాలు కూడా భూవాతావరణంలో తక్కువ వేగంతో వెళతాయి. ఆకాశంలోకి అంటే శూన్యంలోకి వెళ్లాకే వేగం పుంజుకుంటాయి. ‘మరి అదే శూన్యాన్ని నేలపైనా సృష్టించగలిగితే..? అందుకోసం ఓ పెద్ద ట్యూబుని ఏర్పాటుచేస్తే... అందులో ప్రయాణం సాగితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కి! ఈ కొత్త ఆలోచనకి అతను పేటెంట్ తీసుకోలేదు. దీనిపైన ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చంటూ ప్రకటించాడు. దాంతో వర్జిన్ హైపర్‌లూప్, జెలెరస్ వంటి పదికిపైగా సంస్థలు దీని తయారీలో తలమునకలయ్యాయి. ఇందుకోసం వేలకోట్లు ఖర్చుపెడుతున్నాయి. తాజాగా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్న హైపర్‌లూప్ స్టార్టప్‌ల్లో ప్రధాన స్టార్టప్‌గా ఉన్న వర్జిన్ హైపర్‌లూప్ దాని కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 31లోపు రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గ్రూప్‌నకు చెందిన ఈ ప్రాజెక్ట్‌ను నిలిస్తేస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఎలాన్‌మస్క్‌కు 2013లో హైపర్‌లూప్ అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి 2014లో ‘హైపర్‌లూప్ వన్’ స్టార్టప్‌ను స్థాపించి వందల కోట్లును ఖర్చు చేశారు. టెక్నికల్ డెమోలు, టెస్ట్ ట్రాక్‌లు మినహా ప్రాజెక్ట్‌లో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అయితే తాజాగా సంస్థ తన ఆపరేషన్స్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో టెక్నాలజీ రంగంలో కొంత ఆందోళన మొదలైనట్లు సమాచారం. హైపర్‌లూప్ వన్ 2014లో ప్రారంభించిన తర్వాత బ్రాన్సన్ 2017లో అందులో పెట్టుబడి పెట్టారు. దాంతో అప్పటి నుంచి వర్జిన్ హైపర్‌లూప్ వన్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. కానీ 2018లో జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత బ్రాన్సన్ సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించారు. దాంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌పై ప్రభావం పడంది. ఫలితంగా బ్రాన్సన్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇదీ చదవండి: ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ.. అనంతరం దుబాయ్ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ హైపర్‌లూప్ వన్ స్టార్టప్‌లో మెజారిటీ వాటా కలిగి ఉండడంతో కంపెనీకు సంబంధించి పూర్తి నియంత్రణ దాని చేతిలోకి వెళ్లిపోయింది. 2022 ప్రారంభంలో ఆ సంస్థ హైపర్‌లూప్ వన్‌లోని సగానికిపైగా సిబ్బందిని తొలగించింది. దాంతోపాటు డీపీ వరల్డ్ కార్గోసేవలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా హైపర్‌లూప్ వన్ మేధో సంపత్తి ముగిసిపోతోందని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్టార్టప్‌కు చెందిన కొన్ని ఆస్తులను సైతం డీపీ వరల్డ్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
హైపర్‌లూప్ ఇక యూరప్‌లో
పారిస్: అత్యంత వేగవంతమైన ప్రయాణానికి మానవుడి అద్భుత సృష్టిగా భావిస్తున్న హైపర్‌లూప్ రైల్వే ప్రాజెక్ట్ ఇప్పుడు యూరప్‌లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే దుబాయ్, కెనడా, రష్యాలలో హైపర్‌లూప్ టెక్నాలజీతో రైలు మార్గాల ఏర్పాటుకు ప్రాజెక్టులు ప్రారంభించగా.. ఇటీవల చెక్ రిపబ్లిక్‌లోని బ్రునో నుంచి, స్లొవేకియా రాజధాని బ్రాస్టిస్లావా వరకు హైపర్‌లూప్ రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు హెచ్‌టీటీ(హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాటజీ) ఒప్పందం కుదుర్చుకుంది. యూరప్‌లో హైపర్‌లూప్ ప్రాజెక్టును విస్తరించేందుకు ఫ్రాన్స్‌లోని టౌలౌస్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు హెచ్‌టీటీ వెల్లడించింది. యూరోపియన్ ఎరోస్పేస్ ఇండస్ట్రీకి టౌలౌస్ ప్రాముఖ్యత గల ప్రదేశంగా ఉన్న విషయం తెలసిందే. ఇక్కడ నుంచి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా సెంట్రల్ యూరోపియన్ లైన్లో తమ సేవల విస్తరణకు అనుకూలంగా ఉంటుందని హెచ్‌టీటీ భావిస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన మార్గం గుండా.. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి హైపర్‌లూప్ రైళ్లలో వీలుంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా రాబోయే రోజుల్లో రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో.. 'ద ట్రైన్ ఆఫ్ ద ఫ్యూచర్'గా హైపర్‌లూప్‌ను పేర్కొంటున్నారు. చదవండి: హైపర్‌లూప్ టెక్నాలజీ అంటే ఏమిటీ? -
రెండు గంటల్లో హైదరాబాద్ - శ్రీనగర్!
లాస్ ఏంజెలిస్: హైదరాబాద్ నుంచి శ్రీనగర్ దూరం ఎంతో తెలుసా.. ఏకంగా 2,400 కిలోమీటర్లు. అంతదూరం వెళ్లాలంటే సాధారణంగా అయితే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో.. 40 గంటలు పడుతుంది. కానీ, రెండే రెండు గంటల్లో అంతదూరాన్ని అధిగమించగలమని మీకు తెలుసా? ప్రయాణికులు నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటే ఎంత బాగుండనే ఓ ఆలోచన నుంచి ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మాస్క్‌కు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. అదే 'హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ'. ఇది వచ్చే ఏడాదికల్లా అమెరికాలో కార్యరూపం దాల్చబోతోంది. ముందుగా ప్రయోగాత్మకంగా లాస్ ఏంజెలిస్ నుంచి 610 కిలోమీటర్ల దూరంలోని శాన్ ఫ్రాన్సిస్కోకు హైపర్‌లూప్ వ్యవస్థను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే 610 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంటే హైపర్‌లూప్ ద్వారా గంటకు దాదాపు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చన్న మాట ఓహ్.. విమానం కన్నా రెట్టింపు వేగం. వాట్ యాన్ ఐడియా! 610 కిలోమీటర్ల దూరం వరకు హైపర్‌లూప్ నిర్మాణానికి దాదాపు 1600 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని దీని నిర్మాణానికి ముందుకొచ్చిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పొటేషన్ టెక్నాలజీస్ (హెచ్‌టీటీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డర్క్ అహల్బార్న్ వియన్నాలో జరిగిన ఓ సదస్సులో వెల్లడించారు. జర్మనీలో జన్మించిన ఆయన ప్రస్తుతం అమెరికాలో పలు దిగ్గజ వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నారు. హైపర్‌లూప్ టెక్నాలజీ అంటే ఏమిటీ? ట్యూబ్ ఆకారంలో ఉండే రవాణా వ్యవస్థ. ఇందులో నుంచి గాలిని వెలికితీసి వ్యాక్యూమ్‌ను ఏర్పరుస్తారు. దీనిగుండా ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలు కాప్సుల్ ఆకారంలో ఉంటాయి. వాటికి చలన చోదక శక్తిని కలిగించేందుకు అయస్కాంతాలను అమరుస్తారు. వెలుపలి వాతావరణ పీడనం, భూమ్యాకర్శన శక్తిని తగ్గించేందుకు ఈ వ్యవస్థను పూర్తిగా వంతెనల్లాగా భూమి పైభాగంలోనే నిర్మిస్తారు. మొత్తం ఎనిమిది మంది ప్రయాణించే వీలున్న కాప్సుల్ వాహనాలను తయారు చేస్తారు. ప్రతి 30 సెకండ్లకో కాప్సుల్ వాహనాన్ని దీని గుండా పంపిస్తారు. ఈ మొత్తం వ్యవస్థకు అవసరమయ్యే విద్యుత్‌ను సౌర విద్యుత్ ద్వారా సమకూర్చుతారు. లాస్ ఏంజెలిస్ నుంచి శాన్ ఫ్రాన్సిన్కోకు హైపర్‌లూప్‌లో వెళ్లే ప్రయాణికుడి వద్ద నుంచి 20 డాలర్లను చార్జీకింద వసూలు చేయాలన్నది ప్రాథమిక అంచనా. కేవలం ప్రయాణికుల పీక్ టైమ్‌లోనే చార్జీలు వసూలు చేస్తామని, లీన్ పీరియడ్‌లో ఉచితంగానే ప్రయాణికులను అనుమతిస్తామని డర్క్ అహల్బార్న్ తెలిపారు. హైపర్‌లూప్ అంచనాలకు సరిపడా పెట్టుబడులను ఎలా సమకూరుస్తున్నారని ప్రశ్నించగా, ఇప్పటికే ఎంతోమంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని, తమ లక్ష్యానికి తాము అతి దగ్గరలో ఉన్నామని ఆయన వివరించారు. ప్రయాణికుల నుంచి చార్జీల కింద 20 డాలర్లను మాత్రమే వసూలు చేయడం ద్వారా ప్రాజెక్టు ఎలా లాభదాయకం అవుతుందని ప్రశ్నించగా, హైపర్‌లూప్ నడవడానికి సౌరశక్తి తక్కువే ఖర్చవుతోందని, మిగులు విద్యుత్‌ను ఇతర అవసరాలకు విక్రయించడం ద్వారా ప్రాజెక్టును లాభదాయకం చేయవచ్చని ఆయన తెలిపారు. వాస్తవానికి హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ ఎలాన్ మాస్క్ సొంతాలోచన. ఆయన ఈ విషయాన్ని 2013లోనే బయటపెట్టారు. ఈ ఆలోచనను మరింత అభివృద్ధిచేసి కార్యరూపంలోకి తీసుకరావాల్సిందిగా వ్యాపారవేత్తలను ఆయన బహిరంగంగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని అందిపుచ్చుకున్న డర్క్ ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన దాదాపు ఐదువేల ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్టు ఆయన చెప్పారు.