breaking news
husbands funeral
-
శోకాన్ని దిగమింగుకొని భర్త అంత్యక్రియలకు..
న్యూఢిల్లీ : ఓ మహిళా ఆర్మీ అధికారి శోకాన్ని దిగమింగుకొని తన ఐదు రోజుల పసి బిడ్డతో భర్త అంత్యక్రియలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆర్మీ అధికారికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. మేజర్ కుముద్ దోగ్రా భర్త, భారత ఏయిర్‌ఫోర్స్ అధికారి, వింగ్ కమాండర్ డీవాట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 15న అస్సాం మజులీ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన మరణించిన రెండు రోజులకే కుముద్ దోగ్రా ఓ పాపకు జన్మనిచ్చింది. గత బుధవారం డీవాట్స్ అంతక్రియలు జరగగా ఆమె తన ఐదు రోజుల పాపతో హజరయ్యారు. కుముద్ దోగ్రాకు సెల్యూట్ అంటూ ట్విటర్లో ఈ ఫొటోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దేశం కోసం భారత్ సైన్యం ఎలాంటి త్యాగం చేస్తుందో అనడానికి ఈ ఘటన ఓ నిదర్శనమని ఒకరు, ఆర్మీని విమర్శించే వారంత ఈ ఘటనను చూసి బుద్దితెచ్చుకోవాని ఇంకొకరు ఆమెకు మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు. -
భర్త.. ఆ వెంటనే భార్య మృతి
గన్నేరువరం(కరీంనగర్ జిల్లా): భర్త మృతిచెందాడన్న మనోవేదనతో భార్య కూడా మృతిచెందిన సంఘటన కరీంనగర్జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లిలో జరిగింది. గుంటుక వీరయ్య(80), అతని భార్య రాజవ్వ(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వీరయ్యకు కొద్దిరోజులుగా జ్వరం కూడా వస్తోంది. మంగళవారం రాత్రి వీరయ్య మృతిచెందగా బుధవారం ఉదయం దహన సంస్కారాలు పూర్తిచేశారు. బంధువులు ఇంటికి వచ్చేసరికి వీరయ్య భార్య కూడా మృతిచెందింది. ఒకేసారి వృద్ధ దంపతులు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.