breaking news
Husband-wife
-
వివాహితగా...!
‘మీ పెళ్లెప్పుడు?’ అనడిగితే... ‘సమయం వచ్చినప్పుడు’ అని చెబుతుంటారు కాజల్ అగర్వాల్. నిజజీవితంలో గృహిణి ఎప్పుడవుతారో తెలియదు కానీ, ఓ హిందీ చిత్రంలో మాత్రం ఆ పాత్ర పోషించనున్నారు. ‘సీజ్ ఫైర్’ అనే ఇరానియన్ మూవీకి రీమేక్ ఇది. షర్మాన్ జోషి, కాజల్ అగర్వాల్ నాయకా నాయికలుగా అజయ్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రకథ విషయానికొస్తే... చిరుకోపాలు, సరదా సరదా అలకలతో తమ సంసార జీవితాన్ని హాయిగా సాగించే భార్యాభర్తల మధ్య అనుకోకుండా మనస్పర్థలు నెలకొంటాయి. వ్యవహారం విడాకుల వరకూ వచ్చాక, అసలు తప్పెవరిదో ఆలోచించడం మొదలుపెడతారు. చివరికి తమ తప్పులు తెలుసుకుని, కలిసి జీవించాలనుకుంటారు. ఇందులో భార్యాభర్తలుగా షర్మాన్, కాజల్ నటించనున్నారు. ఇరాన్లో ‘సీజ్ఫైర్’ ఘనవిజయం సాధించింది. 2006లో విడుదలైన ఈ చిత్రం ఇరానియన్ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హాలీవుడ్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారట. హిందీ వెర్షన్ కోసం కథలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారని సమాచారం. -
విషం సేవించి భార్యాభర్తల ఆత్మహత్య
వేలూరు, న్యూస్‌లైన్: అప్పుల బాధ తట్టుకోలేక పుదుకోట్టై జిల్లాకు చెందిన ఒక కుటుంబ తిరువణ్ణామలైలోని లాడ్జిలో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. పుదుకోట్టై జిల్లా మరమలై నగర్‌కు చెందిన శేఖర్(57) టైలర్ వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య హేమమాలిని (55), కుమారుడు పురనేశ్వరన్(17) ఉన్నారు. కుమారుడు ప్లస్‌టూ చదువుతున్నాడు. వీరు మంగళవారం తిరువణ్ణామలై చేరుకొని అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పోలూర్ రోడ్డులోని ఒక లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల వరకు వారి గది తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపులు తట్టారు. ఎంతసేపటికీ స్పందిం చక పోవడంతో గదిపైనున్న కిటికీల్లో చూడగా వారి నోటిలో నురుగు వచ్చి మృతి చెంది ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ పయణి, పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే శేఖర్, హేమమాలిని మృతి చెందారు. పురనేశ్వరన్ కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నాడు. అతన్ని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గదిని పరిశీలించగా మంచంపై విషం బాటిళ్లు, శీతల పానీయాలు, వాటి పక్కన ఒక లెటరు ఉండడాన్ని గమనించారు. ఆ లేఖలో అప్పుల బాధ తాళలేక, వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసివుంది. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురనేశ్వరన్ పరిస్థితి విషమంగా ఉంది.